IND W vs UAE W Asia Cup: మహిళల ఆసియా కప్‌లో టీమ్ఇండియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఆదివారం దంబుల్లా వేదికగా యూఏఈని భారత మహిళల జట్టు చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా 78 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. భారత్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో యూఏఈ ఓవర్లన్నీ 123-7 ఆడి పరుగులే చేయగలిగింది. కెప్టెన్ ఈషా రోహిత్ ఓజా (38 పరుగులు), కవీషా ఇగోడగె (40 పరుగులు*) మాత్రమే ఆకట్టుకున్నారు. టీమ్ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ 2, రేణుకా ఠాకూర్ సింగ్, తనుజా కన్వర్, పూజా వస్త్రకార్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ విజయంతో భారత్ దాదాపు సెమీఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. ఇక భారత్ తదుపరి మ్యాచ్‌లో జులై 23 మంగళవారం నేపాల్‌తో తలపడాల్సి ఉంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (13 పరుగులు) విఫలమైనా, షఫాలీ వర్మ (37 పరుగులు, 18 బంతుల్లో; 5x4, 1x6) జెట్ స్పీడ్‌లో ఆడింది. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన హేమలత (2 పరుగులు) నిరాశ పర్చింది. ఇక కెప్టెన్ హర్మన్ప్రీక్ కౌర్ (66 పరుగులు, 47 బంతుల్లో; 7x4, 1x6) హాఫ్ సెంచరీతో సత్తా చాటింది.
రఫ్పాడించిన రిచా
11.4 ఓవర్ వద్ద జెమిమా (14 పరుగులు) ఔటయ్యాక, రిచా ఘోష్ క్రీజులోకి వచ్చింది. ఇక హర్మన్, రిచాతో కలిసి స్కోర్ బోర్డును నడిపించింది. అయితే హర్మన్ కాస్త నెమ్మదిగా ఆడినా, రిచా మాత్రం యూఏఈ బౌలర్లకు చుక్కలు చూపించింది. బౌండరీలతో విరుచుకుపడుతూ 29 బంతుల్లోనే 64 పరుగులు చేసింది. అందులో 12 ఫోర్లు, 1 సిక్స్ ఉంది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 75 పరుగులు జోడించారు. ఆఖరి ఓవర్లో హర్మన్ రనౌట్‌గా వెనుదిరిగింది.
Innings Break!
— BCCI Women (@BCCIWomen) July 21, 2024
Fifties from Captain @ImHarmanpreet & @13richaghosh power #TeamIndia to 201/5 in 20 overs
Over to our bowlers 💪
Scorecard ▶️ https://t.co/fnyeHavziq#WomensAsiaCup2024 | #ACC | #INDvUAE pic.twitter.com/mRVUMxa91j
స్మృతి, షఫాలీ మెరుపులు- పాక్‌పై భారత్ గ్రాండ్ విక్టరీ - Womens Asia Cup 2024
'అది నా పని కాదు' - రిపోర్టర్‌కు కౌంటర్ వేసిన హర్మన్ ప్రీత్ కౌర్! - Harmanpreet IND VS PAK Match