Rohit Sharma On Virat Kohli: ప్రస్తుతం టీమ్‌ఇండియాలో కీలక ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ఒకడు. ప్రస్తుతమే కాదు గత 16 ఏళ్లుగా కీలక ప్లేయర్స్ జాబితాలో అతనిదే మొదటి పేరు. ఇటీవల ప్రపంచ కప్ గెలిచాక టీ20 వరల్డ్ కప్‌కి రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అప్పటి వరకు మూడు ఫార్మాట్‌లలో దేశం కోసం టన్నుల కొద్ది పరుగులు చేశాడు. ఈ లెజెండరీ క్రికెటర్ నేటికి (ఆగస్టు 18) అంతర్జాతీయ క్రికెట్‌లో 16 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా విరాట్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడిన పాత వీడియోను స్టార్‌స్పోర్ట్స్ తాజాగా షేర్ చేసింది.
విరాట్‌కు ఎప్పుడు పరుగుల దాహం ఉంటుందని రోహిత్ అన్నాడు.' పరుగులు సాధించాలనే ఆకలి, అతడి ప్యాషన్ సాటిలేనివని మనందరికీ తెలుసు. మీరు అతడిని చూసిన ప్రతిసారి అన్ని సమయాల్లో డిఫరెంట్ ఎనర్జీతో బయటకు వస్తాడు. టీమ్‌కి చాలా రకాలుగా ఉపయోగపడతాడు. అతడి అనుభవం చాలా గొప్పది. అంటే భారతదేశం కోసం చాలా మ్యాచ్‌లు ఆడాడు. అవి పోరాటాలు, కఠినమైన పరిస్థితుల నుంచి పుడతాయి. కోహ్లికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. మేము అతడ్ని చూసిన ప్రతిసారీ అతడి గేమ్ డిఫరెంట్ లెవల్‌లో ఉంటుంది' అని పేర్కొన్నాడు.
𝟏𝟔 𝐘𝐞𝐚𝐫𝐬 𝐎𝐟 𝐕𝐢𝐫𝐚𝐭 𝐊𝐨𝐡𝐥𝐢! ♥️
— Star Sports (@StarSportsIndia) August 18, 2024
As wishes flood in for @imVkohli 's 16-year journey, @ImRo45 leads the way in paying tribute to the cricketing legend! 😇#KingKohli #16YearsOfVirat #ViratKohli pic.twitter.com/XYFi8Hizqp
సచిన్ రికార్డు బద్దలు: 35ఏళ్ల కోహ్లి వన్డే క్రికెట్‌లో దిగ్గజ ఆటగాడు సచిన్ తెందూల్కర్ చేసిన 49 సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. 2023 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై తన 50వ వన్డే సెంచరీ కొట్టాడు.
టీ20కి గుడ్‌బై: అంతర్జాతీయ క్రికెట్‌లో 16 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ దిల్లీ బ్యాటర్ ఇటీవలే పొట్టి క్రికెట్ ఫార్మాట్‌కి గుడ్ బై చెప్పాడు. 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన వెంటనే రిటైర్‌మెంట్ ప్రకటించాడు. వన్డేలు, టెస్ట్ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు.
Virat International Career: విరాట్ ఇప్పటివరకు 26,942 అంతర్జాతీయ పరుగులు చేశాడు. అందులో టెస్టు (8848 పరుగులు), వన్డే (13906 పరుగులు), టీ20 (4188 పరుగులు) ఉన్నాయి. కాగా, అన్ని ఫార్మాట్‌లలో కలిపి విరాట్ 80 సెంచరీలు నమోదు చేశాడు.
విరాట్ @16ఏళ్లు- కెరీర్లో ఎన్ని ICC అవార్డులు సాధించాడో తెలుసా? - Virat Kohli Career