ETV Bharat / sports

ఆర్సీబీతో మ్యాచ్​ - నా సూపర్​ ఇన్నింగ్స్​కు కారణం ఆమెనే : వెంకటేశ్ అయ్యర్​ - IPL 2024 RCB VS KKR - IPL 2024 RCB VS KKR

IPL 2024 RCB VS KKR Venkatesh Iyer : ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​లో తాను చేసిన సూపర్​ ఇన్నింగ్స్​ను ఆమెకు అంకితం చేస్తున్నట్లు తెలిపాడు వెంకటేశ్ అయ్యర్. ఆ వివరాలు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 30, 2024, 1:23 PM IST

Updated : Mar 30, 2024, 1:29 PM IST

IPL 2024 RCB VS KKR Venkatesh Iyer : ఐపీఎల్ 2024ను వెంకటేశ్ అయ్యర్​ పేలవంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో అదరగొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి ఆడాడు. తాను ఎదుర్కొన్న 30 బంతుల్లోనే 50 పరుగులు హాఫ్ సెంచరీతో అభిమానుల్ని అలరించాడు. ఇక మ్యాచ్‌ అయిపోయాక అతడు వెన్నునొప్పితోనూ బాధపడ్డాడు. దీని గురించి వెంకటేశ్​ మ్యాచ్ తర్వాత స్పందించాడు. కీలకమైన మ్యాచ్‌లో ఫామ్‌ అందుకోవడం మంచి విషయం. అయితే వెన్ను నొప్పి కాస్త ఇబ్బంది పెట్టింది. కానీ స్కాన్‌ చేసిన తర్వాతే పరిస్థితిపై ఓ అంచనాకు వస్తుంది. అని వెంకటేశ్ అన్నాడు.

Venkatesh Iyer Fiancee : అర్ధ శతకం బాదిన నేపథ్యంలో తన కిస్‌ సెలబ్రేషన్‌ గురించి కూడా మాట్లాడాడు వెంకటేశ్​ అయ్యర్​. నాకు కాబోయే భార్య కూడా ఈ రోజు ఇక్కడికి మ్యాచ్‌ చూసేందుకు వచ్చింది. నా ఇన్నింగ్స్‌లో ఆమెకు క్రెడిట్‌ ఇవ్వాలని అనుకున్నాను. ఆమెకు దీన్ని డిడేకేట్ చేస్తున్నాను’అని వెంకటేశ్‌ అయ్యర్‌ పేర్కొన్నాడు.

కాగా, గత ఏడాది నవంబరులో వెంకటేశ్‌ అయ్యర్‌కు నిశ్చితార్థం జరిగింది. ఫ్యాషన్‌ డిజైనర్​గా రాణిస్తున్న శృతి రఘునాథన్‌తో అతడి ఎంగేజ్​మెంట్ అయింది. త్వరలోనే వీరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. కానీ సరిగ్గా పెళ్లి తేదీ గురించి సమాచారం ఇంకా బయటకు రాలేదు.

KKR Won the Match : ఇకపోతే బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్​తో జరిగిన మ్యాచ్‌లో కోల్​కతా నైట్ రైడర్స్​ కేకేఆర్‌ ఏడు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు సునిల్‌ నరైన్‌ (22 బంతుల్లో 47 పరుగులు)కు వరించింది. ఇక పరాజయం పొందిన బెంగళూరు జట్టులో కోహ్లీ తప్ప మిగతా వారు అంతగా రాణించలేదు. దీంతో జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎడిషన్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు జరగగా ఆర్సీబీ మాత్రమే సొంతమైదానంలో ఓడిపోయింది.

'కోహ్లీ కూడా కష్టపడాల్సి వచ్చింది - అందుకే ఓడిపోయాం' - IPL 2024 KKR VS RCB

500 క్లబ్‌లోకి సునీల్ నరైన్ - ఈ సీజన్‌లో తొలి జట్టుగా కోల్‌కతా ఘనత - IPL 2024 RCB VS KKR

Last Updated : Mar 30, 2024, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.