Cristiano Ronaldo 900th Goal: పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానొ రొనాల్డో కెరీర్లో 900వ గోల్ సాధించాడు. దీంతో ఫుట్‌బాల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా రొనాల్డో రికార్డు సృష్టించాడు. యూరోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ (UEFA) లో క్రోషియాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో ఈ మైలురాయి అందుకున్నాడు. ఫస్ట్ హాఫ్‌లో 34వ నిమిషం వద్ద అద్భుతమైన షాట్‌తో సాధించిన రొనాల్డో 900వ గోల్ పూర్తి చేశాడు. ఈ అరుదైన ఫీట్ అందుకోగానే రొనాల్డో ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు.
Cristiano Ronaldo’s reaction after reaching 900 official career goals.
— TC (@totalcristiano) September 5, 2024
The passion. ❤️
pic.twitter.com/70zJjifXzI
'ఇది నాకు ఎమోషనల్ మూమెంట్. ఈ ఘనత సాధించడం కోసం నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్నా. కానీ, నేను ఈ మైలురాయి అందుకుంటానని నాకు తెలుసు. కెరీర్లో ఆడుతూ ముందుకెళ్తే ఇది సాధించడం మామూలే. అయితే ఇది సాధారమైన మైలురాయిలా కనిపించవచ్చు. కానీ, 900 గోల్స్ చేయాలంటే ఎంతో హార్డ్ వర్క్ చేయాలి. శారీరకంగా కూడా చాలా ఫిట్‌గా ఉండాలి. ఇది సాధించడానికి నేను చేసిన హార్డ్ వర్క్ నాకు మాత్రమే తెలుసు. నా కెరీర్లో ఇది అద్భుతమైన సందర్భం' అని మ్యాచ్ ముగిసిన తర్వాత రొనాల్డో అన్నాడు.
1000 గోల్సే నా టార్గెట్
'నేను 1000 గోల్స్ పూర్తి చేయాలనుకుంటున్నా. ఎటువంటి గాయాలు కాకపోతే నా టార్గెట్ దీనిపైనే ఉంటుంది. మా మట్టుకు సాధించడం ఫుట్‌బాల్‌లో 900 గోల్స్ సాధిండం బెస్ట్ మార్క్. ఇక నా తదుపరి లక్ష్యం వెయ్యి గోల్స్ సాధించడమే' అని రొనాల్డో అన్నాడు.
I dreamed of this, and I have more dreams. Thank you all! pic.twitter.com/2SS3ZoG2Gl
— Cristiano Ronaldo (@Cristiano) September 5, 2024
ఆ రికార్డూ రొనాల్డో పేరిటే
కాగా, ఫుట్‌బాల్ హిస్టరీలో 800వ గోల్స్ అందుకున్న తొలి ప్లేయర్ కూడా రొనాల్డోనే కావడం విశేషం. 39ఏళ్ల రొనాల్డో తన కెరీర్లో ఇప్పటివరకు 131 ఇంటర్నేషనల్, 769 క్లబ్ కెరీర్ (మొత్తం 900)లో గోల్స్ చేశాడు. ఇక ఈ లిస్ట్‌లో లియోనల్ మెస్సీ (అర్జెంటినా) 842 గోల్స్, బ్రెజిల్ దిగ్గజం పేలే 765 గోల్స్ వరుసగా 2,3 స్థానాల్లో ఉన్నారు.
F*ck it, all 900 Cristiano Ronaldo career goals.
— KM (@Kylian) September 5, 2024
Enjoy. 😮💨 pic.twitter.com/6CDd8Mejug
యూట్యూబ్‌లోనూ రొనాల్డో రికార్డులు- ఆరు రోజుల్లోనే 50మిలియన్ సబ్‌స్క్రైబర్లు