ETV Bharat / sports

ముంబయి సంగతేంటి? ఫ్లే ఆఫ్ ఛాన్స్​లు గల్లంతేనా? - IPL 2024

Mumbai Indians Playoff Chances: 2024 ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​ వరుస పరాజయాలతో సతమతమవుతోంది. తాజాగా దిల్లీతో మ్యాచ్​లోనూ ఓడి, ప్రస్తుత సీజన్​లో 6వ పరాజయం మూటగట్టుకుంది. దీంతో ప్లే ఆఫ్‌ అవకాశాలను ముంబయి ఇండియన్స్‌ చేసుకుంది. ఇక మిగిలిన ప్రతీ మ్యాచ్‌ డూ ఆర్‌ డైగా మారింది. ఒక్క మ్యాచులో ఓడినా హార్దిక్ సేన ప్లే ఆఫ్‌ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారుతాయి. అసలు ముంబయి ప్లే ఆఫ్‌ చేరాలంటే ఏం జరగాలంటే?

MI PLAYOFFS CHANCES
MI PLAYOFFS CHANCES
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 12:06 PM IST

Mumbai Indians Playoff Chances: 2024 ఐపీఎల్‌లో ముంబయి వరుస పరాజయాలతో సతమతమవుతోంది. నూతన సారధి హార్దిక్‌ పాండ్య నేతృత్వంలో పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ప్రస్తత సీజన్​లో తొమ్మిది మ్యాచ్​లు ఆడిన ముంబయి ఏకంగా ఆరింట్లో ఓడి, కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. 5 సార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి నుంచి ఈ ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. తాజాగా దిల్లీ క్యాపిటల్స్‌ చేతిలోనూ ఓడిన ముంబయి ప్లేఆఫ్స్​ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది. దీంతో ముంబయి ప్లేఆఫ్స్​కు చేరే అవకాశాలపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మరి 5సార్లు ఛాంపియన్ ఈసారి ప్లే ఆఫ్స్​ చేరాలంటే?

ముంబయిప్లే ఆఫ్‌కు చేరాలంటే
ముంబయి ఇండియన్స్‌ లీగ్‌ దశలో ఇంకా 5 మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్​తో ఒకసారి, కోల్‌కతా నైట్ రైడర్స్, లఖ్​నవూ సూపర్ జెయింట్స్‌తో రెండేసి మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం రాజస్థాన్‌, కోల్‌కతా, లఖ్​నవూ, హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో టాప్‌ -4లో ఉన్నాయి. అంటే టాప్‌- 4లో ఉన్న మూడు జట్లతోనే ముంబయి తమ 5 మ్యాచ్​లు ఆడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్​లన్నీ గెలిస్తే ముంబయి ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. అదే ఈ ఐదింట్లో మ్యాచుల్లో ముంబయి ఒక్క మ్యాచ్‌ ఓడిపోయినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.

ముంబయి ఒక మ్యాచులో ఓడిపోతే, మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. మిగిలిన 5 మ్యాచ్‌ల్లో ముంబయి తమ సొంత మైదానం వాంఖడే స్టేడియంలోనే మూడు మ్యాచులు ఆడనుంది. ఇది వారికి కలిసొచ్చే అంశం. అయితే వాంఖడే స్టేడియంలో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. విధ్వంసకర బ్యాటర్లు ఉన్న కోల్‌కతా, లఖ్​నవూ, సన్‌రైజర్స్‌ బ్యాటర్లను ముంబయి బౌలర్లు కట్టడి చేస్తారా? అన్నదే ఆసక్తికరంగా మారింది.

లఖ్​నవూలోని ఎకానా స్టేడియం, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ముంబయి మరో రెండు మ్యాచులు ఆడనుంది. ఈడెన్ గార్డెన్స్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కానీ లఖ్​నవూ ఎకానా వాజ్‌పేయీ స్టేడియం ఈ రెండు పిచ్‌లతో పోలిస్తే అది స్లో పిచ్. ఇక మిగిలిన ఐదు మ్యాచ్​ల్లో ముంబయి ఒక్క మ్యాచ్​లో ఓడినా దిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ ఫలితాలపై ముంబయి ఆధారపడాల్సి ఉంటుంది. దిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచుల్లో అయిదు విజయాలతో 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో ఉండగా. చెన్నై ఎనిమిది మ్యాచుల్లో నాలుగు విజయాలతో ఆరో స్థానంలో ఉంది.

పోరాడి ఓడిన ముంబయి - దిల్లీ ఖాతాలో ఐదో విజయం - IPL 2024 DC VS MI

యూట్యూబ్​ ఛానెల్​ స్టార్ట్ చేసిన బుమ్రా - ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​ - Jasprit Bumrah youtube channel

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.