ETV Bharat / sports

0,1తో చెేతులెత్తేసిన రోహిత్, కోహ్లీ - కీలక మ్యాచుల్లో కుర్రాళ్లపై భారం!

టెస్ట్​ సిరీసుల్లో రోహిత్, విరాట్ ఘోర విఫలం - నెట్టింట అభిమానుల రిటైర్మెంట్ ట్రోల్స్!

India Vs New Zealand Test Series
India Vs New Zealand Test Series (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

India Vs New Zealand Test Series : సుమారు 36 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై టీమ్ఇండియా ఘోర పరాభవాన్ని చూసింది. న్యూజిలాండ్​తో ఇటీవలె జరిగిన తొలి టెస్ట్​లో ఓటమిపాలై క్రీడాభిమానులను నిరాశపరిచింది. అంతకుముందు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ క్లీన్ స్వీప్ అయ్యింది. అయితే రోహిత్, విరాట్, రాహుల్ ఇలా టాప్​ ప్లేయర్లు ఉన్నా కూడా శ్రీలంక మన ప్లేయర్లకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు న్యూజిలాండ్ కూడా టీమ్​ఇండియాకు గట్టిపోటీనిస్తోంది.

అయితే బెంగళూరు టెస్టు తర్వాత న్యూజిలాండ్‌ను ఇబ్బంది పెట్టేందుకు పూర్తిగా స్పిన్ పిచ్‌ని తయారుచేసింది టీమ్ఇండియా. కానీ టాస్ ఓడిపోవడం వల్ల ఇప్పుడు ఈ ప్లాన్ కూడా బెడిసికొట్టేలా కనిపిస్తోందని విశ్లేషకుల మాట.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్​కు దిగిన న్యూజిలాండ్ జట్టు 259 పరుగులు చేసింది. తొలి టెస్టు తర్వాత బాధ్యతగా ఆడాల్సిన సీనియర్లు, రెండో టెస్టులోనూ నిరాశపరిచారు. బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఇప్పుడీ పుణె టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ డకౌట్​గా వెనుతిరిగాడు.

అయితే బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరూ 50+ స్కోర్లతో రాణించినప్పటికీ, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం పేలవ ఫామ్​ కనబరిచారు. పుణె టెస్టులో రోహిత్ శర్మ డకౌట్ కాగా, నాలుగో స్థానంలో క్రీజులోకి దిగిన విరాట్ కేవలం 1 పరుగు చేసి పెవిలియన్ బాట పట్టాడు.

ఇదిలా ఉండగా, గత 10 టెస్టు ఇన్నింగ్స్‌లో కలిపి ఈ ఇద్దరూ 25కి కాస్త అటు ఇటు సగటుతోనే పరుగులు చేయడం గమనార్హం. ఇక గత 10 టెస్టుల్లో విరాట్ 26.6 సగటుతో 266 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధ సెంచరీ ఉంది. అయితే రోహిత్ శర్మ 2 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో 25.6 సగటుతో 256 పరుగులు స్కోర్ చేశాడు.

మరోవైపు రోహిత్ దూకుడుగా ఆడేందుకు ట్రై చేస్తున్నా కూడా అతడి ఫామ్‌ టీమ్ఇండియాను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇలా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు రోహిత్ వరుసగా ఫెయిల్ కావడం, టీమ్ఇండియాకు ఓ మైనస్ పాయింట్​ అని విశ్లేషకుల మాట .

ఇక విరాట్ టెస్టుల్లో 9 వేలకు పైగా పరుగులు చేశాడు. సీనియర్ బ్యాటర్‌గా టీమ్‌లో ఉన్న యంగ్ ప్లేయర్స్​ను ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతడిపైన ఉంది. అయితే గత ఏడాదిగా విరాట్ బ్యాట్ నుంచి సరైన ఇన్నింగ్స్ ఒక్కటి కూడా రాకపోవడం గమనార్హం. బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో చేసిన 70 పరుగులు మినహా, విరాట్ ఈ ఏడాది చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్​ ఆడలేకపోయాడు.

మరోవైపు యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి యంగ్ బ్యాటర్ల పెర్ఫామెన్స్​ల వల్లే టెస్టుల్లో కాస్త నిలదొక్కుకోగులుగుతోంది టీమ్ఇండియా. బెంగళూరు టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటైనప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో పరుగుల వరద పారించిందంటే దానికి ఈ యంగ్​ ప్లేయర్సే కారణం.

అయితే ఒక్కటి లేదా రెండు మ్యాచుల్లో ఫెయిల్ కాగానే కెఎల్ రాహుల్‌ని పక్కన పెట్టాల్సి వస్తోంది. కెప్టెన్ కావడం వల్ల రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ కావడం వల్ల విరాట్ కోహ్లీ ఇలా ఈ ఇద్దరూ వరుస అవకాశాలు దక్కించుకుంటున్నప్పటికీ, టీమ్‌కి ఆశించిన స్థాయిలో సహాయపడలేకపోతున్నారని విశ్లేషకుల మాట. దీంతో అభిమానులు కూడా ఇక వీరి రిటైర్మెంట్​కు టైమ్ దగ్గరపడిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

పుణె స్టేడియంలో నీటి కష్టాలు- 100ML ఖరీదు రూ.80- డీ హైడ్రేషన్​తో కుప్పకూలిన సీనియర్ సిటిజన్లు!

'మేం కష్టాల్లో ఉన్నప్పుడు, బాగా ఒత్తిడికి గురయ్యా - కోహ్లీ, హార్దిక్ కాపాడారు' - రోహిత్

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.