ETV Bharat / sports

'నా ప్రైవసీకి భంగం కలిగించే పని చేశారు - వద్దన్నా కూడా వీడియోలు తీశారు' - Rohit Sharma Star Sports

author img

By ETV Bharat Telugu Team

Published : May 19, 2024, 4:12 PM IST

Updated : May 19, 2024, 6:56 PM IST

Rohit Sharma Star Sports Controversy : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా ట్విట్టర్ వేదికగా ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్​ చేసిన పనిపై అసహనం వ్యక్తం చేశాడు. వద్దన్నా కూడా అనవసరంగా వీడియోలు తీసి తమ ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని వ్యాఖ్యానించాడు.

Rohit Sharma Star Sports
Rohit Sharma Star Sports (Etv Bharat)

Rohit Sharma Star Sports Controversy : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా ట్విట్టర్ వేదికగా ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్​ను తిట్టిపోశాడు. వద్దన్నా కూడా అనవసరంగా వీడియోలు తీసి తమ ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని వ్యాఖ్యానించాడు. ప్రాక్టీస్ సమయంలో, మ్యాచ్​ అయిపోయాక స్టేడియంలో తమ సహచరులతో మాట్లాడుకున్న వాటిని వీడియో తీసి వాటిని అప్​లోడ్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

"క్రికెటర్ల జీవితాలు ఎలా మారిపోయాయి అంటే ఇప్పుడు మేము వేసే ప్రతి అడుగు, స్నేహితులు లేదా సహచరులతో పంచుకునే విషయాలన్నింటిని కెమెరాలో రికార్డ్​ చేస్తున్నారు. నేను మాట్లాడే దాన్ని రికార్డ్ చేయొద్దన్ని స్టార్ స్పోర్ట్స్‌ను కోరినప్పటికీ, వాళ్లు నా ప్రైవసీకి భంగం కలిగించేలా ప్రవర్తించారు. దాన్ని టెలికాస్ట్ చేశారు. ఎక్స్​క్లూజివ్ కంటెంట్​తో పాటు వ్యూవ్స్​ను సాధించే విషయంపై దృష్టి పెట్టాలనుకే ఆలోచన ఒకరోజు క్రికెటర్లకు అలాగే ఫ్యాన్స్​కు మధ్య ఉన్న నమ్మకాన్ని పోయేలా చేస్తుంది." అంటూ రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. ఇక రోహిత్ ట్వీట్​ చూసిన అభిమానులు, సదురు ఛానెల్​ చేసిన పని సరికాదంటూ కామెంట్లు పెడుతున్నారు. రోహిత్​కు మద్దతు తెలుపుతున్నారు.

అసలేం జరిగిందంటే ?
ఐపీఎల్​లో భాగంగా లఖ్‌నవూ, ముంబయి మధ్య మ్యాచ్‌కు ముందు భారత మాజీ ఆటగాడు ధవళ్ కులకర్ణి, రోహిత్ ముచ్చటించారు. అదే సమయంలో అక్కడి ఓ కెమెరామెన్‌ వాళ్లు వీడియో తీస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని రోహిత్ గమనించాడు. వెంటనే అతడు కెమెరామన్‌ను రోహిత్ సరదాగా రిక్వెస్ట్ చేశాడు. "బ్రదర్, దయచేసి ఆడియో ఆఫ్ చేయండి. ఇప్పటికే ఓ వీడియో వైరల్‌గా మారిపోయింది. దీంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి" అంటూ రోహిత్ వ్యాఖ్యానించాడు. ఇక ఇదే వీడియోను స్టార్స్ స్పోర్ట్స్ తమ ఛానల్​లో ప్రసారం చేసింది.

మరోవైపు ఈ మ్యాచ్​లో ముంబయి జట్టు 18 పరుగుల తేడాతో లఖ్​నవూ చేతిలో ఓటమిపాలైంది. ఇందులో లఖ్‌నవూ గెలిచినప్పటికీ ఇంటిముఖం పట్టక తప్పలేదు. ఇక లఖ్‌నవూ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబయి 196/6 స్కోరుకే పరిమితమైంది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన రోహిత్ శర్మ 38 బంతుల్లో 68 పరుగులు చేశాడు. జట్టుకు మంచి స్కోర్ అందించాడు.

ముంబయికి రోహిత్ బైబై!- ఆఖరి మ్యాచ్ ఆడేశాడా?- కోచ్ రెస్పాన్స్​ ఇదే - IPL 2024

పాండ్యా కెప్టెన్సీపై రోహిత్ రియాక్షన్ - అన్నీ మనం అనుకున్నట్లు జరగవు - Rohit Sharma Captaincy

Last Updated : May 19, 2024, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.