ETV Bharat / sports

భారత్ X న్యూజిలాండ్ : ఈసారి సత్తా చాటాల్సిందే- కళ్లన్నీ రోహిత్, విరాట్​పైనే!

భారత్ X న్యూజిలాండ్- మూడో టెస్టుకు అంతా సిద్ధం- టీమ్ఇండియా సత్తా చాటానే?

Ind vs Nz 3rd Test 2024
Ind vs Nz 3rd Test 2024 (Source: Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

IND vs NZ 3rd Test 2024 : భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య మూడో టెస్టు శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్​కు ముంబయి వేదిక కానుంది. మూడు టెస్టుల సిరీస్‌లో 2- 0తో ఆధిక్యంలో ఉన్న న్యూజిలాండ్‌ చివరి టెస్టులోనూ నెగ్గి సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేయాలని కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు బ్యాటింగ్‌ వైఫల్యాలతో 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై సిరీస్‌ కోల్పోయిన టీమ్​ఇండియా చివరి టెస్టులోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. నెట్స్‌లో భారత బ్యాటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మూడో టెస్టులోనైనా?
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఫేవరెట్‌గా అడుగు పెట్టి వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అనూహ్య పరాభవాలు ఎదుర్కొన్న టీమ్‌ఇండియాకు ఇప్పుడు చివరిదైన మూడో టెస్టులో పరువు కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. మూడో టెస్టులో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో రోహిత్‌సేన ముమ్మరంగా సాధన చేసింది. పన్నెండేళ్లుగా సొంతగడ్డపై సిరీసే కోల్పోని టీమ్‌ఇండియా రికార్డుకు కివీస్‌ గండికొట్టింది. సిరీస్‌లో వైఫల్యంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. కొత్త కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌పై కూడా తీవ్ర ఒత్తిడి ఉంది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పట్టికలో టీమ్ఇండియా ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉన్నప్పటికీ మూడో టెస్టులోనూ ఓడితే ఫైనల్‌ బెర్తు సాధించే అవకాశాలు ప్రమాదంలో పడతాయి. రాబోయే ఆస్ట్రేలియా పర్యటనకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవ్వాలన్నా, డబ్ల్యూటీసీ ఫైనల్‌ అవకాశాలు సంక్లిష్టం కాకూడదన్నా భారత జట్టు ముంబయిలో గెలిచి తీరాల్సిందే. WTC ఫైనల్‌కు ముందు ఆరుటెస్టులు ఆడనున్న భారత్‌ అందులో నాలుగు టెస్టుల్లో నెగ్గాల్సి ఉంది.

రోహిత్, విరాట్​పైనే కన్ను
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో బ్యాటింగ్‌లో టీమ్ఇండియా ప్రదర్శన పేలవంగా ఉంది. సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, కోహ్లి సిరీస్‌లో తీవ్రంగా నిరాశపరిచారు. రోహిత్‌ వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 2, 52, 0, 8 పరుగులు చేస్తే, విరాట్ 0, 70, 1, 17 స్కోర్లకు పరిమితమయ్యాడు. వీళ్లిద్దరినీ జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు కూడా ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లీ తమ స్థాయికి తగ్గ భారీ ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది. ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ ఫామ్‌లో ఉండడం టీమ్​ఇండియాకు శుభ పరిణామం. శుభ్‌మన్‌ గిల్‌ కూడా పెద్ద ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరముంది. పంత్, సర్ఫరాజ్‌ బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో చూపించిన పోరాటపటిమను మూడో టెస్టులో కొనసాగించాలి.

35 మంది బౌలర్లతో
మూడోటెస్టు కోసం టీమ్ఇండియా ముమ్మరంగా సాధన చేసింది. ముంబయి క్రికెట్‌ సంఘం మైదానంలో టీమ్‌ఇండియా బ్యాటర్లు కఠినంగా శ్రమించారు. ప్రాక్టీస్‌ సెషన్‌లో 35 మంది నెట్‌ బౌలర్లను భారత్‌ ఉపయోగించింది. వీరిలో ఎక్కువమంది స్పిన్నర్లే. రెండో టెస్టులో స్పిన్‌ బలంతోనే కివీస్‌ జట్టు భారత్‌పై ఆధిపత్యం ప్రదర్శించిన నేపథ్యంలో భిన్నమైన బౌలింగ్‌ శైలి కలిగిన స్పిన్నర్లను టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ నెట్స్‌కు రప్పించింది. బ్యాటర్లు స్పిన్నర్లను ఎక్కువసేపు ఎదుర్కొని సాధన చేశారు.

అశ్విన్, జడ్డు తిప్పెయాల్సిందే!
బౌలింగ్‌లో అశ్విన్, జడేజా ద్వయంపై కూడా ఒత్తిడి నెలకొంది. రెండో టెస్టులో శాంట్నర్‌ లాంటి సాధారణ స్పిన్నర్‌ పిచ్‌ను ఎంతో గొప్పగా ఉపయోగించుకోగా, వీళ్లిద్దరూ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. పుణె టెస్టుకు అనుకోకుండా జట్టులోకి వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌ మాత్రం అదరగొట్టాడు. ఈ స్పిన్‌ త్రయం తమకు అనుకూలించే వాంఖడె పిచ్‌ను సద్వినియోగం చేసుకుని ప్రత్యర్థిని చుట్టేయాల్సిన అవసరముంది. బుమ్రా, ఆకాశ్‌దీప్‌ జోడీ ఆరంభంలో వికెట్లు తీయడం కీలకం.

దూకుడుగా కివీస్
మరోవైపు భారత్‌లో తొలిసారి టెస్టు సిరీస్‌ను చేజిక్కించుకున్న న్యూజిలాండ్‌ రెట్టించిన విశ్వాసంతో పోరుకు సిద్ధమైంది. మూడోటెస్టులోనూ భారత్‌పై పైచేయి సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలనుకుంటోంది. WTC ఫైనల్‌కు చేరాలంటే ఇంకా ఆడాల్సి ఉన్న నాలుగు టెస్టుల్లోనూ గెలుపు కివీస్‌కు ముఖ్యం. బ్యాటింగ్‌లో రచిన్‌ రవీంద్ర, కాన్వే, ఫిలిప్స్, లేథమ్‌ల ఫామ్‌ ఆ జట్టుకు సానుకూలాంశం. పేసర్లు హెన్రీ, ఒరోర్క్, సౌథీ స్పిన్నర్లు శాంట్నర్, అజాజ్‌ పటేల్‌తో కివీస్‌ బౌలింగ్‌ కూడా బలంగా కనిపిస్తోంది. మ్యాచ్‌ వేదిక వాంఖడె స్టేడియంలో పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించనుంది. తొలిరోజు నుంచే స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ను తయారు చేస్తున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది.

ఆఖరి సమరంలో పరువు కాపాడుకునేందుకు - 35 మంది నెట్‌ బౌలర్లతో భారత్ ప్రాక్టీస్​!

WTC ఫైనల్స్​కు టీమ్ఇండియా! - మూడో టెస్ట్ ఓడితే ఇక కష్టమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.