ETV Bharat / sports

మయంక్ అవి బంతులా? బుల్లెట్లా?- లఖ్​నవూకు స్పీడ్‌ గన్‌ దొరికేసింది! - Mayank Yadav IPL 2024

Mayank Yadav IPL 2024: ఐపీఎల్‌లో ఇప్పుడు ఎక్కువ మంది చర్చించుకుంటున్న ప్లేయర్‌ మయాంక్‌ యాదవ్‌. ఈ యంగ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో క్రియేట్‌ చేసిన ఇంపాక్ట్‌ అంతా ఇంతా కాదు. మయాంక్‌ గురించి నెటిజన్లు ఏమంటున్నారంటే?

mayank yadav ipl 2024
mayank yadav ipl 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 3, 2024, 12:09 PM IST

Mayank Yadav IPL 2024: ప్రతి ఐపీఎల్ సీజన్‌లో కొందరు కొత్త యంగ్ టాలెంటెడ్ క్రికెటర్‌లు వెలుగులోకి వస్తుంటారు. గతంలో బుమ్రా, హార్దిక్, జైశ్వాల్, గిల్, సిరాజ్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఇక 2023లో రింకూ సింగ్ వెలుగులోకి రాగా, తాజా సీజన్​లో లఖ్​నవూ పేస్ బౌలర్ మయంక్ యాదవ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

లఖ్​నవూ గత రెండు మ్యాచ్​ల్లో బంతితో అదరగొట్టి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'​గానూ నిలిచాడు మయంక్. ఈ క్రమంలో ఐపీఎల్​ కెరీర్​లో తొలి రెండు మ్యాచ్​ల్లో 3+ వికెట్లు దక్కించుకున్న ఆరో బౌలర్​గా మయంక్ రికార్డు కొట్టాడు. అతడి కంటే ముందుగా లసిత్ మలింగ, అమిత్ మిశ్రా, మయంక్ మార్కండే, కూపర్, జోఫ్రా ఆర్చర్ ఈ ఘనత సాధించారు.

లఖ్​నవూకు స్టార్‌ దొరికినట్లే!
ప్రస్తుత సీజన్​లో లఖ్​నవూ సూపర్ జెయింట్స్ జట్టుకు మయాంక్ యాదవ్ కీలక ప్లేయర్​గా మారాడు. ముఖ్యంగా స్టార్ బౌలర్లు మార్క్ వుడ్, డేవిడ్ విల్లీ సేవలు టీమ్‌కి దూరమయ్యాయి. సీజన్ ప్రారంభానికి ముందు, 2024 ఐపీఎల్​లో పేసర్ మయంక్ కీలక పాత్ర పోషిస్తాడని LSG హెడ్ కోచ్, జస్టిన్ లాంగర్ చెప్పాడు. ఇక తాజాదా పంజాబ్, బెంగళూరు మ్యాచ్​ల్లో మయాంక్‌ స్పీడ్‌ చూసిన నెటిజన్లు మార్క్‌ వుడ్‌ అవసరం లేదని, లఖ్​నవూకు స్టార్‌ దొరికాడని కామెంట్లు చేస్తున్నారు.

బౌలింగ్‌ సంచలనం
లఖ్​నవూ గత రెండు మ్యాచ్​ల్లో మయంక్ ఆటే హైలైట్. ముఖ్యంగా పంజాబ్​తో మ్యాచ్​లో మయంక్ బౌలింగ్​లో అదుర్స్ అనిపించాడు. ఆ మ్యాచ్​లో 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 10 ఓవర్లకు 98-0 పటిష్ఠ స్థితిలో నిలిచి గెలుపు దిశగా సాగింది. అలాంటి దశలో కెప్టెన్ మయాంక్ యాదవ్‌ చేతికి బంతినిచ్చాడు. అంతే అతడు పరగులు నియంత్రించడమే కాకుండా, క్రమంగా వికెట్లు తీయడమే పడగొట్టి లఖ్​నవూకు విజయం అందించాడు. ఈ మ్యాచ్​లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన మయంక్ 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక తాజాగా బెంగళూరుతో మ్యాచ్​లో విజయంలోనూ మయంక్​దే కీలక పాత్ర. ఆర్సీబీ టాపార్డర్ రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్​వెల్, కామెరూన్ గ్రీన్​ను పెవిలియన్ చేర్చి ప్రత్యర్థి జట్టను దెబ్బకొట్టాడు. అందులో ఓ అద్భుత బంతికి గ్రీన్ క్లీన్ బౌల్డయ్యాడు. ఈ మ్యాచ్​లోనూ 3 వికెట్లతో రాణించిన మయంక్​కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కింది.

ఫాస్టెస్ట్ బాల్ 2024
ప్రస్తుత టోర్నీలో అత్యంత వేగవంతమైన బాల్ వేసింది మయాంకే. పంజాబ్ మ్యాచ్​లో తను వేసిన 155.8 kmph స్పీడ్​ రికార్డ్​ను తానే ఆర్సీబీ మ్యాచ్​లో బద్దలుకొట్టాడు. తాజా మ్యాచ్​లో మయంక్ 165.7 kmphతో బౌలింగ్ చేశాడు. అయితే మయాంక్ యాదవ్, భారతదేశానికి తొలి అల్ట్రా- స్పీడ్‌స్టర్ కాదు. ప్రస్తుతం వరుణ్ ఆరోన్‌, ఉమ్రాన్ మాలిక్‌ వంటి వాళ్లు ఉన్నారు. అయితే ఇలాంటి వాళ్లకి గాయాలే ప్రధాన సమస్య. మయాంక్‌ వయస్సు, ఫిట్​నెస్ చూస్తే ఎక్కువ కాలం బౌలింగ్‌ చేయగలడు.

ఈ పేసర్లు యమ స్పీడు- బంతి విసిరితే 150+kmph పక్కా!- IPLలో టాప్ 5 ఫాస్టెస్ట్ బాల్స్ - Fastest Ball In IPL

నయా స్పీడ్ గన్​కు షూ స్పాన్సర్లు లేరట!- మయంక్ టార్గెట్ అదే - Mayank Yadav IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.