ETV Bharat / sports

'వరల్డ్​కప్​ టీమ్​లో ప్లేస్ దక్కకపోతే ఆ పని చేస్తా'- గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! - 2024 T20 World Cup

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 12:30 PM IST

Updated : Apr 26, 2024, 2:26 PM IST

Shubman Gill T20 World Cup: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్ వరల్డ్​కప్ సెలెక్షన్​పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకు గిల్ ఏమన్నాడంటే?

Shubman Gill T20 World Cup
Shubman Gill T20 World Cup

Shubman Gill T20 World Cup: 2024 టీ20 వరల్డ్​కప్ టీమ్ఇండియా సెలక్షన్​ క్రీడా వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్​గా మారింది. కొన్ని రోజుల నుంచి ప్రపంచకప్​ జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు వ్యక్తిగత అభిప్రాయాలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వరల్డ్​కప్​ జట్టు విషయంలో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు జట్టులో స్థానం దక్కకపోతే, టీమ్​కు మద్దతిస్తూ ప్లేయర్లను ప్రోత్సహిస్తానని అన్నాడు.

ప్రముఖ స్పోర్ట్స్ పాడ్​కాస్ట్ స్పోర్ట్స్ టాక్​లో రీసెంట్​గా పాల్గొన్న గిల్ ఈ కామెంట్స్ చేశాడు. 'ఇదివరకు టీమ్ఇండియా ఏ ప్రత్యర్థితో సిరీస్​ ఆడినా ఆ జట్టులో గిల్ పేరు కచ్చితంగా ఉండేది. అలాంటిది, టీ20 వరల్డ్​కప్​ జట్టులో గిల్​కు స్థానం ఉంటుందా? గిల్​కు ఇతర యంగ్ ప్లేయర్ల నుంచి పోటీ ఎదురుకానుందా? అన్న చర్చలు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఇలాంటివి విన్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది?' అని పాడ్​కాస్ట్ యాంకర్ అడిగాడు. దానికి గిల్ ఇంట్రెస్టింగ్​గా సమాధానం ఇచ్చాడు. 'ప్రతీ ప్లేయర్​కు సొంత దేశానికి ఆడడం అనేది ఓ కల. గతేడాది జరిగిన వన్డే వరల్డ్​కప్​ ప్రారంభంలో నేను డెంగీ బారిన పడ్డాను. ఆ తర్వాత కోలుకొని టోర్నీలో అద్భుతంగా ఆడాను. ఆ సమయంలో నేను చాలా నేర్చుకున్నా. టీ20 వరల్డ్​కప్​లోనూ టీమ్ఇండియాకు ఆడాలనేది నా కోరిక. ఇక సెలెక్షన్ మాటకొస్తే, నేను గత సీజన్​ ఐపీఎల్​లో సుమారు 900 పరుగులు చేశాను. అయినప్పటికీ వరల్డ్​కప్ టీమ్​లో చోటు దక్కకపోతే నేను చేసేది ఒకటే. ఈ టోర్నీకి ఎంపికైన ప్లేయర్లను ఎంకరేజ్ చేస్తూ టీమ్ఇండియాకు మద్దతిస్తా' అని అన్నాడు.

ఇక ప్రస్తుతం తన దృష్టంతా ఐపీఎల్​పైనే ఉందన్నాడు గిల్. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ గురించే ఆలోచిస్తున్నానని తెలిపిన గిల్, జట్టుకు తన అవసరం ఉందని పేర్కొన్నాడు. ఇక ప్రస్తుత సీజన్​లో గుజరాత్​ జట్టుకు గిల్ కెప్టెన్సీ వహిస్తున్నాడు. ఈ సీజన్​లో గుజరాత్ 9 మ్యాచ్​ల్లో 4 మ్యాచ్​లు గెలిచింది. దీంతో 8 పాయింట్లతో పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది.

'మంజ్రేకర్ T20 వరల్డ్​కప్​ టీమ్'- మాజీ క్రికెటర్ జట్టులో విరాట్​కు నో ప్లేస్ - 2024 T20 World Cup

'అలా చేయకు అని రాబిన్​ను వేడుకున్నా- ఆ తప్పిదం వల్ల ఓడిపోయాం' - Anil Kumble IPL

Last Updated : Apr 26, 2024, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.