ETV Bharat / sports

స్పిన్నర్లను అడ్డుకునేదెలా- కమిన్స్​ సేన ప్లాన్ ఎలా ఉండనుంది? - IPL 2024

SRH vs KKR IPL Final 2024: సన్​రైజర్స్- కోల్​కతా టైటిల్ ఫైట్​కు సిద్ధమవుతున్నాయి. కొన్ని గంటల్లోనే చెన్నై వేదికగా ఈ పోరు జరగనుంది. మరి స్పిన్​కు అనుకూలించే చెపాక్​లో సన్​రైజర్స్ భారీ స్కోర్ చేయగలదా?

SRH vs KKR IPL Final 2024
SRH vs KKR IPL Final 2024 (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 11:48 AM IST

SRH vs KKR IPL Final 2024: 2024 ఐపీఎల్​ ఫైనల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్- కోల్​కతా నైట్​రైడర్స్ ఆదివారం తలపడనున్నాయి. లీగ్​ స్టేజ్​తోపాటు ప్లేఆఫ్స్​లోనూ రాణించిన రెండు అత్యుత్తమ జట్ల మధ్యే టైటిల్ పోరు జరగనుంది. అయితే సన్​రైజర్స్ బ్యాటింగ్​లో టాపార్డర్​ (హెడ్, అభిషేక్, క్లాసెన్)పై ఎక్కువగా ఆధారపడింది. క్వాలిఫయర్​- 1లో ఇది స్పష్టమైంది. ఇక లీగ్ స్టేజ్​ ఆఖరి మ్యాచ్​లో పంజాబ్ పై కూడా దాదాపు ఈ పరిస్థితే ఎదురైంది. ఈ మ్యాచ్​లో హెడ్ డకౌటైనా, అభిషేక్ ఆదుకోవడం వల్ల గట్టెక్కింది.

ఇక ఆదివారం ఆడనున్నది ఫైనల్ మ్యాచ్. టైటిల్ ముద్దాడాలంటే తప్పక నెగ్గాల్సిందే. ఈ క్రమంలో సన్​రైజర్స్ ఫ్యాన్స్​ను కేకేఆర్ స్పిన్ బౌలింగ్ కాస్త కలవరపెడుతుంది. ఇరుజట్లు బ్యాటింగ్​లో సమజ్జీవులుగా ఉన్నా, బౌలింగ్​లో చూస్తే, సన్​రైజర్స్ కంటే కోల్​కతా కాస్త బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. పైగా ఫైనల్​కు ఆతిథ్యమివ్వనున్న చెన్నై చెపాక్ స్టేడియం స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇది కేకేఆర్​కు బాగా కలిసొచ్చే అంశంగా మారనుంది.

కేకేఆర్ స్పిన్ ద్వయం వరుణ్ చక్రవర్తి (20)- సునీల్ నరైన్ (16) ఇద్దరూ కలిసి 36 వికెట్లు పడగొట్టారు. ఈ సీజన్​లో వీరిద్దరూ కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించారనే దానికి ఇదే ఉదాహరణ. ఇక రీసెంట్​గా అహ్మదాబాద్​లో జరిగిన క్వాలిఫయర్​- 1లో నరైన్ కాస్త ఎక్కువ పరుగులిచ్చినా, వరుణ్ పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు దక్కించుకున్నాడు. దీంతో సన్​రైజర్స్ టాపార్డన్​ను దెబ్బకొట్టేందుకు కేకేఆర్ స్పిన్ అస్త్రాన్ని కచ్చితంగా ఉపయోగిస్తుంది. ఇక సన్​రైజర్స్ బ్యాటర్లు స్పిన్​​ బౌలింగ్​లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓ ప్రణాళిక ప్రకారం స్పిన్నర్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇక సన్​రైజర్స్​లో చెప్పుకోదగ్గ స్పిన్నర్లు లేరన్నది వాస్తవం. రీసెంట్​గా క్వాలిఫయర్​- 2లో అభిషేక్, షహబాజ్ రాణించడం వల్ల సన్​రైజర్స్ గెలుపు సాధ్యమైంది. కానీ, అభిషేక్​ను పూర్తి స్థాయి స్పిన్నర్​గా పరిగణించలేం. కాబట్టి కమిన్స్​ సేన ఓ నాణ్యమైన స్పిన్నర్​ను బరిలోకి దింపితే ఫలితం అందుకునే అవకాశం ఉండొచ్చు.

బెస్ట్ vs బెస్ట్: రైజర్స్- రైడర్స్- కప్పు కొట్టేదెవరో? - IPL 2024

'అభిషేక్‌ అదుర్స్​- టీమ్ఇండియాకు అతడే బలం!' - IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.