ETV Bharat / sports

స్టేట్ ఐకాన్​గా శుభ్​మన్- లోక్​సభ ఎన్నికల్లో గిల్- పంజాబ్​లో టార్గెట్ అదే!

Shubman Gill Election Campaign: టీమ్ఇండియా బ్యాటర్ శుభ్​మన్ గిల్ తన సొంత రాష్ట్రానికి 'స్టేట్ ఐకాన్' అయ్యాడు. 2024 లోక్​సభ ఎన్నికల్లో ఓటు హక్కుపై అవగాహన పెంచే కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు.

Shubman Gill Election Campaign
Shubman Gill Election Campaign
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 9:33 PM IST

Updated : Feb 19, 2024, 9:43 PM IST

Shubman Gill Election Campaign: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్​ను పంజాబ్ 'స్టేట్ ఐకాన్' నియమించింది ఆ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్. రానున్న లోక్​సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు గిల్​ను 'స్టేట్ ఐకాన్'గా నియమిస్తున్నాట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సిబిన్ సీ తెలిపారు. రాష్ట్రంలో పోలింగ్ పర్సెంటేజీ 70శాతానికి పెంచడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పారు.

'శుభ్​మన్ గిల్​ను ఈ రాష్ట్రంలో అనేకమంది క్రికెట్ ఫ్యాన్స్ ఇష్టపడుతారు. ముఖ్యంగా యంగ్ జనరేషన్​కు గిల్ బాగా తెలుసు. 2024 లోక్​సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం 70కి చేరుకోవడానికి గిల్ సహకారం ఉపయోగపడుతుంది. ​'ఈసారి 70శాతం పైగా' నినాదంతో ఓటర్లకు అవగాహన కల్పించే ప్రచారంలో గిల్ పాల్గొంటాడు' అని సిబిన్ సీ తెలిపారు. కాగా, గిల్​ పంజాబ్​లోని ఫిరోజ్​పుర్​లో జన్మించాడు. ఇక గిల్​తోపాటు ప్రముఖ పంజాబీ సింగర్​ తర్సీమ్ జాస్సర్​ను కూడా 'స్టేట్ ఐకాన్​' నియమించినట్లు సిబిన్ తెలిపారు. కాగా, 2019లోక్​సభ ఎన్నికల్లో 13 స్థానాలకు ఎన్నిక జరగ్గా రికార్డు స్థాయిలో 65.96 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి 70శాతం పోలింగ్​ను ఎలక్షన్ కమిషన్ టార్గెట్​గా పెట్టుకుంది.

గిల్ ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లాండ్​తో జరుగుతున్న టెస్టు సిరీస్​లో ఆడుతున్నాడు. ఈ సిరీస్​లో గిల్ ఇప్పటికే 42 సగటుతో 252 పరుగులు చేశాడు. అందులో విశాఖపట్టణం టెస్టులో సెంచరీ నమోదు చేశాడు. ఈ సిరీస్​లో ఓ హాఫ్ సెంచరీ కూడా బాదాడు. రాజ్​కోట్​లో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్​లో గిల్ అదరగొట్టాడు. జైశ్వాల్​తో కలిసి 150+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన గిల్ (91 పరుగులు) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్​లో భారత్ 434 పరుగుల భారీ తేడాతో నెగ్గి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్​ల సిరీస్​లో భారత్ 2-1 తో లీడ్​లోకి దూసుకెళ్లింది. ఇక ఇరుజట్ల మధ్య నాలుగో మ్యాచ్ ఫిబ్రవరి 23నుంచి జరగనుంది. ఈ మ్యాచ్​కు రాంచీ మైదానం వేదిక కానుంది.

'25 ఏళ్లు కూడా లేని కుర్రాళ్ల 'ఆట' అదుర్స్- క్రికెట్ ప్రపంచాన్ని శాసించేది వీరే!'

గిల్ బ్యాక్ టు ఫామ్- సూపర్ సెంచరీతో విమర్శలకు చెక్

Last Updated : Feb 19, 2024, 9:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.