ETV Bharat / sports

అభిషేక్ సెంచరీ - 100 పరుగుల తేడాతో భారత్ విన్ - INDIA VS ZIMBABWE 2nd T20

INDIA VS ZIMBABWE 2nd T20 : జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా విజయం సాధించింది. 100 పరుగుల తేడాతో భారత జట్టు గెలుపొందింది.

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 7:50 PM IST

INDIA VS ZIMBABWE 2nd T20
INDIA VS ZIMBABWE 2nd T20 (Associated Press)

INDIA VS ZIMBABWE 2nd T20 : హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా విజయం సాధించింది. 100 పరుగుల తేడాతో భారత జట్టు గెలుపొందింది. 235 పరుగుల లక్ష్యఛేదనలో జింబాబ్వే 134 పరుగులకే ఆలౌటైంది. మద్వీర (43) టాప్‌ స్కోరర్​గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో అవేశ్ ఖాన్ (3/15), రవి బిష్ణోయ్ (2/11), ముకేశ్ కుమార్ (3/37) జింబాబ్వేను కట్టడి చేశారు. వాషింగ్టన్ సుందర్‌ ఒక వికెట్ పడగొట్టాడు.

మ్యాచ్​ సాగిందిలా :
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ (100) తన ఇన్నింగ్స్​లో శతకం బాది జట్టుకు భారీ స్కోర్ అందించాడు. దీంతో అంతర్జాతీయ టీ20లో తన సెంచరీ ఖాతా తెరిచాడు. ఇక రుతురాజ్‌ గైక్వాడ్ (77*) హాఫ్​ సెంచరీతో రాణించాడు. ఆఖరిలో బరిలోకి దిగిన రింకు సింగ్ (48*) కూడా ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థులను హడలెత్తించాడు. అయితే కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్ మాత్రం (2) తొలి మ్యాచ్​లాగే ఇప్పుడు కూడా నిరాశ పరిచాడు.

ఆ ఓవరే హైలైట్​
ఈ మ్యాచ్​లో తొలుత నెమ్మదిగా ఆడిన అభిషేక్ శర్మ ఆ తర్వాత వేగం పుంజుకున్నాడు. ఒక దశలో 30 బంతుల్లో 41 పరుగులతో మాత్రం ఉన్న అతడు ఆ తర్వాత బాల్​ను బౌండరీ దాటిస్తూ దూసుకెళ్లాడు. డియోన్ మేయర్స్‌ బౌలింగ్‌లో వరుసగా 4, 6, 4, 6, 4 బాదేశాడు. రజా వేసిన 13 ఓవర్‌లోనూ వరుసగా రెండు సిక్స్‌లు సాధించాడు. మసకద్జ వేసిన తర్వాతి ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్స్‌లు బాది సెంచరీతో చెలరేగిపోయాడు. అయితే ఆ తర్వాతి బంతికే మేయర్స్‌కు చేతికి చిక్కి పెవిలియన్‌ బాట పట్టాడు.

ఇదిలా ఉండగా, 38 బంతుల్లో అర్ధ శతకం అందుకున్నాడు స్టార్ ప్లేయర్ రుతురాజ్. తొలుత నెమ్మదిగానే ఆడిన రుతు కూడా ఆ తర్వాత దూకుడు పెంచాడు. చటార బౌలింగ్‌లో వరుసగా 4, 6, 4, 4 పరుగులు స్కోర్ చేశాడు. యంగ్ ప్లేయర్ రింకు సింగ్ కూడా తనదైన శైలిలో సిక్సర్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.