MS Dhoni IPL All Time Great Team Captian : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఆల్‌టైమ్ అత్యుత్తమ జట్టు సారథిగా మహేంద్ర సింగ్ ధోని సెలెక్ట్ అయ్యాడు. 2008లో ప్రారంభమై బ్లాక్ బాస్టర్ లీగ్‌గా మారిన ఈ మెగాలీగ్‌లో ఇప్పటి వరకు ఆడిన ఆటగాళ్లతో అత్యుత్తమ జట్టును తాజాగా ప్రకటించారు. వసీం అక్రమ్, టామ్ మూడీ, మాథ్యూ హేడెన్, డేల్ స్టెయిన్‌తో కూడిన సెలక్షన్ ప్యానల్ - 70 మంది పాత్రికేయులతో కలిసి ఈ జట్టును ఎంపిక చేసింది. ఈ టీమ్‌లో మహీతో పాటు మరింత మంది ప్లేయర్స్‌కు చోటు దక్కింది. వార్నర్, విరాట్ కోహ్లీని ఓపెనర్లుగా ఎంపిక చేశారు. వన్‌డౌన్‌లో క్రిస్ గేల్‌కు, మిడిలార్డర్‌లో రైనా, డివిలియర్స్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్య, జడేజా, పొలార్డ్‌లకు స్థానం కల్పించారు. స్పిన్ విభాగంలో చాహల్, రషీద్ ఖాన్, నరైన్‌కు చోటు దక్కింది. పేసర్లుగా మలింగ, బుమ్రాలను సెలెక్ట్ చేశారు. ఫిబ్రవరి 20, 2024 నాటికి ఐపీఎల్ మొదలై 16 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా జట్టును ఎంపిక చేశారు.
మొత్తంగా ఈ 16 ఏళ్ల ఐపీఎల్ జర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా(IPL CSK Captain Dhoni) మహీ తనదైన ముద్రవేశాడు. జట్టుకు ఐదు టైటిళ్లను అందించాడు. అయితే ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ కూడా తనదైన ముద్రవేశాడు. ఐదుసార్లు ముంబయిను విజేతగా నిలిపాడు. దీంతో ఆల్‌టైమ్ టీమ్ కెప్టెన్ సెలక్షన్లో ధోనీ, హిట్ మ్యాన్ మధ్య తీవ్రపోటీ నెలకొంది. అలా ఈ పోటీలో చివరికి మహీవైపు ప్యానెల్ సభ్యులు మొగ్గు చూపారు. అసలు రోహిత్ శర్మకు జట్టులో చోటునే కల్పించలేదు.
మహీ అసలైన కెప్టెన్. అతడు అందుకోలేని విజయాలే లేవు. ఐపీఎల్‌లో చెన్నైను నడిపించిన తీరు అద్భుతం అని స్టెయిన్ పేర్కొన్నాడు. మెరుగైన జట్టుతోనూ సాధారణ జట్టుతోనూ టైటిళ్లు సాధించిపెట్టిన సారథి ధోని మాత్రమే. రోహిత్ శర్మ కూడా మంచి కెప్టెనే కానీ ముంబయి జట్టులో నాణ్యమైన ప్లేయర్స్ చాలా మందే ఉన్నారు అని టామ్ మూడీ చెప్పుకొచ్చారు.
టీమ్ఇండియాపై బజ్‌బాల్ పనిచేయదు గురూ- దూకుడుగా ఆడడం భారత్‌కు కొత్తేం కాదు
చరిత్ర సృష్టించిన భారత్- టెస్టుల్లో టీమ్ఇండియా నయా రికార్డ్స్