Rohit Sharma IPL 2024: 2024 ఐపీఎల్ సంబరం మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ దాదాపు 11ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా కాకుండా కేవలం ఒక బ్యాటర్‌గా బరిలోకి దిగనున్నాడు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు రోహిత్ శర్మపైనే ఉండనుంది. మరి రోహిత్ ఈసారి ఎలా ఆడుతాడనేది ఆసక్తిగా మారింది.
ఇదివరకు రోహిత్ కెప్టెన్‌గా జట్టును నడిపిస్తూ, బ్యాటింగ్ భారాన్ని కూడా మోయాల్సి వచ్చింది. కానీ, గత రెండు సీజన్లుగా రోహిత్ బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. 2022లో 14 మ్యాచ్‌ల్లో 268 పరుగులు, 2023లో 332 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 2022ఐపీఎల్లో రోహిత్ ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేయకపోవడం గమనార్హం.
అటు జట్టు కూడా 2021, 2022లో ప్లే ఆఫ్స్ చేరడంలో విఫలమైంది. గతేడాది ప్లేఆఫ్స్‌కు వచ్చినా క్వాలిఫయర్- 2లో గుజరాత్ చేతిలో ఓడింది. దీంతో ముంబయి యాజమాన్యం జట్టు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలు హార్దిక్ పాండ్యకు అప్పగించింది. ఇక రోహిత్‌కు ప్రస్తుతం కెప్టెన్సీ బాధ్యతలు లేకపోవడం, పైగా సూపర్ ఫామ్‌లో ఉండడం వల్ల ఈసారి ఐపీఎల్లో హిట్‌మ్యాన్ మెరుపులు చూడవచ్చని ఫ్యాన్స్ అంటున్నారు.
విరాట్ కూడా అలాగే! స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారధ్యం వహించాడు. అయితే పనిభారం కారణంగా 2021 తర్వాత కెప్టెన్సీ వదులుకున్నాడు. అప్పట్నుంచి ఆర్సీబీని ఫాఫ్ డుప్లెసిస్ నడిపిస్తున్నాడు. ఇక కెప్టెన్సీ వదులుకున్నాక విరాట్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగాడు. గతేడాది 14 మ్యాచ్‌లు ఆడిన విరాట్ మొత్తం 639 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు రోహిత్‌కు కూడా కెప్టెన్సీ బాధ్యతలు లేవు కాబట్టి అతడిపై ఎలాంటి ఒత్తిడి ఉండకపోవచ్చు. దీంతో సీనియర్ ప్లేయర్‌గా మైదానంలో హార్దిక్‌కు సలహాలిస్తూ, మరోవైపు పరుగుల వరద పారించాలని ముంబయి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అతడు ఓ అద్భుతం - అసమాన్యుడు : పంత్‌కు చికిత్స చేసిన డాక్టర్
రోహిత్ ముంబయిని వదిలేస్తే బెటర్- ఆ జట్టులోకి వెళ్తే కెప్టెన్ అవుతాడు!