ETV Bharat / sports

సంజు శాంసన్​, జురెల్​ మెరుపులు - ఉత్కంఠ పోరులో లఖ్​నవూపై రాజస్థాన్​ విజయం - IPL 2024 LSG VS RR

IPL 2024 Lucknow Super Giants vs Rajasthan Royals : ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా జరిగిన మరో ఉత్కంఠ పోరులో లఖ్​నవూపై రాజస్థాన్ రాయల్స్​ విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ే్ో
xం
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 11:16 PM IST

IPL 2024 Lucknow Super Giants vs Rajasthan Royals : ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా జరిగిన మరో ఉత్కంఠ పోరులో లఖ్​నవూపై రాజస్థాన్ రాయల్స్​ విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్​ 19 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సంజు శాంసన్​(71 నాటౌట్​) టాప్ స్కోరర్​గా నిలిచాడు. యశస్వి జైశ్వాల్​(18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 24), జాస్ బట్లర్​(18 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్​ సాయంతో 34) మంచిగా రాణించారు. రియాన్ పరాగ్​(11 బంతుల్లో 14) పరుగులు చేశాడు. చివర్లో వచ్చిన ధృవ్ జురెల్​(52 నాటౌట్​) స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. యశ్ ఠాకూర్​, మార్కస్ స్టొయినిస్​, అమిత్ మిశ్రా తలో వికెట్​ దక్కించుకున్నారు.

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన లఖ్​నవూ సూపర్ జెయింట్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. వాస్తవానికి ఈ జట్టుకు మొదట అద్భుత ఆరంభం లభించింది. కానీ ఫినిషింగ్ మాత్రం సరిగ్గా చేయలేదు. దీంతో ఈజీగా 200 దాటుతుందని అనుకున్న స్కోరు 196కే ఆగిపోయింది.

ఓపెనర్ క్వింటన్ డికాక్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత గత మ్యాచ్ సెంచరీ వీరుడు స్టోయినీస్ డకౌట్​గా వెనుదిరిగాడు. దీంతో కేవలం 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కష్టాల్లోకి వెళ్లింది లఖ్​నవూ. అనంతరం కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్ ఆడి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్స్​ల సాయంతో 76 పరుగులు చేశాడు. అతడికి రాహుల్ హుడా (31 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 50 పరుగులు) మంచి సహకారం అందించాడు. దీంతో 12 ఓవర్లలోనే లఖ్​నవూ 126 స్కోరు దాటింది.

అయితే క్రీజులో కుదురుకున్న హుడా, రాహుల్ తర్వాత ఔట్ అయిపోయారు. దీంతో స్కోరు నెమ్మదించింది. చివర్లో రాజస్థాన్ బౌలర్లు చురుగ్గా బంతులు సంధించారు. పూరన్​(11), ఆయుష్ బదోని(18 నాటౌట్​), కృనాల్ పాండ్య(15 నాటౌట్​) పరుగులు చేశారు. దీంతో 196 పరుగుల దగ్గర లఖ్​నవూ ఇన్నింగ్స్ ముగించింది. రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ 2, బౌల్ట్ , అవేశ్ ఖాన్, అశ్విన్ తలో వికెట్ తీశారు.

కెఎల్ రాహుల్ అరుదైన రికార్డ్ - ఐపీఎల్​లో ఓపెనర్​గా కేఎల్ రాహుల్ 4000 వేల పరుగులు పూర్తిచేశాడు. అత్యధిక పరుగులు సాధించిన ఓపెనర్ల జాబితాలో రాహుల్ నాలుగో స్థానంలోకి ఎక్కాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్(202 ఇన్నింగ్స్​లో 6362 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ 5909 పరుగులు, గేల్ 4480 పరుగులతో ఉన్నారు.

పోరాడి ఓడిన ముంబయి - దిల్లీ ఖాతాలో ఐదో విజయం - IPL 2024 DC VS MI

జేక్​ ఫ్రేజర్ ఊచకోత - 310కిపైగా స్ట్రైక్‌రేట్‌తో ముంబయిపై విరుచుకుపడుతూ! - IPL 2024 DV VS MI

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.