Paralympics 2024 : పారిస్ వేదికగా పారాఒలింపిక్స్‌కు కోసం జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఆగస్ట్ 28 నుంచి ఈ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఇక భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు పోటీపడనున్నారు. అయితే పారాఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారులుగా భాగ్యశ్రీ జాధవ్, సుమిత్ అంతిల్‌ను ఎంపిక చేస్తూ తాజాగా ఐవోఏ అనౌన్స్ చేసింది.
మహారాష్ట్రకు చెందిన భాగ్యశ్రీ జాదవ్ షాట్‌ఫుట్ క్రీడాకారిణి. ఎఫ్ 34 కేటగిరీలో మంచి ఫామ్‌లో ఉంది. జావెలిన్‌త్రో స్టార్ సుమిత్ అంతిల్ ఎఫ్ 64 కేటగిరీలో వరల్డ్ రికార్డు సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో 68.55 మీటర్లు త్రో చేశాడు.
ఇక గత టోక్యో పారాఒలింపిక్స్‌లో 54 మంది భారత్ నుంచి బరిలోకి దిగగా, అందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు వచ్చాయి. మొత్తం 19 పతకాలతో 24వ స్థానంలో నిలిచింది. ఈసారి మరిన్ని పతకాలు లక్ష్యంగా భారత్ బరిలోకి దిగనుంది.
పారాఒలింపిక్స్‌లో పాల్గొననున్న ఇండియన్ అథ్లెట్స్ ఎవరంటే ?
అథ్లెటిక్స్: దీప్తి జీవాంజి, శైలేశ్ కుమార్, సుమిత్ అంతిల్, సందీప్, అజీత్ సింగ్, సుందర్ సింగ్ గుర్జార్, రింకు, నవ్‌దీప్, యోగేశ్ కథునియా, ధరంబిర్, అమిత్ కుమార్, రామ్ పాల్, మరియప్పన్ తంగవేలు, నిషాద్ కుమార్, రవి రొంగలి, శరద్ కుమార్, సచిన్ సర్జేరావు ఖిలారి, ప్రవీణ్ కుమార్, మహమ్మద్ యాసెర్, రోహిత్ కుమార్, ప్రీతి పాల్, భాగ్యశ్రీ మాధవ్‌రావు జాధవ్, మను, సందీప్ సంజయ్ గుర్జార్, అరవింద్, దీపేశ్ కుమార్, ప్రవీణ్ కుమార్, దిలీప్ మహదు గవిట్, సోమన్ రానా, హొకటో సేమ, సాక్షి కసానా, కరమ్ జ్యోతి, రక్షిత రాజు, అమిషా రావత్, భవనాబెన్, సిమ్రన్, కంచన్ లఖాని.
ఆర్చరీ: రాకేశ్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామి, హర్విందర్ సింగ్, పూజ, సరిత, షీతల్ దేవి
బ్యాడ్మింటన్: మనోజ్ సర్కార్, కృష్ణ నగర్, నితేశ్ కుమార్, శివరాజన్ సోలైమలై, సుహాస్ యతిరాజ్, సుకాంత్ కాదమ్, తరుణ్, మానసి జోషి, మన్‌దీప్ కౌర్, పాలక్ కోహ్లీ, మనీషా రామదాస్, తులసిమతి మురుగేశన్, నిత్యశ్రీ శివన్
కనావో: ప్రాచీ యాదవ్, యశ్ కుమార్, పూజా ఝా
సైక్లింగ్: జ్యోతి గడేరియా,అర్షద్ షైక్
బ్లైండ్ జూడో: కోకిలా,కపిల్ పర్మార్
పవర్ లిఫ్టింగ్: అశోక్, శకినా ఖతున్, పరమ్‌జీత్ కుమార్, కస్తూరి రాజమణి
రోయింగ్: నారాయణ కొంగనపల్లె, అనిత.
షూటింగ్ : శ్రీహర్ష దేవరద్ది రామకృష్ణ, అమిత్ అహ్మద్ భట్, సిద్ధార్థ్ బాబు, అవని లేఖర, మోనా అగర్వాల్, మనీశ్ నర్వాల్, రుబినా ఫ్రాన్సిస్, రుద్రాంక్ష్ ఖండేల్‌వాల్, స్వరూప్ మహవీర్, నిహాల్ సింగ్.
స్విమ్మింగ్: సుయాశ్ నారాయణ్ జాధవ్
టేబుల్ టెన్నిస్: సోనాల్‌బెన్ పటేల్, భవినాబెన్ పటేల్