IPL 2024 Lucknow super giants VS Delhi Capitals Rishabh Pant : దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, విధ్వంసకర ఆటగాడు రిషభ్ పంత్ ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో దిల్లీ తరపున మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మార్క్‌ను 104 మ్యాచుల్లో 3032 పరుగులు చేశాడు. 2041 బంతులు ఎదుర్కొని 3,032 పరుగులు సాధించాడు. పంత్ తర్వాత డేవిడ్ వార్నర్ 2, 549, శ్రేయస్స్ అయ్యర్ 2,375, వీరేంద్ర సెహ్వాగ్ 2, 174, శిఖర్ ధావన్ 2,066 పరుగులతో ఉన్నారు. కాగా, ఈ ఐపీఎల్ సీజన్లో పంత్ వరుసగా 18, 28, 51, 55, 41 పరుగులు చేశాడు.
మరో రికార్డును కూడా పంత్ తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో మూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్న మూడో క్రికెటర్‌గానూ చరిత్ర సృష్టించాడు. రిషభ్ పంత్ ఐపీఎల్‌లో 26 ఏళ్ల 191 రోజు వయసులో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. శుభ్‌మన్ గిల్ 24 ఏళ్ల 215 రోజుల వయసులో 3 వేల పరుగులు పూర్తి చేసుకోగా, విరాట్ కోహ్లీ 26 ఏళ్ల 186 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు.
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 25 మంది బ్యాటర్లు 3 వేల పరుగులు స్కోరు చేశారు. స్ట్రైక్‌రేటు పరంగా ఏబీ డివిలియర్స్ 151.68, క్రిస్ గేల్ 148.96 తర్వాత పంత్ మాత్రమే 148.4 స్ట్రైక్ రేట్‌తో ఉన్నాడు.
పంత్ ఏమన్నాడంటే - "మనం ఛాంపియన్లుగా ఆలోచించాలని, కష్టపడి పోరాడాలని జట్టు సభ్యులకు చెప్పాను. మేం బంతితో కొన్ని సవాళ్లను అధిగమించలేకపోయాం. కొంతమంది ఆటగాళ్లు బాధ్యతలు తీసుకోవాలి. మేం జట్టుగా ముందుకు సాగాల్సి ఉంది. జట్టులో చాలామంది ఆటగాళ్లు గాయపడడం మాకు సమస్యగా మారింది. ఈ సమస్య అన్ని జట్లలోనూ ఉంది. మనం దీనిని ఒక సాకుగా చూపవచ్చు. దీని నుంచి నేర్చుకోవచ్చు" అని పంత్ అన్నాడు.
దిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన మెక్ గుర్క్ కూడా తన ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశాడు. "ఈ ఐపీఎల్‌లో నా ముద్ర వేయాలని చూస్తున్నా. గత ఐదు, ఆరు మ్యాచుల్లో నేను ఆడలేదు. తొలి మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూశాను. మొదటి మ్యాచ్‌లో ఉత్సాహంగా బరిలోకి దిగాను. బంతి స్వింగ్‌ను బట్టి ధాటిగా బ్యాటింగ్ చేశా. కవర్‌లో కొట్టిన షాట్లు నాకు చాలా ఇష్టం. కవర్ షాట్లు ఆడడాన్ని నేను చాలా ఇష్టపడతాను. పవర్‌ప్లేలో బ్యాటింగ్ చేయడం నేర్చుకుంటూనే ఉంటా. నా స్ట్రైక్ రేట్‌పై దృష్టి సారించాను. స్ట్రైక్ రొటేట్‌పై కూడా దృష్టి సారించా. వచ్చే మ్యాచుల్లోనూ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తానని నమ్ముతున్నా. భారత్‌లో ఐపీఎల్ ఆడుతుండడాన్ని థ్రిల్‌గా ఫీలవుతున్నా. ఇది వేరే ప్రపంచంలోకి అడుగు పెట్టడంలాగా ఉంది. నేను ఇంతకు ముందెన్నడూ ఇలాంటి అనుభూతి చెందలేదు. భారత్‌లో ఉండడం ఒక అద్భుతమైన సమయంలా ఉంది" అని మెక్‌గుర్క్ అన్నాడు.
-
First win against LSG in IPL 🤝🏻 2nd win of the season 👏
— Delhi Capitals (@DelhiCapitals) April 12, 2024
Mehfil-e-Ekana thi romanch se bhari 💙❤#YehHaiNayiDilli #LSGvDC pic.twitter.com/EiyaSeABWH
కొత్త కుర్రాడి మెరుపులు - లఖ్‌నవూపై దిల్లీ విజయం - LSG vs DC IPL 2024