ETV Bharat / sports

సపోర్టింగ్ స్టాఫ్​పై గంభీర్ ఫోకస్- కొత్త బ్యాటింగ్ కోచ్​గా సీనియర్! - Team India Batting Coach - TEAM INDIA BATTING COACH

Team India Batting Coach: టీమ్ఇండియ కొత్త హెడ్​కోచ్ గంభీర్​ సపోర్టింగ్ స్టాఫ్​పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త బ్యాటింగ్ కోచ్​గా సీనియర్ ప్లేయర్​​ పేరును బీసీసీఐ ముందు ప్రపోజల్​లో ఉంచినట్లు తెలిసింది.​

Team India Batting Coach
Team India Batting Coach (Source: Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 12:18 PM IST

Team India Batting Coach: టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన సపోర్టింగ్​ స్టాఫ్ట్​పై దృష్టి పెట్టాడు. స్టాఫ్ ఎంపికలో తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాల్సిందిగా బీసీసీఐను గంభీర్ కోరడట. దీనిపై పాజిటివ్​గా స్పందించిన బీసీసీఐ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ ప్లేయర్ అభిషేక్ నాయర్​ను జట్టు బ్యాటింగ్ కోచ్​గా నియమించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. బీసీసీఐ కూడా ఇందుకు ఓకే చెప్పిందట. ఇక త్వరలోనే టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్​గా అభిషేక్ నాయర్​ను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.

అయితే వీరిద్దరూ ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్ ఫ్రాంచైజీకి కలిసి పనిచేసిన అనుభవం ఉంది. వీరిద్దరి కాంబోలో కోల్​కతా 2024 ఐపీఎల్​ టైటిల్ కూడా నెగ్గింది. అటు అభిషేక్​ కూడా గంభీర్​తో కలిసి జాతీయ జట్టుకు పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నాడట. కాగా, కెప్టెన్ రోహిత్ శర్మతో కూడా అభిషేక్​కు మంచి ఫ్రెండ్​షిప్ ఉంది. అందుకే వీళ్ల మధ్య సత్సంబంధంతో డ్రెస్సింగ్ రూమ్​లో మంచి వాతావరణం నెలకొంటుందని బీసీసీఐ భావిస్తోంది.

కాగా, ప్రస్తుత ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్​ను అలాగే కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా ఫీల్డింగ్ విధానంలో దిలీప్ మార్క్ చూపించాడు. బెస్ట్​ ఫీల్డింగ్ మెడల్​ విధానంతో టీమ్ఇండియా ఫీల్డింగ్​ను అత్యన్నచ స్థాయిలో నిలిపాడు. దీంతో గంభీర్ కూడా దిలీప్​ను తన స్టాఫ్​లో కొనసాగించుకోవాలని భావిస్తున్నాట. ఇక బౌలింగ్ కోచ్​లోనూ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ పేసర్ వినయ్ కుమార్ పేరును గంభీర్ బౌలింగ్ కోచ్​గా బీసీసీఐ ముందు ప్రస్తావించాడట. దీనిపై కూడా అఫీషియల్ అనౌన్స్​మెంట్ రావాల్సి ఉంది.

ఇక గంభీర్ జులైలో శ్రీలంక పర్యటనతో టీమ్ఇండియా కోచ్​గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ పదవిలో గంభీర్ 2027 వన్డే వరల్డ్​కప్ దాకా ఉంటాడు. అతడి నేతృత్వంలోనే టీమ్ఇండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ, 2026 టీ20 వరల్డ్​కప్, 2027 వరల్డ్​కప్ ఆడనుంది. చూడాలి ఐపీఎల్​లో అత్యుత్తమంగా రాణించిన గంభీర్, టీమ్ఇండియాను ఎలా నడుపుతాడనేది.

గంభీర్​ 5 బిగ్ టార్గెట్స్​- 2027పైనే స్పెషల్ ఫోకస్- ఏం చేస్తాడో? - Gautam Gambhir Targets

టీమ్‌ఇండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ - అఫీషియల్ అనౌన్స్​మెంట్​ - Teamindia Head Coach Gambhir

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.