IPL 2024 MS Dhoni Sachin Tendulkar Rohit Sharma : సచిన్ తెందుల్కర్, ధోనీ, రోహిత్, కోహ్లీ ఈ నలుగురు భారత క్రికెట్లో ఓ బ్రాండ్. ఈ నలుగురు కలిసి కనిపిస్తే ఫ్యాన్స్ ఉప్పొంగిపోతారు. అయితే ఆ ఉత్సాహాన్ని మరింత పెంచేలా కోహ్లీ తప్పా మిగతా ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి సందడి చేశారు.
వివరాల్లోకి వెళితే - క్రికెట్ ఫీల్డ్‌కు కమర్షియల్ యాడ్స్‌కు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇక ఐపీఎల్ వస్తుందంటే చాలు, టీవీలో కనిపించే ప్రతి యాడ్‌లోనూ స్పోర్ట్స్ స్టార్సే కనిపిస్తారు. అయితే ఏదో ఒక జట్టులోని ఓ స్టార్ ప్లేయర్, ఒక కమర్షియల్ యాడ్‌లో కనిపించడం మామూలే. అదే ముగ్గురు లెజెండ్స్ కలిసి ఒకే దాంట్లో కనిపిస్తే ఆ కిక్కే వేరుంటది.
అలా తాజాగా ఓ యాడ్ షూట్‌లో భాగంగా ముంబయిలో సచిన్ తెందుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మలు ఓ హోటల్‌లో కలిశారు. వాళ్ల ఫొటోను ఓ అభిమాని క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది.
ఇకపోతే ఈ ముగ్గురు కెప్టెన్సీకి దూరమైన వాళ్లే. సచిన్ అయితే ముంబయి ఫ్రాంచైజీకి ప్రస్తుతం మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ ముంబయి ఇండియన్స్ జట్టులో ఒక ప్లేయర్‌గా మాత్రమే ఆడుతున్నాడు. మహేంద్రుడు కెప్టెన్‌గా ఉన్నా లేకపోయినా చెన్నై జట్టు వెనకే ఉంటే ప్లేయర్‌గా నడిపిస్తున్నాడు.
అక్కడ మనదే పైచేయి - రీసెంట్గా రోహిత్ శర్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ముంబయి కెప్టెన్సీ వదులుకోవడంపై మాట్లాడాడు. 2025, 2027లలో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, వరల్డ్ కప్ ఎడిషన్లలో ఆడాలనుకుంటున్నట్లు తెలిపాడు. 2025లో లార్డ్స్ వేదికగా వరల్ట్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మొదలుకానుంది. అక్కడ మనదే పైచేయి అవుతుందని భావిస్తాను. ఇప్పట్లో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పినంత మాత్రాన రిటైర్మెంట్ ప్రకటిస్తానని అనుకోవద్దు. నాకు ఇంకొన్నేళ్లు ఆడాలని ఉంది అని క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు మహేంద్ర సింగ్ ధోనీ రాబోయే సీజన్ నుంచి ప్లేయర్ అవతారానికి కూడా గుడ్ బై చెప్పేస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.
కొత్త కుర్రాడి మెరుపులు - లఖ్‌నవూపై దిల్లీ విజయం - LSG vs DC IPL 2024