Ind W Vs Pak W Asia Cup 2024: 2024 మహిళల ఆసియా కప్‌లో భారత్ శుభారంభం చేసింది. శుక్రవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టింది. పాక్ నిర్దేశించిన 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమ్ఇండియా 14.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (45) షఫాలీ వర్మ (40) అదరగొట్టారు. పాక్ బౌలర్లలో సయిదా అరూబ్ షా 2 వికెట్లు దక్కించుకుంది. నష్రా సందు ఒక్క వికెట్ పడగొట్టింది.
స్వల్ప లక్ష్య ఛేదనను టీమ్ఇండియా ఘనంగానే ఆరంభించింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ తమ ఇన్నింగ్స్‌లో ప్రారంభం నుంచే ధాటిగా ఆడారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లను ఆత్మ రక్షణలో పడేశారు. ఈ క్రమంలోనే మంధాన హాఫ్ సెంచరీ వైపు దూసుకెళ్తుండగా 45 పరుగుల వ్యక్తగత స్కోర్ వద్ద క్యాచౌట్‌గా వెనుదిరిగింది. అయితే వీరిద్దరూ 9.3 ఓవర్లోనే తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించారు.
ఇక వన్‌డౌన్‌లో దిగిన దయాలన్, హేమలతతో కలిసి షఫాలీ జట్టును విజయం వైపు నడిపించింది. విజయానికి చేరువలోకి వచ్చాక 100 పరుగుల వద్ద షఫాలీ పెలివియన్‌కు చేరింది. ఆ కొద్ది సేపటికే హేమలత (14 పరుగులు) ఔటైనా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (5*), జెమిమా రోడ్రిగ్స్ (6*) ఆఖర్లో పని పూర్తి చేశారు.
అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. పాక్‌కు రెండో ఓవర్లోనే పూజా వస్త్రకర్ షాకిచ్చింది. ఓపెనర్ గుల్ ఫిరోజ (5)ను పెవిలియన్‌కు పంపింది. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ ముబీనా అనీ (11)ని కూడా పూజ ఔట్ చేసింది. అమీన్ (25), టుబా హసన్ (22), ఫాతిమా సన (22) మాత్రమే ఫర్వాలేదనిపించారు. మిగితా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. టీమ్ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ 2, రేణుకా సింగ్, పూజా వస్త్రకర్, శ్రేయాంకా పాటిల్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు.
'అది నా పని కాదు' - రిపోర్టర్‌కు కౌంటర్ వేసిన హర్మన్ ప్రీత్ కౌర్! - Harmanpreet IND VS PAK Match