Sunil Gavaskar About Border Gavaskar Trophy : తాజాగా జరిగిన టెస్ట్ సిరీస్‌లో సొంతగడ్డపై ఘొర పరజయాన్ని చవి చూసిన భారత జట్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ క్రికెటర్లు అయిన రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీపై అటు అభిమానులతో పాటు ఇక మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు 70 విజయాల శాతంతో పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్లో కొనసాగిన భారత జట్టు, ఈ ఓటమితో ఆ పాయింట్స్ కాస్త 58 శాతానికి దిగి రెండో స్థానానికి పడిపోయింది. ఆ స్థానంలో ఆస్ట్రేలియా మొదటి స్థానానికి చేరుకుంది. అయితే డబ్ల్యూటీసీ 2025 ఫైనల్లో చోటు దక్కించుకోవాలంటే, ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ గావస్కర్ 5 టెస్ట్‌ల ట్రోఫీని 4-0 ఆధిక్యంతో గెలవాల్సి ఉంటుంది. లేకుంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇప్పుడీ సమస్యలను ఉద్దేశించి మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్ సిరీస్‌లో ఓడిన తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం కన్నా, బోర్డర్ గావస్కర్ ట్రోఫీలోనైనా టీమ్ఇండియా గెలిచినా సంతోషమే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. WTC ఫైనల్ గురించి కాకూండా ఈ సిరీస్ గెలవడంపై దృష్టి సారించాలని టీమ్ఇండియాకు సూచించాడు.
'టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై టీమ్ఇండియా 4-0తో ఓడించలేదు. అలా జరిగితే మాత్రం నేను ఎంతో సంతోషిస్తాను. కానీ 4-0 ఎందుకు? భారత్ 3-1, లేదా 4-0తో సిరీస్ గెలుస్తుందా? అనేది ఇప్పుడు అనవసరం. అసలు డబ్ల్యూటీసీ ఫైనల్ గురించే నేను మాట్లాడదలుచుకోవడం లేదు. ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచే విషయంలో ఫోకస్ పెడితే చాలు. సిరీస్ గెలిచారా? లేదా అనేది అనవసరం. కానీ గెలవడం మాత్రం ముఖ్యం. ఎందుకంటే ప్రస్తుతం భారత అభిమానులంతా వీరు చేసిన పనికి తీవ్ర నిరాశలో ఉన్నారు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ గెలిస్తేనే ఉపశమనం కలుగుతోంది.'అని సునీల్ గావస్కర్ చెప్పుకొచ్చారు.
గత రెండు ఆసీస్ టూర్లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. 2018-19లో 2-1తో తొలిసారి సిరీస్ గెలిచిన టీమ్ఇండియా, ఆ తర్వాత 2020-21లోనూ 2-1తో సిరీస్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రానున్న సిరీస్‌లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది.
సీనియర్లపై BCCI సీరియస్- ఆ సిరీస్ తర్వాత వీళ్ల ఫ్యూచర్ డిసైడ్!
స్వదేశంలో ఘోర వైఫల్యం! - బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో రోహిత్ ఆడుతాడా?