ETV Bharat / sports

'టీ20 ప్రపంచకప్​ ఫైనల్‌ ఆడేందుకు సిద్ధమయ్యా - కానీ రోహిత్​ అలా అనేసరికి!'

టీ20 ప్రపంచకప్​ ఫైనల్​ గురించి రోహిత్ శర్మ తనతో అలా మాట్లాడాడని చెప్పిన సంజూ శాంసన్!

Sanju Samson Rohith Sharma
Sanju Samson Rohith Sharma (source IANS and ANI)
author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

Sanju Samson Comments on Rohith about T20 World Cup 2024 Final : టీ 20 ప్రపంచ కప్‌ 2024 తుది పోరులో సౌతాఫ్రికాను ఓడించి టీమ్‌ ఇండియా ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 11 ఏళ్ల తర్వాత టీమ్ ఇండియా ఐసీసీ ట్రోఫీ గెలవడంతో ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అయిపోయారు. అయితే, కెరీర్​లో మొదటి సారి ఈ వరల్డ్​ కప్‌ జట్టులో చోటు దక్కించుకున్న వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్​కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే ఛాన్స్ దక్కలేదు. భారీ రోడ్డు ప్రమాదం తర్వాత రిషభ్‌ పంత్ తిరిగి నేషనల్ టీమ్​లోకి రావడం వల్ల శాంసన్‌ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సి వచ్చింది.

అయితే, దక్షిణాఫ్రికాతో తుదిపోరుకు ముందు బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాలని కెప్టెన్ రోహిత్ శర్మ తనతో చెప్పినట్లు శాంసన్​ చెప్పాడు. కానీ, టాస్‌కు కొద్ది నిమిషాల ముందే జట్టులో మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నట్లు రోహిత్ మళ్లీ తనతో చెప్పాడని శాంసన్‌ అన్నాడు.

"నాకు టీ 20 వరల్డ్​ కప్​ ఫైనల్​లో ఆడే ఛాన్స్ దక్కింది. ఆడేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. నేను మ్యాచ్‌ కోసం సిద్ధమయ్యాను కూడా. అయితే, పాత జట్టుతోనే బరిలోకి దిగాలని టాస్‌ పడటానికి ముందు నిర్ణయించుకున్నారు. అయినా నాకేమీ ఈ విషయంలో బాధ లేదు. వార్మప్‌ చేస్తున్నప్పుడు రోహిత్‌ శర్మ నన్ను పక్కకు తీసుకెళ్లి మాట్లాడాడు. ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని కూడా వివరించాడు. అర్థం చేసుకున్నావా? అని కూడా అడిగాడు. దానికి నేను ముందు మ్యాచ్‌ గెలుద్దాం. ఆ తర్వాత మాట్లాడుకుందాం. మ్యాచ్‌పై దృష్టి పెట్టండి" అని రోహిత్‌ శర్మతో చెప్పాను. మళ్లీ కాసేపటి తర్వాత రోహిత్​ నా దగ్గరకు వచ్చి 'నువ్వు నన్ను మనసులో తిట్టుకుంటున్నావని తెలుసు. నువ్వు సంతోషంగా లేవని అనిపిస్తోంది' అని అన్నాడు. 'మా సంభాషణ పూర్తైన తర్వాత ఒక ప్లేయర్​గా నేను ఆడాలనుకుంటున్నానని చెప్పాను' అని శాంసన్ చెప్పుకొచ్చాడు.

ఏదేమైనా రోహిత్ సారథ్యంలో ప్రపంచ కప్‌ ఫైనల్ మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కకపోవడం వల్ల బాధపడినట్లు తెలిపాడు శాంసన్. కాగా, రీసెంట్​గా బంగ్లాదేశ్‌తో హైదరాబాద్‌లో జరిగిన టీ20లో శాంసన్ ( 47 బంతుల్లో 111; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) చెలరేగి ఆడిన విషయం తెలిసిందే.

'బావ కోహ్లీ, ధోనీలో ఎవరంటే ఇష్టం?' - బాలయ్య ప్రశ్నకు సీఎం చంద్రబాబు సమాధానం ఇదే!

ఇంటర్నేషనల్ బౌలర్లు కంఫర్ట్, పట్టు కోసం ఏ షూస్ వాడుతారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.