ETV Bharat / sports

IPL 2024 - ఈ 5 మ్యాచులు అస్సలు డోంట్ మిస్​

IPL Top 5 Matches : మరి కొన్ని రోజుల్లో ఐపీఎల్ సందడి మొదలుకానుంది. ఈ సందర్భంగా రీసెంట్​గా రిలీజ్​ చేసిన తొలి దఫా షెడ్యూల్​లో ఆసక్తి రేపుతున్న టాప్ 5 ​మ్యాచెస్ ఏంటో చూద్దాం.

IPL 2024 - ఈ 5 మ్యాచులు అస్సలు డోంట్ మిస్​
IPL 2024 - ఈ 5 మ్యాచులు అస్సలు డోంట్ మిస్​
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 7:22 AM IST

IPL 2024 Top 5 Matches : ఐపీఎల్ పండగ మరో నెల రోజుల్లో మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. రీసెంట్​గానే తొలి దఫా మ్యాచ్​ వివరాలను అఫీషియల్​గా అనౌన్స్ చేశారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు మొత్తం 21 మ్యాచులు జరగనున్నాయి. అయితే ఇందులో ఐదు మ్యాచులు మాత్రం క్రికెట్ అభిమానుల్లో బాగా ఇంట్రెస్ట్​ను క్రియేట్ చేస్తున్నాయి. మరి ఆ మ్యాచులు ఏంటి? ఎప్పుడు అవి జరగనున్నాయి? వంటి వివరాలను తెలుసుకుందాం.

సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ - మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య వార్​తో ఐపీఎల్ 2024 ప్రారంభంకానుంది. ధోనీ, కోహ్లీ లాంటి స్టార్​ ప్లేయర్స్ ఉండడంతో ఈ మ్యాచ్​ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది. దీని కోసం కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్​ ఎదురుచూస్తున్నారు.

కేకేఆర్​ వర్సెస్​ సన్​రైజర్స్​ - ఈ ఏడాది ఐపీఎల్​లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఇద్దరు ప్లేయర్స్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ సన్ రైజర్స్ హైదరాబాద్​లో ఉన్నారు. ఈ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్​తో తలపడనుంది. మరి ఐపీఎల్ వేలంలో భారీ ధరకు అమ్మడుపోయిన స్టార్క్, కమిన్స్ ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. మార్చి 23న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

ముంబయి ఇండియన్స్ వెర్సస్​ గుజరాత్ టైటాన్స్​ - గత రెండు సీజన్ల పాటు గుజరాత్ టైటన్స్ కెప్టెన్​గా ఉన్న హార్దిక్ పాండ్య ఈ సారి తన పాత టీమ్ ముంబయి ఇండియన్స్​కు కెప్టెన్​గా తిరిగొచ్చాడు. ముంబకి ఐదుసార్లు ట్రోఫీని అందించిన రోహిత్​ను పక్కన పెట్టి హార్దిక్​కు సారథి బాధ్యతలు అప్పగించారు. దీంతో హార్దిక్​ ఈ సారి ముంబయిని ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. మార్చి 24న అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటన్స్ - ఐపీఎల్ 2023 ఫైనల్​లో తలపడిన సీఎస్కే, గుజరాత్​ ఈ సారి మొదటగా మార్చి 26న తలపడనున్నాయి. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్​లో గుజరాత్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా సొంతగడ్డపై తిరుగులేని చెన్నై విజయ పరంపర కొనసాగిస్తుందా చూడాలి. మార్చి 26న రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ - ఐపీఎల్​లో కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య ఉన్న వైరం తెలిసిందే. దాదాపు రెండు సార్లు వీరిద్దరు గొడవపడ్డారు. గంభీర్ ఇప్పుడు కేకేఆర్​ జట్టుకు మెంటార్​గా వ్యవహరిస్తున్నాడు. అందుకే ఈ సారి కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్ ఆసక్తిగా మారింది. ఈ ఇద్దరూ మరోసారి ఎదురుపడనున్నారు. మార్చి 29న రాత్రి 7.30 గంటలకు బెంగళూరులో ఈ మ్యాచ్​ జరగనుంది.

మళ్లీ ముంబయిదే పైచేయి - 5 వికెట్ల తేడాతో గుజరాత్​పై గెలుపు

90 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ - ధ్రువ్ 'సెల్యూట్'​ వెనక కారణం ఏంటంటే ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.