ETV Bharat / sports

వైకల్యాన్ని జయించి అదరహో- మెకానిక్ కూతురి విజయం వెనుక ఎంత పెద్ద కథో! - Rubina Francis Paralympics 2024 - RUBINA FRANCIS PARALYMPICS 2024

Rubina Francis Paralympics 2024 : ఆమెది దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్న మెకానిక్! పైగా చిన్నప్పటి నుంచే కాలికి బలహీనత. ఇటువంటి పరిస్థితుల్లో షూటింగ్​నే లక్ష్యంగా పెట్టుకున్న ఓ అమ్మాయి వైకల్యాన్ని జయించి పారిస్ పారాలింపిక్స్​లో పతకాన్ని ముద్దాడింది. ఆమెనే షూటర్ రుబీనా ఫ్రాన్సిస్‌. మరీ రుబీనా ఇన్​స్పిరేషనల్ జర్నీ ఎలా సాగిందంటే?

Rubina Francis Paralympics 2024
Rubina Francis (IANS)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 1, 2024, 7:18 AM IST

Rubina Francis Paralympics 2024 : ఓ వైపు దిగువ మధ్యతరగతి కుటుంబ కష్టాలు, మరోవైపు కాలికి బలహీనత! ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఓ అమ్మాయి క్రీడల్లో రాణించడం ఆటలను కెరీర్‌గా చేసుకోవడం అంత తేలికైన పని కాదు. అటువంటిది ఖరీదైన షూటింగ్‌లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా అంతర్జాతీయ పతకాలను సాధించే స్థాయికి వెళ్లి తన సత్తా చాటుకుంది రుబీనా ఫ్రాన్సిస్‌.

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ వాసి రుబీనా తన కలను నెరవేర్చుకునేందుకు చాలా ఇబ్బందులు పడింది. బలహీనత కారణంగా పాదం మెలికబడటం వల్ల సరిగా నిలబడలేని పరిస్థితి ఆమెది. దీంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తనను ముందుకు కదలనీయలేదు. వైకల్యాన్ని జయించేందుకు దృఢ నిశ్చయంతో ఉన్న ఆమెకు నాన్న సైమన్‌ ఫ్రాన్సిస్‌ అండ, మాజీ ఒలింపియ న్‌ గగన్‌ నారంగ్‌ స్ఫూర్తి గుండెల నిండా ఆత్మవిశ్వాసం నింపింది.

అలా షూటింగ్​లో తన కెరీర్​ను 2015లో ప్రారంభించింది. ఆ తర్వాత 2017లో నారంగ్‌ అకాడమీ 'గన్‌ ఫర్‌ గ్లోరీ'లో చేరడం ఆమె కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. మొదట్లో కూర్చొని షూటింగ్‌ చేసే విధానంలో శిక్షణ తీసుకున్నప్పటికీ అందులో ఆమె పరిపూర్ణత సాధించలేకపోయింది. దీంతో కోచ్‌ జైప్రకాశ్‌ ఆమెకు నిలబడేందుకు ఆదరువుగా ఓ ప్రత్యేకమైన బూట్లు తయారు చేయించి శిక్షణ ఇచ్చాడు. దీంతో ఆమె మెరుగైన ట్రైనింగ్​లో స్థిరంగా రాణిస్తుండడం వల్ల మధ్యప్రదేశ్‌ షూటింగ్‌ అకాడమీ నుంచి రుబీనాకు పిలుపొచ్చింది. అక్కడ ప్రముఖ కోచ్‌ జస్పాల్‌ రాణా శిక్షణ వల్ల ఆమె మరింత మెరుగైంది.

పారాలింపిక్స్‌ లక్ష్యంగా : ఫ్రాన్స్‌ వేదికగా 2018లో జరిగిన ప్రపంచకప్‌లో పాల్గొనటం రుబీనాలోని కాన్ఫిడెన్స్​ పెంచింది. అప్పుడే ఆమెకు పారాలింపిక్​లో పతకం సాధించిన సాధించాలన్న లక్ష్యం ఏర్పడింది. అలా 2021లో లిమా వేదికగా జరి గిన ప్రపంచకప్‌లో స్వర్ణం గెలిచే క్రమంలో 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్‌ పీ2 విభాగంలో పారాలింపిక్‌ బెర్తు సాధించింది.

2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో పోటీపడ్డ ఆమె ఏడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత నుంచి అంతర్జాతీయ స్థాయిలో స్థిరంగా రాణించింది. 2022 ఆసియా పారా క్రీడల్లో కాంస్య పతకం, 2022 చాటీయారెక్స్‌ ప్రపంచకప్‌లో ఓ స్వర్ణంతో పాటు రెండు సిల్వర్​, అలాగే బ్రాంజ్​తో అదరగొట్టింది.

ఇదిలా ఉండగా, అదే ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ప్రపంచ పారా షూటింగ్‌లో పసిడి పతకాన్ని ముద్దాడింది రుబీనా. 2023 ఒసెక్‌ ప్రపంచకప్‌లో వ్యక్తిగత విభాగంలో రజతం, మిక్స్‌డ్‌లో కాంస్య పతకాలు సాధించింది. ఈ విజయాలు రుబీనాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. వాటి ఫలితమే ఈ పారిస్‌ పారాలింపిక్స్‌ంలో ఆమె విజయం.

పారాలింపిక్స్​లో భారత్ జోరు- ఖాతాలో మరో పతకం

బలహీనత, వంకర కాళ్లు - పరుగులో పసిడి సాధించిన ప్రీతి పాల్​ కన్నీటి గాథ - PARALYMPICS 2024 PREETI PAL JOURNEY

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.