IPL 2024 SRH VS Kolkata knight riders : ఐపీఎల్ దీనికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు సోదరులు లేదా ప్రాణ స్నేహితులు కావచ్చు ఐపీఎల్ విషయానికొస్తే అందరూ ప్రత్యర్థులుగా మారిపోతారు. ప్రతి ఒక్కరూ తమ సొంత విజయం వైపే మొగ్గుచూపుతారు. ఎందుకంటే చివరికి టైటిల్ సాధించేది దీని ద్వారానే కదా. తాజాగా ఐపీఎల్ 2024లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా అలాంటిదే. ఈ రెండు జట్లలోని ఆటగాళ్లైన మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ఈ ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాళ్లు. ఐపీఎల్ 2024 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్లకు కమిన్స్‌ను కొనుగోలు చేస్తే అదే వేలంలో కొన్ని క్షణాల తర్వాత రూ.24.75 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ మిచెల్ స్టార్క్‌ను కొనుగోలు చేసింది.
అయితే ప్రీమియర్ బౌలర్ మిచెల్ స్టార్క్‌కు కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఈనెడ్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచులో స్టార్క్‌ను ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు మామూలుగా ఆడుకోలేదు. ముఖ్యంగా సన్‌రైజర్స్ స్టార్ హెన్రిస్ క్లాసెస్ అయితే స్టార్క్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. హైదరాబాద్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన స్టార్క్ ఏకంగా 26 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్లో మొత్తం 4 సిక్సులు ఉంటే అందులో క్లాసెస్ 3 సిక్సులు బాదగా షబాజ్ అహ్మద్ ఒక సిక్స్ కొట్టాడు. ఈ మ్యాచులో స్టార్క్ తన 4 ఓవర్లలో వికెట్ కూడా తీయకుండానే 53 పరుగులిచ్చాడు.
దీంతో వేలంలో రూ. 24.75కోట్లు పెట్టీ మరీ కొనుగోలు చేసిన స్టార్క్ దారుణంగా విఫలమవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. తన కన్నా రూ. 20లక్షల తీసుకున్న హర్షిత్ రానా బాగా రాణిస్తున్నాడంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ మ్యాచులో హర్షిత్ రానా 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. చివరి ఓవర్లో అద్భుతమై బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో 4 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓటమిని చవిచూసింది. హెన్రిస్ క్లాసెస్ 63 పరుగులుతో చివరి వరకు పోరాడినా తన జట్టును గెలిపించలేకపోయాడు.
ఉత్కంఠ పోరుతో సన్‌రైజర్స్‌పై కోల్‌కతా విజయం - KKR VS SRH IPL 2024