Paris Olympics 2024 Womens Football Team : తమ ప్రత్యర్థి జట్టు ఎలా శిక్షణా తీసుకుంటుందో అన్న విషయాన్ని తెలుసుకునేందుకు వారి ట్రైనింగ్ సెంటర్ వద్ద డ్రోన్ ఎగురవేసిన ఘటనలో కెనడా మహిళల ఫుట్‌బాల్ టీమ్‌పై FIFA ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కెనడాకు ఆరు పాయింట్ల కోతను విధించింది. అంతేకాకుండా కోచ్ బెవెర్లీ ప్రీస్ట్‌మన్‌పై ఏడాదిపాటు సస్పెన్షన్ విధించినట్లు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా కీలక ప్రకటన చేసింది.
"కెనడా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఫిఫా నిబంధనలను పాటించడంలో ఈ టీమ్ విఫలం చేందటం బాధాకరం. శిక్షణ శిబిరాల వద్ద డ్రోన్లను ఎగురవేయడాన్ని నిషేధించాం. అయితే ఈ విషయంలో జట్టు మేనేజ్మెంట్ హస్తం మాత్రమే ఉందని తేలింది. ప్లేయర్లకు దీనికి ఎటువంటి సంబంధం లేదని తెలిసింది. అందుకోసమే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కానీ కెనడా అసోషియేషన్‌కు మాత్రం 2.26 లక్షల డాలర్లను జరిమానాగా విధించాం. దీంతో పాటు కోచ్‌పై ఏడాది పాటు నిషేదాన్ని విధించాం" అంటూ ఫిఫా అధికారిక వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు కెనడా ఫుట్‌బాల్ టీమ్ అనలిస్ట్ జోయ్ లింబార్డిని ఇప్పటికే తమ దేశానికి తిరిగి పంపించారు. అయితే ఈ నిషేధంతో పాటు అతడికి 8 నెలల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం. అసిస్టింట్ కోచ్ జసైమ్ మందార్ కూడా ఇప్పటికే స్వదేశానికి వెళ్లిపోయింది.న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ప్రధాన కోచ్ ప్రీస్ట్‌మన్ కూడా తనకు తానుగానే వైదొలిగింది.
ఇక ఈ మ్యాచ్‌లో కెనడా గెలుపొందింది. కానీ డిఫెండింగ్ ఛాంపియన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవాలంటే గ్రూప్ స్టేజ్‌లో మిగతా రెండు మ్యాచుల్లోనూ వీరు తప్పక గెలవాల్సి ఉంది. పాయింట్ల కోత పడటం వల్ల కెనడా ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే గ్రూప్-Aలో కివీస్, ఫ్రాన్స్, కొలంబియాతో కెనడా తలపడుతోంది. ఈ పాయింట్ల కోత వల్ల మ్యాచులన్నీ గెలిచినా కూడా ఇతర టీమ్‌లు టాప్కు చేరుకుంటే కెనడాకు కష్టాలు తప్పదని క్రీడా నిపుణుల మాట.
భార్యకు సారీ చెప్పిన స్టార్ అథ్లెట్ - ఒలింపిక్స్ వేదికలో అలా చేసినందుకు! - Paris Olympics 2024
డ్రాగన్ దేశానికే తొలి స్వర్ణం - పారిస్ ఒలింపిక్స్‌లో మెడల్స్ ఖాతా తెరిచింది ఎవరంటే?