ETV Bharat / sports

రోహిత్, గిల్ సెంచరీల మోత- భారీ స్కోర్ దిశగా భారత్

Rohit Gill Centuries: ఇంగ్లాండ్​తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో రోహిత్ శర్మ, గిల్ శతకాలతో అదరగొట్టారు.

Rohit Gill Centuries
Rohit Gill Centuries
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 8, 2024, 11:37 AM IST

Updated : Mar 8, 2024, 1:41 PM IST

Rohit Gill Centuries: ఇంగ్లాండ్​తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్ సెంచరీల మోత మోగించారు. రోహిత్ 154 బంతుల్లో సెంచరీ అందుకోగా, కాసేపటికే గిల్ 137 బంతుల్లోనే బౌండరీతో శతకం పూర్తి చేశాడు. టెస్టుల్లో రోహిత్​కు ఇది 12వ సెంచరీ కాగా, గిల్​కు 4వ శతకం. ఇక వీరిద్దరికీ ప్రస్తుత సిరీస్​లో ఇది రెండో సెంచరీ. ఇక 135 ఓవర్​నైట్ స్కోర్​తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్​ లంచ్ బ్రేక్ సమయానికి 264-1 తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్​లో భారత్ ప్రస్తుతం 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఇక 52 పరుగుల ఓవర్​నైట్​ స్కోర్​తో రెండో రోజు ఆట ప్రారంభించిన రోహిత్ ప్రత్యర్థి బౌలర్లపై బౌండరీలతో చెలరేగాడు. ఈ క్రమంలోనే 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. ఇక మూడు ఫార్మాట్​లలో కలిపి ఓవరాల్​గా హిట్​మ్యాన్​కు ఇది 48వ అంతర్జాతీయ శతకం. ఈ ఇన్నింగ్స్​తో రోహిత్ పలు ఘనతలు అందుకున్నాడు.

  • 2021 తర్వాత టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్​గా రోహిత్ నిలిచాడు. ఈ మూడేళ్లలో రోహిత్ 6 శతకాలు బాదాడు. ఈ లిస్ట్​లో గిల్ (3) రెండో ప్లేస్​లో ఉన్నాడు.
  • ఇంగ్లాండ్​పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన భారత ఓపెనర్​గా రోహిత్, సునీల్ గావస్కర్​ను సమం చేశాడు. వీరిద్దరూ 4 సెంచరీలు బాదారు.
  • అంతర్జాతీయ క్రికెట్​లో అత్యధిక సెంచరీలు బాదిన లిస్ట్​లో రోహిత్​ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ లిస్ట్​లో డేవిడ్ వార్నర్ అందరికంటే ఎక్కువగా 49 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక వరుసగా సచిన్ (45 సెంచరీలు), రోహిత్ శర్మ (43 సెంచరీలు), క్రిస్ గేల్ (42), సనత్ జయసూర్య (41), మాథ్యూ హెడెన్ (40) ఉన్నారు.

అంతర్జాతీయ క్రికెట్​లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్లు

  • సచిన్ తెందూల్కర్- 100 శతకాలు
  • విరాట్ కోహ్లీ- 80 శతకాలు
  • రాహుల్ ద్రవిడ్- 48 శతకాలు
  • రోహిత్ శర్మ- 48 శతకాలు
  • వీరేంద్ర సెహ్వాగ్- 38 శతకాలు
  • సౌరభ్ గంగూలీ- 38 శతకాలు

'అప్పట్లో ఒకడుండేవాడు'- డకెట్ కామెంట్స్​కు రోహిత్​ స్ట్రాంగ్ రిప్లై

రోహిత్ ఫన్నీ టాక్స్- మీమర్స్ గెట్ రెడీ- ఆ మ్యాచ్​లో లీక్ ఇస్తాడంట

Last Updated : Mar 8, 2024, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.