Paris Olympics Highlights 2024: పారిస్ ఒలింపిక్స్ ముగింపు దశకు చేరుకుంది. ఈ విశ్వ క్రీడల్లో భారత అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన చేశారు. ఆయా క్రీడాంశాల్లో రాణించి మొత్తం 6 పతకలు సాధించారు. అందులో ఒకటి రజతం కాగా, మిగిలిన ఐదు కాంస్యాలు. భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైంది. దీంతోపాటు ఈ ఒలింపిక్స్‌లో పలు సంచలనాలు, వివాదాలు జరిగాయి. అవెంటంటే?
ఈసారి భిన్నంగా
గత ఒలింపిక్స్‌కులా కాకుండా ఈసారి క్రీడా గ్రామానికి దూరంగా ఓపెంనిగ్ సెర్మనీ సెలబ్రేషన్స్ జరిగాయి. సెన్ నదిపై బోట్లలో అథ్లెట్లు ర్యాలీగా వచ్చారు. అయితే, కాసేపు వర్షంపడడం వల్ల వార్తల్లో నిలిచింది. సంబరాల్లో భాగంగా లెస్బియన్ డీజే బార్బరా బట్చ్ బృందంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరికి USA అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించడం గమనార్హం. ఈత పోటీల సందర్భంగా కాలుష్యం పెరిగిపోవడం వల్ల పలువురు అథ్లెట్లు అస్వస్థతకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి.
వినేశ్ డిస్క్వాలిఫై
భారత్‌కు పతకం ఖాయమైన రెజ్లింగ్ విభాగంలో నిరాశ ఎదురైంది. ఫైనల్‌కు ముందు నిర్వహించిన బరువు కొలతల్లో 100 గ్రాములు అధికంగా ఉందనే కారణంతో అనర్హతకు గురైంది. దీంతో తీవ్ర వివాదం రేగింది. ఆర్బిట్రేషన్‌కు వినేశ్ అప్పీలు చేసింది. ఏకంగా రెజ్లింగ్‌కే వీడ్కోలు పలికేసింది. ఆమెకు పలువురు రెజ్లర్లు మద్దతుగా నిలిచారు.
Give Vinesh Silver 🥈🙏@Phogat_Vinesh #vineshphogat pic.twitter.com/1WWFoUo5RI
— geeta phogat (@geeta_phogat) August 7, 2024
జకోవిచ్ ఈసారి కొట్టేశాడు
టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ ఈ ఒలింపిక్స్‌లో పసిడి పట్టేశాడు. ఒలింపిక్స్ సింగిల్స్ ఫైనల్ ఈవెంట్లో కార్లోస్ అల్కరాజ్‌పై జకోవిచ్ నెగ్గి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. 37ఏళ్ల జకోవిచ్ ఫ్రెంచ్, వింబుల్డన్, ఆస్ట్రేలియన్, యూఎస్ ఓపెన్ టైటిళ్లను ఇప్పటికే గెలిచాడు. ఇప్పుడీ స్వర్ణంతో అన్నింటిని సొంతం చేసుకున్న ఐదో టెన్నిస్ ప్లేయర్‌గా నిలిచాడు.
Novak Djokovic. Olympic champion. 🥇
— The Olympic Games (@Olympics) August 4, 2024
Congratulations @DjokerNole on completing the career golden slam. 👏#Paris2024 @Paris2024 @ITFTennis pic.twitter.com/ZkM99FSjZv
యూసుఫ్ డికేక్
తుర్కియే షూటర్ 51ఏళ్ల యూసుఫ్ డికేక్ ఎలాంటి లెన్స్, ఇయర్ ఎక్విప్మెంట్ లేకుండా సాధారణ ప్రేక్షకుడిలా వచ్చి రజతం ఎగరేసుకుపోయి ఔరా అనిపించాడు. అందరు షూటర్లలా ఎక్విప్మెంట్ ధరించకుండా జేబులో స్టైల్‌గా చేయి పెట్టుకుని తుటా పేల్చి సిల్వర్ ముద్దాడి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాడు.
సిమోన్ బైల్స్ హైటైట్
అమెరికా జిమ్నాస్టిక్ అథ్లెట్ సిమోన్ బైల్స్ ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. పోడియంపై తన ప్రత్యర్థి రెబెకా ఆండ్రాడెపై ప్రశంసలు కురిపించింది. రెబెకాను క్వీన్‌గా అభివర్ణించింది. రెబెకా స్వర్ణం గెలుచుకోగా బైల్స్ రజతం దక్కించుకుంది.
లింగ వివాదం
బాక్సింగ్‌లో లింగ వివాదం హైలైట్‌గా నిలిచింది. అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్ 'ఆమె' కాదంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కేవలం 46 సెకన్లలోనే ప్రత్యర్థిని చిత్తు చేయడం వల్ల విమర్శలూ ఎక్కువయ్యాయి. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఆఖరికి పసిడి సాధించి తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఇలాంటి పరిస్థితే తైవాన్‌కు చెందిన బాక్సర్ లిన్ యూ టింగ్‌కు ఎదురైంది. ఆమె కూడా తన విభాగంలో గోల్డ్ సాధించింది.
14 ఏళ్లకే గోల్డ్
ఆస్ట్రేలియా స్కేట్‌బోర్డింగ్ సంచలన అథ్లెట్ ఆరిసా ట్రై రికార్డు సృష్టించింది. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఆమె దేశం తరఫున గోల్డ్ పతకం సాధించిన క్రీడాకారిణిగా నిలిచింది. క్లిష్టమైన ఫైనల్‌లో తనకిష్టమైన పింక్ హెల్మెట్‌తో అద్భుతం చేసింది. ఇందులోనే చైనాకు చెందిన 11 ఏళ్ల జెంగ్ హోవాహో కూడా పాల్గొంది. ఆమెకు ఎలాంటి పతకం రాలేదు.
వరుసగా ఐదు పసిడి పతకాలు
క్యూబా రెజ్లర్ మిజైన్ లోపేజ్ చరిత్ర సృష్టించాడు. వ్యక్తిగత విభాగంలో వరుసగా ఐదు స్వర్ణ పతకాలను సాధించిన అథ్లెట్‌గా నిలిచాడు. 42 ఏళ్ల లోపేజ్ రెజ్లింగ్‌కు వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమని ప్రకటించాడు.