SRH VS MI IPL 2024 : ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరబాద్ జట్టు సరికొత్త రికార్డు నెలకొల్పింది. టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ఘనతను సాధించింది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో 277 పరుగులు చేసింది. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ 16 ఏడిషన్స్లో ఇదే హైయ్యెస్ట్ స్కోర్. అయితే ఇందులో ఒక్క సెంచరీ కూడా లేకపోవడం విశేషం. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక రికార్డు స్కోర్ బెంగళూరు (263)పై ఉంది. 2013లో పుణెపై ఈ స్కోర్‌ని నమోదు చేసింది.
ఇక హైదరాబాద్ బ్యాటర్లు క్లాసెన్(80*) అభిషేక్ శర్మ(63), ట్రావిస్ హెడ్(62), మార్క్రమ్(42) అదరగొట్టారు. మయాంక్(11) పరుగులు చేశాడు. దీంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. మరోవైపు ముంబయి బౌలర్లలో హార్దిక్, కోయిట్జి, పీయూష్ చావ్లా తలో వికెట్ పడగొట్టారు.
-
The moment when @SunRisers created HISTORY!
— IndianPremierLeague (@IPL) March 27, 2024
Final over flourish ft. Heinrich Klaasen 🔥
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #SRHvMI pic.twitter.com/QVERNlftkb
రోహిత్ 200 రికార్డు
ఇక ఇదే వేదికగా ముంబయి ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ కూడా అరుదైన ఘనతను అందుకున్నాడు. ముంబయి ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో తన 200వ గేమ్‌ను ఆడి, ఈ రికార్డును తన ఖాతాలో వేసుకోనున్న మొదటి ఆటగాడిగా హిట్ మ్యాన్ రికార్డు సృష్టించాడు. అలా ఐపీఎల్‌లో ఒక ఫ్రాంచైజీ తరఫున 200 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. అతనికంటే ముందు ఈ ఘనతను విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని అందుకున్నారు.
ముంబయి తుది జట్టు :
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, నమన్ ధీర్, తిలక్ వర్మ, పీయూష్ చావ్లా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, కోయెట్జీ, షామ్స్ ములానీ, జస్ప్రీత్ బుమ్రా, క్వెనా మఫాకా
సబ్‌స్టిట్యూట్స్: డెవాల్డ్ బ్రెవిస్, నెహాల్ వధేరా, రొమారియో షెఫర్డ్, నబీ, విష్ణు వినోద్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు :
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఏడన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ మార్కండే, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్
సబ్‌స్టిట్యూట్స్: వాషింగ్టన్ సుందర్, నితీశ్ రెడ్డి, ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, ఉపేంద్ర యాదవ్
చిక్కుల్లో చెన్నై ప్లేయర్!- సమీర్ రిజ్వీ ఏజ్ గురించి నెట్టింట చర్చ - Sameer Rizvi Age Fraud
గుజరాత్‌ను చిత్తుగా ఓడించిన చెన్నై - వరుసగా రెండో విజయం - CSK vs GT 2024 IPL