ETV Bharat / sports

2024 ఆసియా బ్యాడ్మింటన్​: టోర్నీ నుంచి సింధు ఔట్- ప్రీ క్వార్టర్స్​లో ఓడిన స్టార్ షట్లర్ ​ - PV Sindhu Asia Championships 2024 - PV SINDHU ASIA CHAMPIONSHIPS 2024

PV Sindhu Asia Championships 2024: 2024 ఆసియా బ్యాడ్మింటన్ ప్రీ క్వార్టర్స్​లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓడింది.

PV Sindhu Asia Championships 2024
PV Sindhu Asia Championships 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 5:15 PM IST

Updated : Apr 11, 2024, 5:44 PM IST

PV Sindhu Asia Championships 2024: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రతిష్ఠాత్మకమైన 2024 ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. గురువారం మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్​లో ఓటమి పాలైంది. చైనీస్ ఆరోసీడ్ హాన్ యుతో గురువారం ప్రీ క్వార్టర్స్​లో హోరాహోరీగా జరిగిన గేమ్​లో సింధు 18-21, 21-13, 17-21 తేడాతో ఓడింది. 1 గంట 9 నిమిషాలపాటు సాగిన ఆటలో సింధు పోరాడినప్పటికీ మూడో సెట్​లో చైనా ప్లేయర్​దే పైచేయి అయ్యింది. దీంతో పారిస్ ఒలింపిక్స్​కు ముందు ఇక్కడ సత్తా చాటాలని భావించిన సింధుకు నిరాశే మిగిలింది.

చైనా ప్లేయర్​పై 5-0 రికార్డ్​ ఉన్న సింధు తొలి గేమ్​తో కాస్త వెనకబడి 18-21 తేడాతో కోల్పోయింది. దీంతో రెండో గేమ్​లో హుషారుగా ఆడిన సింధు ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ఈ గేమ్​ను ఏకంగా 8 పాయింట్ల తేడాతో (13-21) సొంతం చేసుకుంది. దీంతో మ్యాచ్ మూడో గేమ్​కు దారితీసింది. ఇక డిసైడర్ రౌండ్​లో ఇద్దరి మధ్య గేమ్ హోరాహోరీగా సాగింది. హాన్​కు సింధు గట్టిపోటీ ఇచ్చినా, ఆఖర్లో లయ తప్పింది. దీంతో డిసైడర్​ గేమ్​లో 17-21తో చైనా ప్లేయర్ నెగ్గింది.

మరోవైపు భారత డబుల్స్​ జోడీ తానీషా క్రాస్టో- అశ్వినీ పొన్నప్ప కూడా ప్రీ క్వార్టర్స్​లో ఓడింది. జపాన్ మూడోసీడ్​ నమీ- చిహారుతో పోటీపడ్డ ఈ జోడీ 17-21, 12-21 తేడాతో ఓడింది.​ కాగా, ఇదే టోర్నీలో పురుషుల సింగిల్స్​లో హెచ్ ఎస్ ప్రణయ్​కూడా ప్రీ క్వార్టర్స్​లోనే నిష్క్రమించాడు. సీవై లిన్​తో గురువారం జరిగిన మ్యాచ్​లో 18-21, 11-21 వరుస గేమ్​లలో ప్రణయ్ ఓడాడు.

ఇక, ఇదే టోర్నీలో తొలి రౌండ్​లో బుధవారం మలేషియా ప్లేయర్ గో జిన్‌ వెయినితో తలపడ్డ సింధు 18-21, 21-14, 21-19 తేడాతో నెగ్గి ప్రీ క్వార్టర్స్​కు అర్హత సాధించింది. తొలి గేమ్​లో 18-21 ఓడిన సింధు, తర్వాత పుంజుకుంది. వరసగా రెండు రౌండ్ల (21-14, 21-19)లో పైచేయి సాధించి నెగ్గింది. ఇక పురుషుల సింగిల్స్​లో గువాంగ్‌ జుతో పోటీపడ్డ ప్రణయ్ 17-21, 23-21, 23-21 గెలుపొందాడు.

స్టార్ షట్లర్​ పీవీ సింధుకు షాక్ - రెండో రౌండ్​లోనే ఇంటికి

Australia Open Prannoy 2023 : ప్రణయ్​కు తప్పని నిరాశ.. ఫైనల్స్​లో​ ఓటమి

Last Updated : Apr 11, 2024, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.