Smriti Mandhana Gifts Phone to Fan : కొందరు క్రికెటర్లకు వీరాభిమానులు ఉంటారు. తమ ఫేవరెట్ ప్లేయర్స్‌ను ఒక్కసారైనా కలవాలని ఆశపడుతుంటారు. అలాంటి ఛాన్సే వస్తే, పైగా ఆ సమయంలో ఆ క్రికెటర్ మీకు ఓ గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు అదే సంతోషాన్ని ఓ శ్రీలంక బాలిక సొంతం చేసుకుంది. ఆ బాలిక పేరు అదీషా పెరాత్. మ్యాచ్ అనంతరం ఈ దివ్యాంగురాలు తన ఫేవరెట్ క్రికెట్ స్టార్ మందానను కలిసింది.
జులై 19 శుక్రవారం దంబుల్లాలో భారత్- పాకిస్థాన్ మహిళల ఆసియా కప్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఈ అభిమానికి స్పెషల్ గిఫ్ట్ కూడా దక్కింది. స్టార్ ఇండియన్ బ్యాటర్ స్మృతి మందాన ఆ బాలికకు బహుమతిగా ఫోన్ అందించింది.
- స్పెషల్ వీడియో
శ్రీలంక క్రికెట్ పోస్ట్ చేసిన దీనికి సంబంధించిన వీడియోలో - మందాన వీల్ ఛెయిర్‌లో ఉన్న అభిమానితో మాట్లాడటం కనిపిస్తుంది. ఆమెను మ్యాచ్ ఎంజాయ్ చేశావా? అని కూడా అడుగుతుంది. కొంత సేపు మాట్లాడిన తర్వాత, అదీషా షెరాత్‌కు మందాన హై-ఫైవ్ ఇచ్చింది. ఆ ప్రత్యేక అభిమాని, ఆమె తల్లితో కూడా ఫోటో దిగింది. తన అభిమాన క్రికెటర్‌ను కలుసుకున్నందుకు అదీషా హెరాత్ చాలా సంతోషంగా కనిపించింది. ఇది తనకు జీవితకాల జ్ఞాపకంగా మిగులుతుందని ఆ బాలిక పేర్కొంది.
- కూతురు అదృష్టంపై ఆమె తల్లి ఏమందంటే?
స్మృతి మందానతో మాట్లాడే అవకాశం తన కుమార్తెకు లభించడం ఎంతో అదృష్టమని అదీషా తల్లి మాట్లాడటం వీడియోలో కనిపించింది. ‘నా కుమార్తె మ్యాచ్ చూడాలని అనుకుంది. అన్ ఎక్స్‌పెక్టెడ్‌గానే ఇక్కడికి వచ్చాం. మేము భారత జట్టులోని మిస్ మందానను కలిశాం. నా కుమార్తె ఆమె నుంచి ఫోన్ బహుమతిగా అందుకుంది. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఆమె నుంచి గిఫ్ఠ్ పొందడం నా కుమార్తె అదృష్టం.’ అని చెప్పింది.
- పాకిస్థాన్‌ని చిత్తు చేసిన భారత్
దంబుల్లా వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో భారత్ తమ ఆసియా కప్ జర్నీని ప్రారంభించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్, 108 పరుగులకే ఆలౌట్ అయింది. బౌలర్లలో దీప్తి శర్మ అదరగొట్టింది. 3/20తో అద్భుత గణాంకాలు నమోదు చేసింది. శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్ కూడా రెండేసి వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్‌కి దిగిన భారత్‌కు స్మృతి మంధాన, షఫాలీ వర్మ అద్భుత ప్రారంభం అందించారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 16వ ఓవర్‌లో భారత్, ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.Adeesha Herath's love for cricket brought her to the stadium, despite all the challenges. The highlight of her day? A surprise encounter with her favorite cricketer, Smriti Mandhana, who handed her a mobile phone as a token of appreciation 🥺
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 20, 2024
𝐌𝐨𝐦𝐞𝐧𝐭𝐬 𝐥𝐢𝐤𝐞 𝐭𝐡𝐞𝐬𝐞… pic.twitter.com/iqgL2RNE9v
కోహ్లీ గురించి షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన డీకే! - Virat kohli
పారిస్ ఒలింపిక్స్‌కు 70వేల కోట్ల ఖర్చు- హిస్టరీలో రిచ్చెస్ట్ సీజన్ ఇదే! - PARIS OLYMPICS 2024