ETV Bharat / sports

కెప్టెన్సీలో రోహిత్​కు 100 మార్కులు​! - అతడి 5 నిర్ణయాలు క్రికెట్​ను ఎంతగా మార్చాయంటే?

కెప్టెన్సీలో అదరగొడుతున్న రోహిత్ శర్మ- క్రికెట్​లో అతడు తీసుకున్న 5 పవర్​ఫుల్ నిర్ణయాలు ఇవే!

Rohit Sharma Five Key Decisions In Cricket
Rohit Sharma (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

Rohit Sharma Five Key Decisions In Cricket : టీమ్ఇండియా కెప్టెన్​గా రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. జట్టును మరింత దూకుడుగా ముందుకు నడిపిస్తున్నాడు. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్​లో తనదైన నిర్ణయాలతో జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. జట్టు కూర్పు, టాలెంట్ ఉన్న యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తూ ఔరా అనిపిస్తున్నాడు. రోహిత్ కెప్టెన్సీలోనే భారత జట్టు ఇటీవల టీ20 ప్రపంచ కప్​ను అందుకుంది కూడా. ఈ నేపథ్యంలో రోహిత్ తన కెప్టెన్సీలో తీసుకున్న ఐదు కీలక నిర్ణయాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

ఇషాన్ కిషన్​ను కాదని గిల్​కి మద్దతు
టీమ్​ఇండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్​పై వేటు తర్వాత తొలుత ఇషాన్ కిషన్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్​పై డబుల్ సెంచరీ కూడా చేశాడు. అయితే ఆ తర్వాత ఇషాన్ స్థానంలో గిల్​కు జట్టులో చోటు కల్పించాడు రోహిత్. దీంతో 2023 ప్రారంభంలో న్యూజిలాండ్, శ్రీలంక సిరీస్​లో గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆరు వన్డేల్లో ఓ డబుల్ సెంచరీ సహా మూడు శతకాలు బాదాడు. అలాగే గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్​లోనూ రాణించాడు.

పుజారా, రహానేను కాదని సర్ఫరాజ్​కు ప్లేస్
గతంలో టీమ్ఇండియా మిడిలార్డర్​కు మూలస్తంభాలుగా ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ఉండేవారు. అయితే వరుస టోర్నీలో విఫలమవ్వడం వల్ల వారిపై వేటుపడింది. ఆ తర్వాత మిడిలార్డర్​లో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ వంటి యంగ్ ప్లేయర్లకు రోహిత్ అవకాశం ఇచ్చాడు. ఈ క్రమంలో అవకాశం దక్కించుకున్న సర్ఫరాజ్ ఇటీవలే న్యూజిలాండ్​తో బెంగళూరులో జరిగిన టెస్టులో శతకం బాదాడు.

కుల్దీప్ యాదవ్ రీఎంట్రీ
అలాగే టీమ్​ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్​ను మళ్లీ జట్టులోకి తీసుకురావడంలో రోహిత్ కీలక పాత్ర పోషించాడు. వేటు ఎదుర్కొన్న రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కుల్దీప్ వరుసగా టీ20, వన్డే సిరీస్​ల్లో రాణిస్తున్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్‌ లో భారత్ ఫైనల్ చేరడంలో కుల్దీప్ కీలక పాత్ర పోషించాడు కూడా.

2024 టీ20 ప్రపంచ కప్‌
టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏ విషయాన్నైనా వ్యూహాత్మకంగా ఆలోచిస్తాడు. ఇవే ఇటీవలే జరిగిన టీ20 ప్రపంచకప్ ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాయి. ఉదాహరణకు పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్​ కంటే ముందు అక్షర్​ పటేల్​ను బ్యాటింగ్​కు దింపాడు. ఇది సక్సెస్ అయ్యి అక్షర్ మంచి నాక్ ఆడాడు. అలాగే దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్​లోనూ రోహిత్ వ్యూహాత్మకంగా ఆలోచించాడు. ప్రోటీస్‌ జట్టు విజయం కోసం 28 బంతుల్లో కేవలం 27 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో హార్దిక్ పాండ్యకు బంతిని ఇచ్చాడు రోహిత్. అప్పుడు విధ్వంసరకర బ్యాటర్ క్లాసెన్​ను పాండ్య పెవిలియన్​కు పంపాడు.

వన్డే, టీ20 ఫార్మాట్​లో టీమ్​ఇండియాను రోహిత్ నడిపిన తీరు అద్భుతం. 2023 వన్డే ప్రపంచకప్​లో భారత జట్టును ఫైనల్ కు తీసుకెళ్లడంలో రోహిత్ దూకుడు బాగా పనికొచ్చింది.

'మేం కష్టాల్లో ఉన్నప్పుడు, బాగా ఒత్తిడికి గురయ్యా - కోహ్లీ, హార్దిక్ కాపాడారు' - రోహిత్

ధోనీ సలహా పట్టించుకోని రోహిత్‌! హిట్​మ్యాన్​ తొలి డబుల్ సెంచరీ కొట్టినప్పుడు ఏం జరిగిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.