Jasprit Bumrah Captaincy : 2024 బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో తొలి టెస్టులో టీమ్ఇండియాను స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టును నడిపించనున్నాడు. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుమ్రా నవ్వులు పూయించాడు. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇచ్చి ఆకట్టుకున్నాడు. తనను మీడియం పేసర్ అని పిలిచిన రిపోర్టర్‌కు ఫన్నీ కౌంటర్ ఇచ్చాడు.
ప్రెస్మీట్లో ఓ రిపోర్టర్ బుమ్రాను 'మీడియం పేస్ ఆల్ రౌండర్' అని సంబోధించాడు. దాంతో బుమ్రా వెంటనే తాను గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తానని చెప్పాడు. అలాగే మరో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బుమ్రా సమయస్ఫూర్తిగా, ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు.
రిపోర్టర్ ప్రశ్న : ఓ మీడియం పేస్ ఆల్ రౌండర్‌గా భారత జట్టుకు సారథ్యం వహించడం ఎలా ఉంది?
బుమ్రా : యార్ నేను గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలను. కనీసం నువ్వు ఫాస్ట్ బౌలర్ కెప్టెన్ అని పిలువు. పేసర్లకు కెప్టెన్సీ ఇవ్వడాన్ని నేను ఎప్పుడూ సమర్థిస్తాను. ఎందుకంటే వారు వ్యూహాత్మకంగా ఆలోచిస్తారు. పాట్ కమిన్స్ ఆసీస్‌ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. కపిల్ దేవ్ సహా చాలా మంది జట్టును విజయపథంలో నడిపించిన సందర్భాలు ఉన్నాయి.
అలాగే బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా అన్ని విధాల సిద్దమైందని బుమ్రా వ్యాఖ్యానించాడు. జట్టులోని చాలా మంది కుర్రాళ్లు తొలిసారి ఆసీస్ పర్యటనకు వచ్చారని పేర్కొన్నాడు. కానీ తాము తొలిసారి ఆసీస్ పర్యటనకు వచ్చినప్పుడు ప్రస్తుత సమయం కంటే చాలా తక్కువ సమయం లభించిందని కానీ సిరీస్ గెలిచామని గుర్తు చేసుకున్నాడు.
పెర్త్ వేదికగా
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు రేపు (నవంబర్ 22) ప్రారంభం కానుంది. పెర్త్ లోని ఆప్టస్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7.50 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
'టీమ్ఇండియాను అంత తేలిగ్గా తీసుకోవద్దు'- ఆసీస్‌కు బుమ్రా వార్నింగ్!
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ - మనోళ్ల ముందున్న 12 భారీ రికార్డులివే