Dhoni Cricket Bat : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ తాజాగా నెట్ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాడు. గత కొంత కాలంగా విశ్రాంతి తీలసుకుంటున్న అతడు మరోసారి తన బ్యాట్‌కు పని చెప్పేందుకు సిద్ధమయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సమయం దగ్గర పడుతుండటం వల్ల ధోనీ ఇప్పుడు తన జట్టు కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నారు.
మోకాలి గాయానికి శస్త్రచికిత్స తీసుకున్న ధోనీ కొంత కాలం పాటు రెస్ట్ తీసుకున్నాడు. ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్‌ను స్పెండ్ చేశాడు. అయితే గతంలో ధోనీ ఇక ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించనున్నాడన్న వార్తలు వచ్చాయి. తాజాగా విడుదలైన చెన్నై సూపర్ కింగ్స్ రీటైన్డ్ ప్లేయర్ల లిస్ట్‌లో ఆ రూమర్స్‌కు బ్రేక్ పడింది.
ఈ నేపథ్యంలో తాజాగా అతడు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే అందులో ధోనీ ఉపయోగించిన బ్యాట్‌పై అందరి దృష్టి పడింది. దానిపై ప్రైమ్ స్పోర్ట్స్ అనే స్టిక్కర్ కనిపించింది. దీంతో ఈ కొత్త కంపెనీ ఎవరిదా అంటూ ఫ్యాన్స్ ఆ కంపెనీ గురించి నెట్టింట తెగ వెతికేశారు. తీరా చూస్తే అది ధోనీ చిన్ననాటి స్నేహితుడు పరమ్‌జిత్ సింగ్‌కు చెందిన స్పోర్ట్స్ షాప్‌ను అని తెలిసింది. తన ఫ్రెండ్ షాప్‌ను ధోనీ ఇలా ప్రమోట్ చేయడం పట్ల తల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
-
IPL 2024 Come Soon, Can't wait to Watch Thala Dhoni in Vintage Look !! 💛🥹#MSDhoni #WhistlePodu #CSK #IPL2024 pic.twitter.com/O5xkR4yHmI
— Saravanan Hari 💛🦁🏏 (@CricSuperFan) February 8, 2024
Dhoni Career : కెరీర్ ప్రారంభంలో ధోనీకీ తన స్నేహితులు ఎంతగానో సహకరించారు. ధోనీ కూడా పలు ఇంటర్వ్యూల్లో తరచూ వారి గురించి చెబుతూనే ఉండేవాడు. తాజాగా కూడా చాలా సమయం స్నేహితులతోనే గడిపిన ఫొటోలను షేర్ చేసుకున్నాడు.ఇక 2016లో ధోనీ బయోగ్రఫీగా విడుదలైన 'ఎంఎస్ ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాలోనూ వీరి స్నేహబంధాన్ని చక్కగా చూపించారు. ఇక రానున్న సీజన్లో మరింత జోష్‌తో ఆడేందుకు సిద్ధంగా ఉన్న ధోనీ, గతేడాది సీఎస్‌కేను విజేతగా నిలిపినట్లుగానే ఈ సారి కూడా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి ఆ జట్టును ఛాంపియన్‌గా నిలపాలనే లక్ష్యంతో బరిలోకి దిగనున్నాడు.
ధోనీ లాస్ట్ సీజన్!, పంత్ కమ్‌బ్యాక్- 2024 IPL మరింత ఆసక్తికరంగా
ధోనీకి పాక్ నుంచి స్పెషల్ ఇన్విటేషన్ - 'క్రికెట్ గురించే కాకుండా మరోసారి రావాలి'