IPL 2024 Prize Money: 2024 ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. చెన్నై వేదికగా సన్‌రైజర్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్‌లో నెగ్గిన కేకేఆర్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా 10.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో కేకేఆర్ దాదాపు పదేళ్ల తర్వాత ట్రోఫీని ముద్దాడింది. ఇక పేలవ ప్రదర్శనతో చెత్త ఓటమి మూటగట్టుకున్న సన్‌రైజర్స్ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
కాగా, టైటిల్ విన్నర్, రన్నరప్‌తోపాటు టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన ప్లేయర్లు భారీ మొత్తంలో ప్రైజ్ మనీ దక్కింది. ఛాంపియన్‌గా నిలిచిన కేకేఆర్‌కు అత్యధికంగా రూ.20 కోట్లు ప్రైజ్‌మనీ దక్కగా, రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.12.5 కోట్లు అందుకుంది. ఇక బెస్ట్ గ్రౌండ్ అండ్ పిచ్‌గా ఎంపికైన ఉప్పల్ స్టేడియానికి రూ.50 లక్షలు దక్కాయి. మరి ఈ సీజన్లో ఇంకా ఎవరెవరికి ఎంత దక్కిందో తెలుసా?
2024 ఐపీఎల్ ప్రైజ్‌మనీ
- ఛాంపియన్- కోల్‌కతా- రూ.20 కోట్లు
- రన్నరప్- సన్‌రైజర్స్- రూ.12.5 కోట్లు
- ఆరెంజ్ క్యాప్- విరాట్ కోహ్లీ- రూ.10 లక్షలు
- పర్పుల్ క్యాప్- హర్షల్ పటేల్- రూ.10 లక్షలు
- ఎమర్జింగ్ ప్లేయర్- నితీశ్ రెడ్డి- రూ.10 లక్షలు
- సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్- జేక్ ఫ్రేజర్ (234.4 స్ట్రైక్ రేట్)- రూ.10 లక్షలు
- ఫాంటసీ ప్లేయర్- సునీల్ నరైన్- రూ.10 లక్షలు
- అత్యంత విలువైన ఆటగాడు- సునీల్ నరైన్- రూ.10 లక్షలు
- అత్యధిక సిక్స్‌లు- అభిషేక్ శర్మ (42 సిక్స్‌లు)- రూ.10 లక్షలు
- అత్యధిక ఫోర్లు- ట్రావిస్ హెడ్ (64 ఫోర్లు)- రూ.10 లక్షలు
- క్యాచ్ ఆఫ్ ది సీజన్- రమణ్‌దీప్ సింగ్- రూ.10 లక్షలు
- ఫెయిర్ ప్లే అవార్డు- సన్‌రైజర్స్- రూ.10 లక్షలు
- బెస్ట్ గ్రౌండ్ అండ్ పిచ్- రాజీవ్‌గాంధీ ఉప్పల్ స్టేడియం- రూ.50 లక్షలు
ఫైనల్ మ్యాచ్‌లో అవార్డులు: ఇక ఫైనల్‌లో సత్తా చాటిన కేకేఆర్ బౌలర్ మిచెల్ స్టార్క్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. దీంతో స్టార్క్‌కు రూ.5 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. దీంతోపాటు ఫాంటసీ ప్లేయర్ ఆఫ్ మ్యాచ్‌గా నిలిచిన స్టార్క్‌కు రూ. లక్ష దక్కింది. దీంతోపాటు వెంకటేశ్ అయ్యర్ (సూపర్ సిక్సర్), హర్షిత్ రానా (డాట్ బాల్స్), రహ్మానుల్లా గుర్భాజ్ (అత్యధిక ఫోర్లు) తలో రూ. లక్ష అందుకున్నారు.
కప్పు 'కోల్‌కతా'దే- ఫైనల్‌లో సన్‌రైజర్స్ ఓటమి - SRH Lost In IPL 2024 Final
ఐపీఎల్ 'ఫైనల్'- రైజర్స్ Vs రైడర్స్- మ్యాచ్ జరగకపోతే పరిస్థితేంటి? - IPL 2024