Djokovic vs Sinner Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో ప్రపంచ నెంబర్‌వన్ ఛాంపియన్, సెర్బియన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్‌కు షాక్ తగిలింది. శుక్రవారం మెల్బోర్న్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో జకోవిచ్, 22 ఏళ్ల ఇటలీ యంగ్ ప్లేయర్ జనిక్ సినర్ చేతిలో ఓడాడు. దీంతో మెల్బోర్న్ పార్క్‌లో ఇప్పటివరకు జరిగిన 33 స్ట్రైట్ మ్యాచుల్లో విజేతగా నిలిచిన జకోవిచ్ విజయ పరంపరకు బ్రేక్ పడింది. ఈ గెలుపుతో నాలుగో ర్యాంకర్‌గా కొనసాగుతున్న జనిక్ సినర్ తన కెరీర్లో మొదటిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌లో అడుగుపెట్టాడు.
సినర్ ఒక్కటి- జకోవిచ్ 8
జకోవిచ్ ఈ సెమీస్ మ్యాచ్‌లో జనిక్ సినర్‌కు అసలు పోటీనే ఇవ్వలేదు.సెమీస్‌లో జకోవిచ్ వరుసగా తొలి రెండు సెట్లలో 1-6, 2-6 వెనకబడ్డాడు. మూడో సెట్‌లో తీవ్రంగా పోరాడిన జకోవిచ్ 7-6 (8/6)తో కొద్దిసేపు మాత్రమే పోటీలో నిలబడ్డాడు. కానీ, నాలుగో సెట్‌లో విజృంభించిన సినర్ జకో ఆటకు బ్రేక్ వేసి 6-3తో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఫలితంగా ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఇక ఈ మ్యాచ్‌లో జకోవిచ్ 29 అనవసర తప్పిదాలు, నాలుగు డబుల్ ఫాల్ట్స్ చేయగా- సినర్ కేవలం ఎనిమిది తప్పిదాలు, ఒక్కసారి ఫాల్ట్ చేశాడు. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 2018 తర్వాత జొకోవిచ్‌కి ఇదే తొలి పరాభవం కావడం గమనార్హం.
-
Bravo, @DjokerNole 👏👏👏
— #AusOpen (@AustralianOpen) January 26, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
33 consecutive wins at the AO. 10x champion. One of a kind.
Congratulations on an outstanding tournament and Aussie summer 💙 pic.twitter.com/e3fhnw3bSD
">Bravo, @DjokerNole 👏👏👏
— #AusOpen (@AustralianOpen) January 26, 2024
33 consecutive wins at the AO. 10x champion. One of a kind.
Congratulations on an outstanding tournament and Aussie summer 💙 pic.twitter.com/e3fhnw3bSDBravo, @DjokerNole 👏👏👏
— #AusOpen (@AustralianOpen) January 26, 2024
33 consecutive wins at the AO. 10x champion. One of a kind.
Congratulations on an outstanding tournament and Aussie summer 💙 pic.twitter.com/e3fhnw3bSD
వరల్డ్ నెం.2 ర్యాంకర్ ఔట్!
Australian Open 2024 Carlos Alcaraz : ఇదివరకే వరల్డ్ ఛాంపియన్ లిస్ట్‌లో నంబర్ 2 ర్యాంకర్‌గా ఉన్న స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాస్ క్వార్టర్ ఫైనల్‌లోనే నిష్క్రమించాడు. తాజాగా జకోవిచ్ కూడా ఇంటిదారి పట్టడంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మునుపెన్నడు నమోదుకాని సంచలను రికార్డ్ అయింది. ప్రస్తుతం డానిల్ మెద్వెదెవ్ - అలెగ్జాండర్ జెరెవ్ మధ్య మరో సెమీఫైనల్ జరుగుతుంది. ఇందులో గెలిచిన ప్లేయర్‌తో జనిక్ సినర్ ఫైనల్‌లో టైటిల్ కోసం తలపడనున్నాడు. జనవరి 28(ఆదివారం) ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ పోరు జరగనుంది.
50వ ర్యాంకర్ చేతిలో ఓటమి
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచలనం రికార్డైంది. టైటిల్ ఫేవరెట్, మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నెం.1గా ఉన్న పోలండ్ షట్లర్ ఇగా స్వైటెక్కూ ఓటమి తప్పలేదు. ఈమె 3వ రౌండ్లోనే రేస్ నుంచి తప్పుకుంది. ఈ టోర్నీలో చెక్ రిపబ్లిక్కు చెందిన ప్రపంచ 50వ ర్యాంకర్, అన్‌సీడెడ్ ప్లేయర్ లిండా నోస్కోవా చేతిలో టాప్ సీడ్‌గా కొనసాగుతున్న స్వైటెక్ ఓడిపోయింది. 6-3, 3-6, 4-6 తేడాతో మ్యాచ్ ముగిసింది.
'మ్యాచ్ ఫిక్సింగ్' కాంట్రవర్సీలో షోయబ్ మాలిక్- కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న ఫ్రాంచైజీ!
'5 సెంచరీలు చేసినా ఏం లాభం? ఓడిపోయాం కదా- జట్టులో ఆ మార్పు రావాలనుకున్నా!'