ETV Bharat / sports

'ధర తక్కువ- ఇంపాక్ట్ ఎక్కువ'- IPLలో వీళ్ల ఆటే హైలైట్ - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 3:33 PM IST

IPL 2024: 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పరుగుల వరద పారుతోంది. 200కుపైగా స్కోర్లు తేలిగ్గా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2024 వేలంలో తక్కువ ధరకు అమ్ముడైన ప్లేయర్లు ఈ సీజన్​లో అదరగొడుతున్నారు. వారెవరో చూసేయండి.

IPL 2024
IPL 2024

IPL 2024: 2024 ఐపీఎల్​ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లపాటు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు కూడా మెరుపు బ్యాటింగ్‌తో అలరిస్తున్నారు. తక్కువ ధరకు అమ్ముడైన ఆటగాళ్లు మైదానంలో అదరగొడుతున్నారు. ధర 'తక్కువ-ఆట ఎక్కువ' అని అందరూ ప్రశంసించేలా ఆడుతున్నారు. అలా గత వేలంలో తక్కువ ధర పలికి అద్భుత ఆటతో అలరిస్తున్న కొంతమంది ఆటగాళ్ల ప్రదర్శనను ఓ సారి చూద్దాం

  • అశుతోష్ శర్మ: దేశవాళీ క్రికెట్‌లో విధ్వంకర ఇన్నింగ్స్‌లు ఆడిన అశుతోశ్‌ శర్మను పంజాబ్ కింగ్స్ రూ. 20 లక్షలకే దక్కించుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల బ్యాటర్ తన అరంగేట్ర సీజన్‌లోనే అదరగొడుతున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 189.28 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 159 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. ముంబయిపై 193 పరుగుల లక్ష్య చేధనలో అశుతోష్‌ ఇన్నింగ్స్‌ అందరినీ ఆకట్టుకుంది.
  • శశాంక్ సింగ్: శశాంక్‌ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 20 లక్షల బేస్‌ ప్రైస్‌కు దక్కించుకుంది. బెంగాల్‌కు చెందిన శశాంక్‌ అనుకోకుండా పంజాబ్‌ జట్టులోకి వచ్చాడు. కానీ తన ఆటతో అందరి నోళ్లూ మూయించాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 61 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన శశాంక్‌ 65.75 సగటుతో 182.64 స్ట్రైక్ రేట్‌తో 263 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి. కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో శశాంక్‌ 28 బంతుల్లోనే 68 పరుగులు చేయడం వల్ల పంజాబ్‌ టీ 20 చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. శశాంక్‌ అత్యధిక స్కోరు 68 నాటౌట్‌.
  • జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్: మేక్‌గర్క్‌ను దిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకే సొంతం చేసుకుంది. 22 ఏళ్ల ఆస్ట్రేలియా ప్లేయర్​ మెరుపు బ్యాటింగ్​తో అలరిస్తున్నాడు. ఆస్ట్రేలియా స్టార్లు డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి ఆటగాళ్లను తలపిస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఫ్రేజర్ 211 స్ట్రైక్‌ రేట్‌ 163 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మెక్‌గర్క్‌ అత్యుత్తమ స్కోరు 65. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 15 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. దిల్లీ తరపున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ ఇదే.
  • ట్రిస్టన్ స్టబ్స్: ట్రిస్టన్ స్టబ్స్‌ను కూడా దిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకే సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా క్రికెట్‌లో స్టబ్స్‌కు విధ్వంసకర ఆటగాడిగా పేరుంది. స్టబ్స్‌ బ్యాటింగ్‌తోపాటు స్పిన్ బౌలింగ్ కూడా చేస్తాడు. చాలా తేలిగ్గా భారీ సిక్సర్లు కొడతాడు. ఈ ఐపీఎల్‌లో స్టబ్స్ 56.25 సగటుతో 225 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. స్టబ్స్‌ స్ట్రైక్‌ రేట్‌ 192.30. స్టబ్స్‌ అత్యుత్తమ స్కోరు 25 బంతుల్లో 71 పరుగులు.
  • ఫిల్ సాల్ట్: కోల్‌కతా నైట్ రైడర్స్ సాల్ట్‌ను రూ. 1.5 కోట్లకు దక్కించుకుంది. జాసన్ రాయ్ స్థానంలో సాల్ట్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్​లో సునీల్ నరైన్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న సాల్ట్‌ చెలరేగిపోతున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ హిట్టర్లు ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్‌ను సాల్ట్ మరిపిస్తున్నాడు. సాల్ట్‌ ఏడు మ్యాచ్‌ల్లో 41.50 సగటు, 169.38 స్ట్రైక్ రేట్‌తో 249 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. సాల్ట్‌ అత్యుత్తమ స్కోరు 89 నాటౌట్‌. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన నాలుగు మ్యాచుల్లో సాల్ట్‌ 67 సగటుతో 201 పరుగులు చేశాడు.
  • జెరాల్డ్ కోయెట్జీ: కోయెట్జీని ముంబయి ఇండియన్స్ రూ. 5 కోట్లకు దక్కించుకుంది. డేల్ స్టెయిన్ బౌలింగ్ యాక్షన్‌తో అతని వారసుడిగా పేరొందిన కోయెట్జీ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో మెరుగ్గా రాణిస్తున్నాడు. IPL 2024లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఎనిమిది మ్యాచుల్లో 10.10 ఎకానమీ రేటుతో 12 వికెట్లు తీశాడు. దిల్లీ క్యాపిటల్స్‌పై 34 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇదే కోయెట్జే అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన.
  • ట్రానిస్‌ హెడ్‌: ట్రానిస్‌ హెడ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 6.8 కోట్లకు దక్కించుకుంది. ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్‌ దక్కడంలో కీలక పాత్ర పోషించిన హెడ్‌ ఏ క్షణాన హైదరాబాద్ జట్టులో చేరాడో కానీ విధ్వంసం మొదలైంది. హెడ్‌ విధ్వంసంతో హైదరాబాద్‌ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. హెడ్‌ మెరుపు బ్యాటింగ్‌తో ఇప్పటికే పవర్‌ప్లే రికార్డులను బద్దలయ్యాయి.

'మేము కరెక్ట్ ప్లేయర్​నే కొన్నాం- ఇద్దరి పేర్లు ఓకేలా ఉన్నందునే కన్​ఫ్యూజ్​'

ఇంపాక్ట్​గా వచ్చాడు, క్రీజులో అదరగొట్టాడు - ఎవరీ అశుతోష్​ ? - Ashutosh Sharma PBKS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.