ETV Bharat / sports

సన్​రైజర్స్ ఆ'రేంజ్​' మారింది- సక్సెస్ వెనకాల 'ఒక్కడు'- చెప్పిమరి చేస్తున్నాడుగా! - IPL 2024 - IPL 2024

Sunrisers Hyderabad IPL 2024: సన్​రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్​లో చాలా కొత్తగా కనిపిస్తోంది. ఎప్పుడూ బౌలింగ్​పై ఆధారపడే జట్టు ఈసారి బ్యాటింగ్​లో రికార్డులు సృష్టిస్తోంది.

SUNRISERS
SUNRISERS
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 11:54 AM IST

Updated : Apr 21, 2024, 12:23 PM IST

Sunrisers Hyderabad IPL 2024: ఐపీఎల్​లో ఒకప్పుడు 130- 170 స్కోర్లను డిఫెండ్ చేసి కాపాడుకునే సన్​రైజర్స్​ ప్రస్తుత సీజన్​లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ప్రదర్శన చేస్తోంది. ఈ సీజన్​లో ఒకటి, రెండు కాదు ఏకంగా మూడు సార్లు 260+ స్కోర్లు నమోదు చేసి తమ బాదుడు గాలివాటం కాదని నిరూపించుకుంటోంది. ఈ క్రమంలో సన్​రైజర్స్​ దెబ్బకు ఐపీఎల్​ కాదు ఇంటర్నేషనల్ టీ20 రికార్డులు సైతం బద్దలవుతున్నాయి. సన్​రైజర్స్ 150 పరుగులు బాదితే చాలు అనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు ఈజీగా 200 క్రాస్ చేస్తోంది.

నాయకత్వం: ఒకప్పుడు సన్​రైజర్స్ ప్లేయర్లు క్రీజులో కాస్త ఇబ్బందిగా కనిపించేవారు. డేవిడ్ వార్నర్ రాకతో కాస్త రూటు మార్చి పలు విజయాలు నమోదు చేసినా, అతడు జట్టును వీడిన తర్వాత మళ్లీ పాత కథే అయ్యింది. గత మూడు సీజన్​లు ప్రత్యర్థులకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేదు. అయితే వరల్డ్​కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్​ రాకతో సన్​రైజర్స్ దశ మారింది. ఈ సీజన్​లో ఆట దూకుడూగా ఉంటుందని టోర్నీ ప్రారంభానికి ముందే కెప్టెన్ ముందుగానే ప్రత్యర్థులను హెచ్చరించాడు. ఇప్పుడు అది చేతల్లో చూపిస్తున్నాడు.

ప్రతీ ప్లేయర్ పూర్తి ఆత్మ విశ్వాసంతో క్రీజులో అడుగుపెడుతున్నారు. వచ్చీ రావడంతోనే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఎలాంటి దిగులు లేకుండా స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు సాధిస్తున్నారు. అందువల్లే జట్టు భారీ స్కోర్లు నమోదు చేయగలుగుతుంది. అటు బౌలింగ్​లోనూ పరుగులు భారీగా సమర్పించుకున్నప్పటికీ ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఆడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కెప్టెన్ కమిన్స్ సన్​రైజర్స్ గేమ్ ప్లాన్ పూర్తిగా మార్చేశాడు. ఎటాకింగ్ గేమ్​తో పాజిటివ్ ఫలితాలు అందుకుంటున్నాడు.

ఇక ఇప్పటివరకు 7 మ్యాచ్​లు ఆడిన సన్​రైజర్స్ 5 మ్యాచ్​ల్లో నెగ్గింది. ఫలితంగా 10 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఫుల్​ స్వింగ్​లో సన్​రైజర్స్ ఇకపై కూడా ఇదే జోరు కొనసాగించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అదే జరిగితే ఈ సీజన్​ ఛాంపియన్​గా నిలిచే అవకాశమూ లేకపోలేదు.

సన్​రైజర్స్ x దిల్లీ- ఆరెంజ్ కాదు డేంజర్ ఆర్మీ- దెబ్బకు రికార్డులు బ్రేక్! - IPL 2024

అదరగొట్టేసిన సన్​రైజర్స్​ - వరుసగా నాలుగో విజయం - IPL 2024

Last Updated : Apr 21, 2024, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.