ETV Bharat / sports

వినేశ్ పొగాట్ అప్పీల్‌పై తీర్పు వాయిదా - మళ్లీ ఎప్పుడంటే? - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

Paris Olympics 2024 Vinesh Phogat Plea Cancelled : ఒలింపిక్స్‌లో 100 గ్రాములు బరువు అదనంగా ఉండటం వల్ల డిస్‌క్వాలిఫై అయిన వినేశ్ పొగాట్ సిల్వర్‌ మెడల్‌ కోసం అప్పీల్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అప్పీల్‌పై తీర్పు వాయిదా పడింది.

Source ETV Bharat
Paris Olympics 2024 Vinesh Phogat (Source ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 10, 2024, 10:06 PM IST

Updated : Aug 10, 2024, 10:24 PM IST

Paris Olympics 2024 Vinesh Phogat Plea Cancelled : పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 రెజ్లింగ్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్‌ ఫోగాట్‌కు పతకం వస్తుందా లేదా అంశంపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ఇంకా ఓ కొలిక్కి రాలేదు.

రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫోగాట్‌పై ఒలింపిక్‌ కమిటీ, రెజ్లింగ్‌ కమిటీ వేసిన అనర్హత వేటు వివాదస్పదమైన సంగతి తెలిసిందే. అయితే అనర్హత వేటును సవాలు చేస్తూ వినేశ్‌ ఫోగాట్‌ చేసిన అభ్యర్థనను కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (CAS) స్వీకరించింది. వినేశ్ త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించేందుకు భార‌త ప్ర‌భుత్వ మాజీ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ హ‌రిష్ సాల్వే కూడా సిద్ద‌మ‌య్యారు. దీనిపై తీర్పును ఇవాళ (ఆగస్టు 9న) వస్తుందని చెప్పారు. కానీ అది జరగలేదు. క్రీడా ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పును ఆగస్టు 13కు వాయిదా వేసినట్లు ప్రకటించింది. అందుకే వినేశ్‌కు పతకం వస్తుందా లేదా అంశంపై ఉత్కంఠకు తెర పడలేదు.

అప్పీలులో వినేశ్‌ ఏం కోరిందంటే? - విశ్వ క్రీడల్లో భారత్‌కు ఒక్క గోల్డ్‌ మెడల్ రాలేదు. అయితే భారత్‌కు ఈ సారి గోల్డ్‌ మెడల్‌ వినేశ్‌ ఫోగాట్ రూపంలో వస్తుందని అంతా ఆశించారు. ఎందుకంటే గత ఒలింపిక్స్‌లో క్వార్టర్‌లో వైదొలిగిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఈ సారి పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం చెలరేగి ఆడింది. మాజీ ఛాంపియన్‌ను కూడా ఓడించి ఒక్కో దశ దాటుకుంటూ 50 కేజీల ఫ్రీ స్టైయిల్ రెజ్లింగ్‌ మహిళల విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించింది. అలా అర్హత సాధించిన వినేశ్‌ మరికొన్ని గంటల్లో ఫైనల్‌లో అమెరికా రెజ్లర్‌తో తలపడాల్సి ఉంది.

కానీ అనూహ్యంగా ఫైనల్‌ పోటీకి ముందు వెయిట్ చెక్ చేయగా వినేశ్‌ 100 గ్రాములు అదనపు బరువు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆమె అనర్హత వేటుకు గురైంది. ఈ పరిణామాల నేపథ్యంలో వినేశ్‌ ఫోగాట్‌ భార‌మైన హృద‌యంతో రెజ్లింగ్‌కు వీడ్కోలు ప‌లికింది. అలానే తనకు కనీసం రజత పతకం అయినా ఇవ్వాలని అప్పీలులో కోరింది. ఒకవేళ తీర్పు వినేశ్‌కు అనుకూలంగా వస్తే ఐఓసీ ఆమెకు సంయుక్తంగా రజత పతకం కేటాయించాల్సి వస్తుంది.

గోల్డ్​ విన్నర్​ అర్షద్​ నదీమ్‌కు జాక్‌పాట్‌ - బంగారు కిరీటంతో సత్కారం, రూ.5 కోట్లు ప్రైజ్‌మనీ - Paris Olympics 2024 Arshad Nadeem

ఒకరు గర్భంతో - మరొకరు మానసిక సమస్యలతో - పతకాలు గెలిచి ఎందరికో స్ఫూర్తిగా నిలిచి! - PARIS OLYMPICS 2024

Last Updated : Aug 10, 2024, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.