ETV Bharat / sports

వాళ్ల బ్యాగ్ మోసిన ధోనీ- ఫ్యాన్స్ ఫిదా!- వీడియో వైరల్ - MS Dhoni IPL 2024 - MS DHONI IPL 2024

MS Dhoni IPL 2024: ధోని ఐపీఎల్​లో ఇప్పుడు కెప్టెన్‌ కాదు. సాధారణ ప్లేయర్‌గా ఆడుతున్నాడు. ధోనీని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్న అభిమానులను ఓ వైరల్ వీడియో రూపంలో పలకరించాడు. చెన్నై వర్సెస్‌ ఆర్సీబీ మ్యాచ్‌కి ముందు ధోని చేసిన పని వైరల్‌ అయింది. ఇంతకీ ధోని ఏం చేశాడంటే..

MS Dhoni IPL 2024
MS Dhoni IPL 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 8:51 PM IST

MS Dhoni IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) ప్రారంభానికి ఒక్క రోజు ముందు ఎంఎస్‌ ధోని అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. తనంతట తానుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్సీ వదులుకున్నాడు. ఇప్పుడు చెన్నై కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతలు తీసుకున్నాడు. ఒక్కటి మినహా దాదాపు అన్ని సీజన్‌లలో ధోనీని కెప్టెన్‌గానే చూసిన అభిమానులకు మొదటి సారిగా సాధారణ ప్లేయర్‌గా కనిపించనున్నాడు. జట్టును నడిపించే ఒత్తిడి లేకుండా ధోనీ ఎలా ఆడుతాడో చూడాలని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ధోనికి సంబంధించిన ఓ వీడియో ఫ్యాన్స్‌ని తెగ ఆకట్టుకుంది. ఈ వీడియోలో ఏముందంటే..

సపోర్టింగ్‌ స్టాఫ్‌కి ధోని సాయం: ఐపీఎల్‌ 2024లో మొదటి మ్యాచ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరుగుతోంది. మ్యాచ్‌కి ముందు ధోని చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట్లో వైరలైంది. ధోనీని గ్రౌండ్‌లో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్న చెన్నై ఫ్యాన్స్‌ని ధోని చేసిన చిన్న సాయం ఆకట్టుకుంది. సహాయక సిబ్బందికి సాయంగా ధోని ఓ బాక్స్‌ను మోసుకెళ్తూ కనిపించాడు. ఈ వీడియోలో ధోనీని చూసిన ఫ్యాన్స్‌, నిస్వార్ధం, టీమ్‌పై అంకిత భావానికి నిదర్శమని ప్రశంసిస్తున్నారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిపోయింది.

ఫ్యాన్స్‌ అరుపులతో మార్మోగిన స్టేడియం: చెపాక్‌లోని చిదంబరం స్టేడియంలో సీఎస్కే, ఆర్సీబీ మధ్య IPL 2024 మొదటి మ్యాచ్ మొదలైపోయింది. టాస్‌ గెలిచిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బ్యాటింగ్‌ ఎంచుకుంది. రుతురాజ్‌ గైక్వాడ్‌ నేతృత్వంలో చెన్నై బరిలోకి దిగింది. చాలా మంది ధోనీకి ఇది లాస్ట్‌ ఐపీఎల్ సీజన్‌ అని భావిస్తుండటం, కెప్టెన్‌గా కాకుండా ధోని సాధారణ బ్యాట్స్‌మెన్‌గా ఆడుతుండటంతో.. ధోని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టగానే చెన్నై అభిమానుల హోరుతో స్టేడియం మారుమోగిపోయింది.

చెన్నై బోణీ కొట్టేనా? చెన్నై సూపర్‌ కింగ్స్‌కి ధోనీ అద్భుతమైన కెప్టెన్‌గా ఉన్నాడు. మొదటి సీజన్‌ 2008లో కెప్టెన్‌గా జర్నీ ప్రారంభించాడు. ధోని కెప్టెన్సీలో చెన్నై ఐదుసార్లు టైటిల్‌ గెలిచింది. మొత్తంగా పది సార్లు ఫైనల్ చేరింది. ఈ గణాంకాలు చూస్తే కెప్టెన్‌గా ధోని ఎంత విజయవంతం అయ్యాడో తెలుస్తుంది. మొదటిసారి రుతురాజ్‌ గైక్వాడ్‌ నేతృత్వంలో బరిలో దిగిన చెన్నై ఆర్సీబీపై విజయం సాధించాలని కోరుకుంటున్నారు.

CSK X RCB- ధోనీ, విరాటే స్పెషల్ అట్రాక్షన్- బోణీ కొట్టేదెవరో? - CSK vs RCB IPL 2024 Match Preview

గ్రాండ్​గా ఓపెనింగ్ సెర్మనీ- బాలీవుడ్ సెలబ్రిటీల పెర్ఫార్మెన్స్ అదుర్స్ - Ipl 2024 Opening Ceremony

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.