Mitchell Starc KKR : కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ 2024వ సీజన్ లోనే అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ ఇది. ఈ హోరాహోరీ సమరం, స్టేడియంలోని అభిమానులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ కలిగించింది. చివరి బంతి వరకూ సాగిన సస్పెన్‌ను రాజస్థాన్ మ్యాచ్ గెలిచి ముగించింది. గేమ్ ముగిసే కొద్దీ సిక్సులతో, బౌండరీలతో స్టేడియంలో ఒక గందరగోళ వాతావరణం నెలకొంది. ఐపీఎల్ మ్యాచ్ అంటే ఇలా ఉండాలని అనుకునేంత జోష్ నింపేసింది మంగళవారం జరిగిన గేమ్.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 223 పరుగులు చేశారు. సునీల్ నరైన్ దంచికొడుతూ, ప్రత్యర్థి బౌలర్లను శాసించాడు. 56 బంతుల్లో 109 పరుగులు చేసి ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాడు. యువ క్రికెటర్ రగువంశీ 18 బంతుల్లో 30 పరుగులు చేశాడు. రింకూ సింగ్ సైతం 9 బంతుల్లో 20 పరుగులు చేసి కేకేఆర్ జోరును పెంచడంలో కీలకమయ్యారు. సెకండాఫ్‌లో రాజస్థాన్ రాయల్స్ రెచ్చిపోయి చివరి బంతి ముగిసే సమయానికి విజయాన్ని అందుకుంది.
ఈ ఉత్కంఠభరితమైన పోరులో జోస్ బట్లర్ ఇన్నింగ్స్ రాజస్థాన్ రాయల్స్‌కు గుర్తుండిపోయే విజయాన్ని అందించింది. చివరి బంతి వరకూ ఆడి 60 బంతుల్లో 107 పరుగులు చేశాడు బట్లర్. భారీ లక్ష్య చేధనతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఆరంభం నుంచి దన్నుగా నిలిచాడు. 224 పరుగుల లక్ష్యాన్ని చేరుకోగలిగాడు.
మరోవైపు మిచెల్ స్టార్క్ విషయంలో ఇదంతా రివర్స్. కేకేఆర్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసిన తర్వాత ఐపీఎల్‌లోనే కాస్ట్లీ ప్లేయర్‌గా నిలిచాడు. ఆట విషయంలో అంతే వరస్ట్ ప్లేయర్‌గా మారాడు. మంగళవారం మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయకుండా 4 ఓవర్లలో 50 పరుగులు సమర్పించుకున్నాడు. అంటే ఓవర్ కు 12.5 పరుగుల చొప్పున కోల్‌కతాకు అర్పించేసుకున్నాడు. వావ్ అనిపించుకుంటాడని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. దారుణమైన పెర్ఫార్మెన్స్ కనబరిచాడు. దీంతో మ్యాచ్ అనంతరం మిచెల్ స్టార్క్‌పై మీమ్స్‌తో, కామెంట్స్‌తో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది.
తొమ్మిదేళ్లలో మిచెల్ తొలిసారి ఐపీఎల్ ఆడుతున్నాడు. చూడబోతే జూన్‌లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కు ఇది ప్రాక్టీస్‌లా ఫీల్ అవుతున్నాడేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. అతని ఆటతీరుకు విసిగిపోయిన కేకేఆర్ ఫ్యాన్స్ మ్యాక్స్‌వెల్‌కు మాదిరిగా ఇతను కూడా పక్కకు తప్పుకుంటే బాగుండు అని ఆశిస్తున్నారట.
ఐపీఎల్ కాస్ట్లీ ప్లేయర్లు- ధర ఎక్కువ- పెర్ఫార్మెన్స్ తక్కువ - COSTLY PLAYERS FLOP IN IPL
రూ.24 కోట్ల బౌలర్‌ను బెంబేలెత్తించిన సన్‌రైజర్స్! - IPL 2024