ETV Bharat / sports

కోల్​కతాతో మ్యాచ్​ - క్రిస్​ గేల్​ రికార్డ్​ను బ్రేక్​ చేసిన కోహ్లీ - IPL 2024 Kohli Most sixes

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 30, 2024, 7:55 AM IST

Updated : Mar 30, 2024, 8:47 AM IST

IPL 2024 KKR VS RCB : కోల్​కతా నైట్ రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కోహ్లీ ఓ సూపర్ రికార్డ్​ను సాధించాడు. ఆ వివరాలు.

కోల్​కతాతో మ్యాచ్​ - క్రిస్​ గేల్​ రికార్డ్​ను బ్రేక్​ చేసిన కోహ్లీ

IPL 2024 KKR VS RCB : టీమ్​ ఇండియా స్టార్‌, కింగ్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రికార్డుల రారాజుగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే కోహ్లీ కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో మరో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరపున అత్యధిక సిక్సులు బాదిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలోనే యూనివర్సల్‌ బాస్‌, విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ రికార్డును బద్దలు కొట్టాడు. క్రిస్‌ గేల్‌ ఐపీఎల్‌లో 239 సిక్సులు బాది ఆర్సీబీ తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఇప్పటివరకూ కొనసాగాడు. ఈ రికార్డును కింగ్ కోహ్లీ బ్రేక్‌ చేశాడు. కోహ్లీ 241 సిక్సర్లు బాది ఆ‌ర్సీబీ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా అగ్రస్థానం దక్కించుకున్నాడు. కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వ‌రుణ్ చ‌క్రవ‌ర్తి బౌలింగ్‌లో సిక్స్ బాది ఈ సూపర్ రికార్డును సాధించాడు. 58 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 83 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో RCB తరఫున అత్యధిక సిక్సర్లు
241 - విరాట్ కోహ్లీ
239 - క్రిస్ గేల్
238 – ఏబీ డివిలియర్స్
67 - గ్లెన్ మాక్స్‌వెల్‌
50 – ఫాఫ్ డు ప్లెసిస్

క్యాచుల్లోనూ కోహ్లీనే – విరాట్‌ కోహ్లీ అంటే కేవలం బ్యాటింగ్‌లో అత్యుత్తమ రికార్డులే కాదు. ఫీల్డింగ్‌లోనూ ఓ అరుదైన రికార్డు విరాట్‌ పేరిట ఉంది. ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా విరాట్‌ సురేశ్ రైనాతో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరూ ఐపీఎల్‌లో 109 క్యాచ్‌లను అందుకున్నారు. విరాట్‌ మరో క్యాచ్‌ పడితే సురేశ్ రైనాను అధిగమిస్తాడు. కోహ్లీ మరో క్యాచ్ అందుకుంటే ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంటాడు. విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా తర్వాత కీరన్ పొలార్డ్ మూడో స్థానంలో ఉన్నాడు. పొలార్డ్ 103 క్యాచ్‌లు పట్టాడు. ముంబయి ఇండియన్స్ ఆటగాడు రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 99 క్యాచ్‌లు అందుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన రవీంద్ర జడేజా 97 క్యాచ్‌లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్ల జాబితాలో విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, కీరన్ పొలార్డ్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా పేర్లు టాప్-5లో ఉన్నాయి. సురేశ్ రైనా, కీరన్ పొలార్డ్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఐపీఎల్‌లో ఆడుతున్నారు.

మూమెంట్​ ఆఫ్ ది మ్యాచ్​ - ఇది అస్సలు ఊహించలే! - kohli Gambhir

కోహ్లీ ఇన్నింగ్స్ వృథా- బెంగళూర్​పై కోల్​కతా విక్టరీ - RCB VS KKR IPL 2024

Last Updated : Mar 30, 2024, 8:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.