Paris Olympics 2024 Hockey : పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా తాజాగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 1 (4)- 1 (2) తేడాతో టీమ్ఇండియా విజయం సాధించింది. ఈ గెలుపుతో నేరుగా సెమీస్‌కు చేరుకుంది. తొలుత ఈ మ్యాచ్ 1-1తో టై అవ్వగా, ఆ తర్వాత షూటౌట్‌లో భారత్ 4-2తో గెలుపొందింది. తొలి క్వార్టర్‌లో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా స్కోర్ చేయలేదు.
అయితే రెండో క్వార్టర్‌లో భారత్ డిఫెండర్ అమిత్ రోహిదాస్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. హాకీ స్టిక్‌తో బ్రిటన్ ఆటగాడిని ఉద్దేశపూర్వకంగా కొట్టాడని అక్కడి రిఫరీలు రోహిదాస్‌ను రెడ్ కార్డ్ ద్వారా గేమ్ నుంచి బయటికి పంపించారు. దీంతో భారత్ 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. సరిగ్గా 22వ నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా ఓ గోల్ సాధించి భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. ఇక 27వ నిమిషంలో బ్రిటన్ ప్లేయర్ మోర్టన్ లీ గోల్ చేయడం వల్ల స్కోర్ సమం అయింది. ఆ తర్వాతి రెండు క్వార్టర్స్‌లోనూ ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్ షూటౌట్‌కు దారితీసింది.
మరోవైపు భారత హాకీ జట్టు ఇప్పటివరకూ ఒలింపిక్స్‌లో 12 పతకాలను గెలుచుకుంది. అందులో 8 స్వర్ణాలు, 3 కాంస్యాలు, ఓ రజత పతకం ఉంది. దీంతో ఈ పారిస్ ఒలింపిక్స్‌లోనూ కూడా అదరగొట్టి మరో పతాకాన్ని ఖాతాలో వేసుకోవాలని భారత్ హాకీ జట్టు ఉవ్విళ్లూరుతోంది.
🇮🇳🔥 𝗪𝗛𝗔𝗧 𝗔 𝗪𝗜𝗡! The Indian men's hockey team secured a fantastic victory in a shoot-out thriller to book their place in the semi-final and move one step closer to Olympic glory.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 4, 2024
🏑 A red card for Amit Rohidas in the second quarter threatened to change the momentum of… pic.twitter.com/u0sTZ8Dket
క్వార్టర్స్‌లో లవ్లీనా ఓటమి - చేజారిన మరో పతకం
పారిస్ ఒలింపిక్స్‌లో మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ ఓటమిపాలైంది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో చైనాకు చెందిన క్వియాన్ చేతిలో 1-4 పాయింట్ల తేడాతో ఓడి సెమీస్‌కు చేరే అవకాశాన్ని ఆమె చేజార్చుకుంది. దీంతో భారత్ తన ఖాతాలో మరో పతకం అందుకునే అవకాశాన్ని కోల్పోయింది. అయితే 2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా 69 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఈ గెలుపుతో ఆమె అప్పట్లో సంచలనం సృష్టించింది.
🇮🇳😓 𝗧𝗼𝘂𝗴𝗵 𝗹𝘂𝗰𝗸 𝗳𝗼𝗿 𝗟𝗼𝘃𝗹𝗶𝗻𝗮! She faced defeat against 1st seed, Li Qian, in the quarter-final, narrowly missing out on securing her second Olympic medal.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 4, 2024
🥊 Final Score: Lovlina 1 - 4 Li Qian
👉 𝗙𝗼𝗹𝗹𝗼𝘄 @sportwalkmedia 𝗳𝗼𝗿 𝗲𝘅𝘁𝗲𝗻𝘀𝗶𝘃𝗲… pic.twitter.com/srGOHjvJ1F
నీరజ్ గోల్డ్ మెడల్ కొడితే 'ఫ్రీ వీసా'- ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు! - Paris Olympics 2024