ETV Bharat / sports

సెంట్రల్​ కాంట్రాక్ట్ నుంచి ఔట్​ - ఇషాన్, శ్రేయస్​కు కలిగే నష్టాలేంటి? - bcci central contract 2024

Ishan Kishan Shreyas Iyer BCCI Central Conract : 2023-24 సెంట్రల్ కాంట్రాక్ట్‌ లిస్ట్​ నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌ పేర్లను బీసీసీఐ తొలగించిన సంగతి తెలిసిందే. దీని వల్ల వాళ్లకు కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం?

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 9:47 AM IST

Ishan Kishan Shreyas Iyer BCCI Central Conract : టీమ్ ఇండియా ప్లేయర్స్​కు సంబంధించిన 2023-24 సెంట్రల్ కాంట్రాక్ట్‌లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆదేశాలను పెడచెవిన పెట్టి దేశవాళీ టోర్నీలో పాల్గొనని ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లపై బీసీసీఐ వేటు వేసింది. సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌ నుంచి ఈ యంగ్​ ప్లేయర్స్​ను​ తొలగించింది. దీంతో ఇషాన్ కిషాన్, శ్రేయస్ అయ్యర్ భవిత్యవం ఏంటి? వీరు ఇక నుంచి టీమ్​ ఇండియా జెర్సీని ధరించలేరా? కాంట్రాక్ట్ కోల్పోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? అన్న సందేహాలు క్రికెట్ అభిమానులకు కలుగుతున్నాయి.

సెంట్రల్ కాంట్రాక్ట్ అనేది ప్లేయర్స్​కు ఎంతో కీలకం. దీన్ని కోల్పోతే ఆర్థికంగా, ఆట పరంగా వాళ్లు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే కాంట్రాక్ట్ పొందిన ప్లేయర్స్​కు బీసీసీఐ నుంచి పెద్ద మొత్తంలో వేతనం అందుతుంది. గరిష్టంగా ఏ+ గ్రేడ్‌ ఆటగాళ్లకు ఏడాదికి రూ. 7 కోట్లను బీసీసీఐ చెల్లిస్తుంది.

ఇంకా జాతీయ క్రికెట్ అకాడమీకి (ఎన్సీఏ) ప్లేయర్స్​ నేరుగా వెళ్లచ్చు. దీంతో పాటు సమగ్ర బీమా రక్షణ కూడా వీరికి ఉంటుంది. వైద్య ఖర్చులన్నింటినీ బోర్డే భరిస్తుంది. ఒకవేళ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్నా ఆ ఆర్థిక నష్టాన్ని బీసీసీఐ భర్తీ చేస్తుంది. అలా ఆర్థికంగా ఉన్న ఈ లాభాలన్నింటీ శ్రేయస్, ఇషాన్ కోల్పోయినట్టే. ఇక గాయపడినప్పుడు చికిత్స తీసుకోవడానికి ఎన్సీఏకు వెళ్లాలంటే రాష్ట్ర బోర్డుల అనుమతి కూడా తీసుకోవాలి.

ఆట పరంగానూ శ్రేయస్‌, ఇషాన్​లకు ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి. సాధారణంగా టీమ్​ ఇండియా తరఫున ఆడటానికి సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్స్​ మాత్రమే అర్హులు అని నిబంధన ఎక్కడా లేదు. కాకపోతే జట్టులో వీళ్లు తమ ప్రాధాన్యతను కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టీమ్​ ఇండియా ఎంపికలో సెలక్టర్లు సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకే తమ మొదటి ప్రాధాన్యతను ఇస్తారు. కాబట్టి ఇప్పుడీ యంగ్​ క్రికెటర్స్​ భారత జట్టులో తమ స్థానాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

కాబట్టి ఇషాన్, శ్రేయస్ తన స్థానాలను కాపాడుకోవాలంటే ఇకపై మరింత అత్యుత్తమ ప్రదర్శనలు చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ల ఐపీఎల్‌‌ ప్రదర్శన సంగతి పెక్కనపెడితే మిగిలిన సమయాల్లో జాతీయ జట్టుకు అవకాశం వచ్చినప్పుడు సంచలన ప్రదర్శన తప్పక చేయాల్సిందే.

ఏమి అందంరా బాబు - సారా గ్లామర్​కు మరోసారి కుర్రకారు ఫిదా!

రూ.70వేల కోట్ల నెట్​వర్త్​- ఈ క్రికెటర్​ కుబేరుడు గురూ- రోహిత్, విరాట్ కాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.