ETV Bharat / sports

ICC టీమ్ ఆఫ్ ది టోర్నీ- రోహిత్ సహా 6గురు టీమ్ఇండియా ప్లేయర్లే - T20 World cup 2024

T20 World Team of Tournament: 2024 టీ20 వరల్డ్​కప్​ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్​ను ఐసీసీ ప్రకటించింది. ఈ జట్టులో అత్యధికంగా టీమ్ఇండియా నుంచి ఆరుగురు ప్లేయర్లు ఎంపికయ్యారు.

T20 World Team of The Tourney
T20 World Team of The Tourney (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 7:00 AM IST

T20 World Team of Tournament: 2024 టీ20 వరల్డ్​కప్​ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్​ను ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఈ టీమ్​లో ఏకంగా ఆరుగురు టీమ్ఇండియా ప్లేయర్లకు చోటు లభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్​కు టోర్నీ ఆఫ్ ది టీమ్​లో స్థానం దక్కింది. టీమ్ఇండియా తర్వాత అఫ్గానిస్థాన్ నుంచి అత్యధికంగా ముగ్గురు ప్లేయర్లు ఎంపికయ్యారు.

  • రోహిత్ శర్మ (భారత్): టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టోర్నీలో అదరగొట్టాడు. అటు కెప్టెన్​, ఇటు బ్యాటర్​గా రెండు బాధ్యతలను సమర్థంగా నిర్వహించాడు. ఈ టోర్నీలో ఆడిన 8 మ్యాచ్​ల్లో 157.70 స్ట్రైక్ రేట్​తో 257 పరుగులు చేశాడు. అందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా సూపర్- 8లో ఆస్ట్రేలియాపై ఆడిన (92 పరుగులు 41 బంతుల్లో) ఇన్నింగ్స్​ టోర్నీలోనే హైలైట్​గా నిలిచింది.
  • రహ్మానుల్లా గుర్బాజ్ (అఫ్గానిస్థాన్): ఈ టోర్నీలో గుర్బాజ్ అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్​గా నిలిచాడు. అఫ్గాన్​కు శుభారంభాలు అందిస్తూ మంచి స్కోర్లు నమోదు చేశాడు. 8 మ్యాచ్​ల్లో 281 పరుగులు చేసి టాప్​లో నిలిచాడు.
  • నికొలస్ పూరన్ (వెస్టిండీస్) : నికొలస్ పూరన్ విండీస్​ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తమ జట్టు సెమీస్​కు చేరకపోయినా, గ్రూప్ దశలో పూరన్ ఆకట్టుకున్నాడు. టోర్నీలో 228 పరుగులతో రాణించాడు. అఫ్గానిస్థాన్​పై 98 పరుగులు ఇన్నింగ్సే ఈ టోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్​గా ఉంది.
  • సూర్యకుమార్ యాదవ్ (భారత్): మిస్టర్ 360 ప్లేయర్ సూర్య టీమ్ఇండియాకు మిడిలార్డర్​లో కీలకంగా మారాడు. ఈ టోర్నీలో 199 పరుగులతో రాణించాడు. ముఖ్యంగా సెమీస్​లో ఇంగ్లాండ్​పై 47 పరుగుల ఇన్నింగ్స్​ జట్టుకు ఎంతో ఉపయోగపడింది.
  • మార్కస్ స్టోయినిస్ (ఆస్ట్రేలియా): ఆల్​రౌండర్ స్టోయినిస్ బ్యాట్, బంతితో ఆకట్టుకున్నాడు. ఏకంగా 164 స్టైక్ రేట్​తో 169 పరుగులు చేశాడు. ఇటు బౌలింగ్​లోనూ స్టోయినిస్ తన మార్క్ చూపించాడు. బంతితో రాణిస్తూ 10 వికెట్లు పడగొట్టాడు.
  • హార్దిక్ పాండ్య (భారత్): టీమ్ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య ఫైనల్​ మ్యాచ్​లో ఏకంగా హీరో అయ్యాడు. ఈ టోర్నీలో అల్​రౌండర్​గా తన పాత్ర చక్కగా పోషించాడు. 144 పరుగులు బాదాడు. బౌలింగ్​లోనూ రాణిస్తూ 11 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో పొట్టికప్​ టోర్నీలో 100+ పరగులు, 10+ వికెట్లు తీసిన ఏకైక భారత్ ప్లేయర్​గా నిలిచాడు.
  • అక్షర్ పటేల్ (భారత్): టీమ్ఇండియా మరో ఆల్​రౌండర్ అక్షర్ పటేల్ కీలకమైన మ్యాచ్​ల్లో జట్టును ఆదుకున్నాడు. సెమీస్​లో ఇంగ్లాండ్​పై 3 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టిన అక్షర్, ఫైనల్​లో జట్టు ఆపదలో ఉన్నప్పుడు బ్యాటింగ్​కు దిగాడు. ఈ మ్యాచ్​లో 47 పరుగులు బాది జట్టు మంచి స్కోర్ సాధించడంలో కీలకమయ్యాడు. మొత్తంగా 92 పరుగులు, 9 వికెట్లు పడగొట్టాడు.
  • రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్): రషీద్ సారథ్యంలో బరిలోకి దిగిన అఫ్గాన్ ఈ టోర్నీలో సంచలనాలు సృష్టించింది. కెప్టెన్సీలో ఆకట్టుకున్న రషీద్​ బౌలర్​గానూ తన కర్తవ్యం నిర్వర్తించాడు. టోర్నీలో 14 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
  • జస్ప్రీత్ బుమ్రా (భారత్): టీమ్ఇండియా ఛాంపియన్​గా నిలవడంలో కీలక పాత్ర బుమ్రాదే. జట్టుకు అవసరమైనప్పుడల్లా నేనున్నానంటూ బ్రేక్ ఇచ్చాడు. ఈ టోర్నీలో 4.17 ఎకనమీతో బౌలింగ్ చేసి 15 వికెట్లు నేలకూల్చాడు. దీంతో బుమ్రాకు మ్యాన్​ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కింది.
  • అర్షదీప్ సింగ్ (భారత్): భారత్ మరో పేస్ గన్ ఆర్షదీప్ సింగ్. టీమ్ఇండియా తరఫున ఈ టోర్నీలో అర్షదీప్ అత్యధిక వికెట్లు పడగొట్టాడు. 7.16 ఏకనమీతో 17 వికెట్లు పడొగొట్టి సత్తా చాటాడు.
  • ఫజల్లా ఫరూకీ (అఫ్గానిస్థాన్): అఫ్గానిస్థాన్ బౌలర్ ఫజల్లా ఫరూకీ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్​గా అర్షదీప్​కో సమానంగా నిలిచాడు. ఫరూకీ ఈ టోర్నీలో 17 వికెట్లు పడగొట్టి అఫ్గాన్ విజయాల్లో కీలకంగా మారాడు.

ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నీ: రోహిత్ శర్మ, రహ్మానుల్లా గుర్బాజ్, నికొలస్ పూరన్, సూర్యకుమార్ యాదవ్, మార్కస్ స్టొయినిస్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, ఫజల్లా ఫరూకీ, అన్రీచ్ నోకియా (12th ప్లేయర్).

టీ20 ఫైనల్​@5.3కోట్లు- భారత్​ సెలబ్రేషన్స్​ను కూడా ఎవరూ మిస్ కాలేదుగా!

బంపర్ ఆఫర్​ - టీమ్ఇండియాకు రూ.125 కోట్ల ప్రైజ్​మనీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.