ETV Bharat / sports

నీరజ్ గోల్డ్ మెడల్ కొడితే 'ఫ్రీ వీసా'- ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు! - Paris Olympics 2024

author img

By ETV Bharat Sports Team

Published : Aug 4, 2024, 11:17 AM IST

Updated : Aug 4, 2024, 11:23 AM IST

Neeraj Chopra Paris Olympics: పారిస్ ఒలింపిక్స్​లో భారత్ ఇప్పటివరకు పసిడి పతకం సాధించలేదు. అయితే జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా కచ్చితంగా స్వర్ణం సాధిస్తాడని అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో నీరజ్ బంగారు పతకం నెగ్గితే ఓ స్టార్టప్ కంపెనీ సీఈవో బంపర్ ఆఫర్ ప్రకటించారు.

Neeraj Chopra Paris Olympics
Neeraj Chopra Paris Olympics (Source: Getty Images)

Neeraj Chopra Paris Olympics: పారిస్ ఒలింపిక్స్​లో జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రాపై భారత అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. విశ్వ క్రీడల్లో నీరజ్​ మరో స్వర్ణాన్ని ముద్దాడడం పక్కా అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా- అమెరికాకు చెందిన ఓ వీసా స్టార్టప్​ కంపెనీ సీఈవో బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ ఒలింపిక్స్​లో నీరజ్ పసిడి పతకం నెగ్గితే ప్రపంచంలో ఏ దైశానికైనా వెళ్లేందుకు ఫ్రీ వీసా ఇప్పిస్తానన్నారు.

'పారిస్ ఒలింపిక్స్​లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధిస్తే ఫ్రీ వీసా ఇప్పిస్తా లెట్స్ గో' అని అట్లీస్ అనే కంపెనీ సీఈవో మోహక్ నేత్ర ఆన్​లైన్ జాబ్ సెర్చింగ్ ప్లాట్​ఫామ్ లింక్డిన్ (Linkedin)లో రీసెంట్​గా పోస్ట్ చేశారు. అయితే ఈ ఆఫర్​ ప్రాసెస్ ఏంటో చెప్పాలంటూ లింక్డిన్ యూజర్లు ఈ పోస్ట్​ను తెగ వైరల్ చేశారు. దీనికి స్పందించిన మోహక్ నేత్ర ఆఫర్ ప్రొసిజర్​ను వివరంగా చెప్తూ మరో పోస్ట్​ చేశారు.

'నీరజ్ గోల్డ్ మెడల్ సాధిస్తే అందరికీ ఫ్రీ వీసా ఇస్తానని నేను జులై 30న నేను ప్రామిస్ చేశాను. అయితే ఆగస్టు 8న జావెలిన్ త్రో ఫైనల్ జరగనుంది. ఇందులో నీరజ్ పసిడి పతకం నెగ్గితే, కచ్చితంగా యూజర్లందరికీ మా కంపెనీ తరఫున ఒక్క రోజు ఫ్రీ వీసా ఇప్పిస్తాం. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లాలనుకున్నా సరే వీసా ఖర్చు మాదే. మీ ఈమెయిల్ కామెంట్ బాక్స్​లో పెట్టండి. వీసా పొందేందుకు వీలుగా మీకు ఓ అకౌంట్ క్రియేట్ చేస్తాం' అని మోహక్ మరో పోస్ట్​లో క్లారిటీ ఇచ్చారు.

కాగా, 2020 టోక్యో ఒలింపిక్స్​లో నీరజ్ బంగారు పతకం సాధించి సంచలనం సృష్టించాడు. ఇక పారిస్ ఒలింపిక్స్​లోనూ నీరజ్ భారీ అంచనాలతో బరిలో దిగనున్నాడు. నీరజ్​తోపాటు భారత్ నుంచి కిషోన్ జేనా జావెలిన్ త్రో ఈవెంట్​లో పాల్గొననున్నాడు. ఈ ఈవెంట్​లో ఆగస్టు 6న క్వాలిఫికేషన్ రౌండ్ ఉండగా, ఆగస్టు 8న ఫైనల్ జరగనుంది.

82.27 మీటర్ల దూరానికి బల్లెం విసిరిన స్టార్ ప్లేయర్ - నీరజ్ ఖాతాలో గోల్డ్ మెడల్ - Federation Cup 2024

నీరజ్​కు రూ.5కోట్లు, సింధుకు రూ.3కోట్లు- ఏ అథ్లెట్​కు ఎంత ఖర్చైందో తెలుసా? - Paris Olympics 2024

Last Updated : Aug 4, 2024, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.