ETV Bharat / sports

'అభిషేక్ బ్యాటింగ్​ స్ట్రైల్ ఫుల్​ క్లాస్​- అచ్చం యువీలానే' - Abhishek Sharma IPL - ABHISHEK SHARMA IPL

Abhishek Sharma IPL: సన్​రైజర్స్ యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ, టీమ్ఇండియా మాజీ ప్లేయర్ యువరాజ్​ సింగ్​ను గుర్తుచేస్తున్నాడని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు.

Abhishek Sharma IPL
Abhishek Sharma IPL (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 9, 2024, 3:30 PM IST

Updated : May 9, 2024, 3:45 PM IST

Abhishek Sharma IPL: 2024 ఐపీఎల్​లో సన్​రైజర్స్​ యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ అదరగొడుతున్నాడు. బుధవారం లఖ్​నవూతో జరిగిన మ్యాచ్​లో 28 బంతుల్లోనే 267.86 స్ట్రైక్​ రేట్​తో 75 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అభిషేక్​పై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అభిషేక్ తన బ్యాటింగ్ స్కిల్స్​తో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్​ను గుర్తుచేస్తున్నాడని తాజాగా కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

'అభిషేక్ శర్మ బ్యాటింగ్​తో ఆకట్టుకుంటున్నాడు. ట్రావిస్ హెడ్​తో పోలిస్తే అభిషేక్ హిట్టింగ్ స్ట్రైల్ కాస్త డీసెంట్​గా ఉంది. అతడి డౌన్​స్వింగ్ బాగుంది. క్రీజులో ఆడుతున్నప్పుడు తన స్ట్రైల్ యువరాజ్ బ్యాటింగ్​ను గుర్తుచేస్తుంది. టీమ్ఇండియా పిలుపు అతడికి ఎంతో దూరం లేదు. అతడిని త్వరలోనే టీమ్ఇండియాలో చూస్తాం' అని ఆకాశ్ అన్నాడు.

అభిషేక్ ఒపికపట్టు: టీమ్ఇండియా మాజీ ప్లేయర్ యవరాజ్ సింగ్, అభిషేక్ శర్మ రీసెంట్​ ఇన్నింగ్స్​పై స్పందించాడు. నిలకడగా ఆడుతూ, ఒపిక పట్టాలంటూ ట్వీట్ చేశాడు. 'వెల్ ప్లే అభిషేక్. నువ్వు ఇలాగే నిలకడగా ఆడుతు, ఓపికగా ఉండు. నీకూ ఓ టైమ్ వస్తుంది' అని యువీ అన్నాడు. ఇక అభిషేక్ అద్భుతంగా రాణిస్తున్న అతడు ఇప్పుడే వరల్డ్​కప్​కు సిద్ధంగా లేడని యువీ ఇటీవల అన్నాడు. 'బీసీసీఐ అభిషేక్​కు ముందు కొన్ని అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడే ఛాన్స్ ఇవ్వాలి. అప్పుడే అతడు ఐసీసీ ఈవెంట్​లలో అడగలడు. అభిషేక్​ నుంచి మరికొన్ని భారీ ఇన్నింగ్స్​ రావాలి' అని యువరాజ్ ఇదివరకు ఓ సందర్భంలో అన్నాడు.

వరల్డ్​కప్​ తర్వాత పక్కా! పొట్టి ప్రపంచకప్​ తర్వాత అభిషేక్ పక్కా టీమ్ఇండియాలో ఎంట్రీ ఇస్తాడని న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హసన్ అన్నాడు.'అభిషేక్ పవర్​ప్లేలో స్పిన్నర్లు, పేసర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. తన హిట్టింగ్​తో అభిషేక్ నాణ్యమైన ప్లేయర్​గా ఎదుగుతున్నాడు. టీ20 వరల్డ్​కప్​ తర్వాత పక్కా భారత జట్టులోకి వస్తాడు' అని మైక్ అన్నాడు.

ఇక ప్రస్తుత ఐపీఎల్​లో అభిషేక్ రెచ్చిపోతున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా బ్యాట్​తోనే సమాధానం చెబుతున్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్​లు ఆడిన అభిషేక్ ఏకంగా 205.64 స్ట్రైక్ రేట్​తో 401 పరుగులు చేశాడు. ఇందులో 30 ఫోర్లు, 35 సిక్స్​లు ఉన్నాయి.

ట్రావిస్​, అభిషేక్ మెరుపులు - ఒక్క వికెట్ కోల్పోకుండా సన్​రైజర్స్ విక్టరీ - SRH VS LSG IPL 2024

58 బంతుల్లోనే 166 ఉఫ్‌ - సన్​రైజర్స్​ ఖాతాలో రికార్డులే రికార్డులు - IPL 2024 LSG VS SRH

Last Updated : May 9, 2024, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.