Paris Olympics 2024 Mathias Boe : పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి డబుల్స్ పతకాన్ని అందిస్తారనుకున్న సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడీ (Satwik Sairajrankireddy - Chirag Shetty) నిరాశపరిచారు. మెన్స్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్‌లో ఈ ద్వయం ఓటమిపాలైంది. దీంతో ఈ ఒలింపిక్స్ నుంచి వైదొలిగింది.
దీంతో వీరికి కోచింగ్ ఇచ్చిన ప్రముఖ కోచ్, హీరోయిన్ తాప్సీ భర్త మథియాస్ బో షాకింగ్ డెసిషన్ ప్రకటించాడు. కోచింగ్ బాధ్యతలకు తాను గుడ్ బై చెబుతున్నట్లు తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
‘‘నా కోచింగ్ డేస్ ముగిసిపోయాయి. ఇక భారత్‌లోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా కోచ్‌గా వ్యవహరించను. నా లైఫ్‌లో సుదీర్ఘ సమయాన్ని బ్యాడ్మింటన్ హాల్‌లోనూ గడిపేశాను. కోచ్ బాధ్యత కొంత ఒత్తిడితో ఉంటుంది. అందుకే ఇక అలసిపోయాను. నాకు కోచ్‌గా బాధ్యత ఇచ్చిన భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్‌తో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి’’ అని మథియాస్ బో తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
అలానే ఈ ఒలింపిక్స్ ఓడిపోయిన సాత్విక్ - చిరాక్ జోడీపై ప్రశంసలు కురిపించాడు. మీలో ఎంత బాధ దాగి ఉందో అర్థం చేసుకోగలను. మీరు ఎంతో కష్టపడినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. భారత్‌కు తిరిగి మెడల్‌ను తీసుకెళ్లాలని బలంగా అనుకున్నారు. కానీ, ఈ సారి ఆ అవకాశం దక్కలేదు. అయినప్పటికీ ఈ ఒలింపిక్స్‌లో మీరు మెరుగైన ప్రదర్శనే చేశారు. గాయాలను తట్టుకుని, అంకిత భావంతో ముందుకెళ్లారు. ఈ విధంగా ఆడినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది’’ అని మథియాస్ పొగిడాడు.
మథియాస్ బో కెరీర్ విషయానికొస్తే ఆయన డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్. లండన్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్‌ను ముద్దాడాడు. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు సాత్విక్ - చిరాగ్ జోడీకి కోచ్‌గా జాయిన్ అయ్యాడు. అలానే ఈ ఏడాది మార్చి నెలలో హీరోయిన్ తాప్సీని సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నాడు. అయితే రీసెంట్గా తన భర్త గురించి తాప్సీ మాట్లాడుతూ అంతర్జాతీయ వేదికలపై ఎన్నో విజయాలు సాధించిన మథియాస్ బో గురించి చాలా మందికి తెలియకపోవడం బాధాకరమని చెప్పింది.
క్యాన్సర్‌తో పోరాడి ఒలింపిక్స్ బరిలోకి దిగి - Pairis Olympics 2024 Chou tien chen
మనుబాకర్లో స్ఫూర్తి నింపిన ఆ టాటూ - దీని గురించి మీకు తెలుసా? - Paris Olympics 2024 Manu Bhaker