Overseas Player Most IPL Runs: ఐపీఎల్‌కు ప్రపంచంలోని అన్ని టీ20 క్రికెట్ లీగ్స్‌లోకెల్లా ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనికి ఉన్న క్రేజ్ వేరు. ఈ రిచెస్ట్ స్పోర్ట్స్ లీగ్‌లో ఆడటానికి భారత్‌తో పాటు విదేశీ క్రికెట్ ప్లేయర్‌లు కూడా పోటీ పడుతారు. ప్రతిభ ఉండాలే కానీ ఐపీఎల్‌లో అవకాశాలకు కొదవ లేదు.
ఇప్పటి వరకు చాలా టీమ్‌లకు ఫారిన్ ప్లేయర్‌లు కెప్టెన్‌లుగా కూడా వ్యవహరించారు. వేలంలోనూ అత్యధిక ధర పలికారు. కొంత మంది ఆటగాళ్లు ఆయా టీమ్‌లతో ఉన్న సుదీర్ఘ రిలేషన్‌షిప్‌తో భారత్ ప్లేయర్‌ల స్థాయిలో గుర్తింపు పొందారు. ఫ్యాన్స్‌కి చాలా దగ్గరైపోయారు. ఐపీఎల్‌లో ఎక్కువ కాలం కొనసాగి, అత్యధిక పరుగులు చేసిన ఫారిన్ ప్లేయర్స్ ఎవరో చూద్దాం.
- జోస్ బట్లర్ : ఈ ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. 2016లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 2017లో ముంబయి ఇండియన్స్ టైటిల్ నెగ్గిన జట్టులో బట్లర్ సభ్యుడు. 99 మ్యాచ్‌లు, 98 ఇన్నింగ్స్‌లలో 3,258 పరుగులు చేశాడు. 5 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు బాదాడు. అత్యధిక రన్స్ చేసిన విదేశీ ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు.
- కీరన్ పొలార్డ్: పొలార్డ్ ఐపీఎల్ కెరీర్ మొత్తం ముంబయి ఇండియన్స్ తరఫున ఆడాడు. ముంబయి ఐదు టైటిల్స్ గెలిస్తే అన్నిసార్లూ పొలార్డ్ జట్టులో సభ్యుడు. 189 మ్యాచ్‌లు, 171 ఇన్నింగ్స్‌లలో 3,412 పరుగులు చేశాడు. ఇందులో మొత్తం 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జాబితాలో ఐదో స్థానం దక్కించుకున్నాడు.
- ఫాఫ్ డూ ప్లెసిస్: సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఫాఫ్ డూప్లెసిస్ ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ ఆడాడు. అతడు ఐపీఎల్‌లో మొత్తం 134 మ్యాచ్‌లలో, 4,198 పరుగులు చేశాడు. ఇందులో 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. లిస్టులో నాలుగో స్థానంలో నిలిచాడు.
- క్రిస్ గేల్: యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఐపీఎల్‌లో చాలా ఏళ్లు ఫ్యాన్స్‌కు తన బ్యాటింగ్‌తో మజానిచ్చాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల తరఫున గేల్ 142 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 4,965 పరుగులు చేశాడు. మొత్తం 6 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు కొట్టాడు. లిస్టులో గేల్ మూడో ప్లేస్‌లో ఉన్నాడు.
- ఏబీ డివిలియర్స్: సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ తన 360 డిగ్రీల ఆటతో ఐపీఎల్‌లో వినోదం పంచేవాడు. ఐపీఎల్ కెరీర్లో దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరఫున ఆడినా ఆర్సీబీలోనే ఎక్కువ ఫ్యాన్స్‌ను సంపాందించుకున్నాడు. మొత్తం 184 ఐపీఎల్ మ్యాచ్‌లలో, 5,162 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా, 2021 తర్వాత డివిలియర్స్ ఐపీఎల్‌కు గుడ్‌బై పలికాడు.
- డేవిడ్ వార్నర్: ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న ఫారిన్ ఆటగాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించినందున వార్నర్‌కు తెలుగు క్రికెట్ ఫ్యాన్స్‌కు మంచి బాండింగ్ ఏర్పడింది. అతడి కెప్టెన్సీలో 2016లో సన్‌రైజర్స్ ఛాంపియన్‌గానూ నిలిచింది. ఇక ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఓవర్సీస్ బ్యాటర్‌గా నిలిచాడు. 179 మ్యాచ్‌లలో వార్నర్ 6,527 పరుగులు చేసి ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉన్నాడు. ఇందులో 4 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మయంక్ అవి బంతులా? బుల్లెట్లా?- లఖ్‌నవూకు స్పీడ్ గన్ దొరికేసింది! - Mayank Yadav IPL 2024